ప్రకృతి - అచ్చంగా తెలుగు

ప్రకృతి

Share This

ప్రకృతి

సుజాత తిమ్మన...

9301341029


ఆకాశం అప్పుడే అన్నది..
విశ్వమంతా వ్యాపించి ఉన్న...
పరమాత్మనని ..
ఓర చూపులలో సీతను
బందించిన శ్రీరాముడను నేనే నని...
ఆకాశం అప్పుడే అన్నది..
పుడమి తల్లి తలవంచు కున్నది..
నారాయణుని ఎదపై నిలిచిన
శ్రీ లక్ష్మి నని..
రాఘవుని తపనల వానలో
తడిచి..ముకుళించి ముగ్ధఅయిన
జనని జానకి..తలవంచు కున్నది..
చిరుగాలికి ఊగిసలాడు గడ్డి పరకలపై.
నిలిచిన తుషార బిందువులు..
నిలిచే,,, ముత్యాల సరాలై...
బాల భానునివెలుగు రేఖలు ..
సాలీడు వలలలో చిక్కి...
వెండి గీతలముగ్గులై మెరుస్తుండే..
ఉరుకులు..పరుగుల పట్నవాసానికి దూరంగా..
మోటారు బండ్ల రణగొణ ద్వనులు లేని..
ఏకాంతపు పచ్చిక పై..
స్వచ్చతను శ్వాసిస్తూ...
జలపాతాల గలగలలను..
పేర్లు తెలియని వింత పక్షుల
కిచ కిచలను...ఆలకిస్తూ..
ఆకాశమై వింటిని విరిచిన రామయ్యకు..
వసంతంలో విరిసిన విరజాలుల మాలను
ఆ రఘుకులోత్తముని మెడనలంకరిస్తున్న..
భూ పుత్రి అయిన ...మైథిలి..కళ్యాణోత్స వం..
చూసేందుకు ఈ కన్నులు చాలవు..
ప్రకృతి కన్య...
కాలం పురుషునిలో...
ఎకమైయ్యే వేళ..
అరుణ వర్ణపు పారాణిపాదాలకు..
రెండిరేఖలమెట్టెలెంత శోభలనిచ్చేనో..
ప్రతి కూలతనంతో..ప్రతి దేశం..
ప్రగతి సాదిస్తున్నాం అనుకుంటుందే కాని..
పలుచనవుతున్న ఓజోన్ పొరలను పట్టించుకోవటం లేదు..
వాతావరణ కాలుష్యంతో ..వ్యాదులు ప్రభలి..
మనిషి జీవితం విచ్చినం చేస్తున్నాయి...
“ప్రతి మనిషి ఒక మొక్క నాటాలి “ అన్న సిద్దాంతాన్ని..
అనుసరిస్తూ...మన ఈ ప్రకృతి తల్లిని కాపాడుకుందాం..
పరంధాముని కళ్యాణ వేడుకలను ప్రతి దినం తిలకిద్దాం...!
*** ***** ***** **** ***

No comments:

Post a Comment

Pages