నవ్వులజల్లు - అచ్చంగా తెలుగు

నవ్వులజల్లు

Share This

నవ్వులజల్లు

-ప్రతాప వెంకట సుబ్బారాయుడు


  1. రజనీష్: ఏరా..దురదలున్నాయని నిన్న డాక్టర్ దగ్గరకివెళ్లావు కదా! ఏం రాసిచ్చాడు?
అమరేష్: మందులతో పాటు ఒక దువ్వెన వాళ్ల బామ్మర్ది కిరాణా షాపులో కొనుక్కోమని..
***
  1. రామారావు: ఏరా, నువ్వు మోసపోయిన విషయం ఎప్పుడు తెలిసింది?
కృష్ణారావు: సాంతం మునిగిపోయాక..
***
  1. కనకం: అదేంటి కాంతం..నువ్వు టిఫిన్లో పెట్టిన కూర అంత దరిద్రంగా ఉంది?
కాంతం: అదా..టీ వీ లో చూసి చేస్తుండగా..కరెంటు పోయింది..సొంతంగా చేసేసా..
***
  1. కన్నారావు: మా అబ్బాయి స్కూలు మాని సినిమాలకెళుతున్నాడ్రా?
గున్నారావు: ఆ విషయం నీకెలా తెలిసింది? కన్నారావు: నేను ఆఫీసుకి డుమ్మాకొట్టి సినిమాకెళితే..
***
  1. అమరనాథ్: హెల్మెట్ తప్పనిసరి చేయడం ఇబ్బందిగా లేదా?
రఘునాథ్: ఊహూ..ఎంచక్కా అప్పులవాళ్ల బారినుండీ సునాయాసంగా తప్పించుకు తిరుగుతున్నా..
***
  1. వెంకట్రావు: మా అమ్మాయిని చాక్లెట్లు తినడం మంచిది కాదు, మానెయ్యమంటే ఏమందో తెలుసా?
పుల్లారావు: ఏమంది? వెంకట్రావు: సిగరెట్లు తాగడం మాత్రం మంచిదేంటి..మీరూ మానెయ్యండి అంది.
***
  1. జడ్జి: పక్క జిల్లా జడ్జి ఇంట్లో దొంగతనం ఎందుకు చేశావు?
దొంగ: మీ ఇంట్లో చేస్తే ఎక్కువ శిక్ష వేస్తారేమోనని..
***
  1. జంబుముని: నేను కళ్లు మూసుకుని తపస్సు చేసుకుంటుంటే..రెండు పెదాలు నా పెదాలతో వెచ్చగా జతకట్టాయి ఎవరివో తెలుసా?
కంబుముని: రంభవో..ఊర్వశివో అయ్యుంటాయి.. జంబుముని: కాదు..ఎలుగుబంటువి..
***

No comments:

Post a Comment

Pages