ప్రేమతో నీ ఋషి – 12 - అచ్చంగా తెలుగు

ప్రేమతో నీ ఋషి – 12

Share This

ప్రేమతో నీ ఋషి – 12

యనమండ్ర శ్రీనివాస్


( జరిగిన కధ : కొన్ని శతాబ్దాల క్రితం... ఇంద్రుడి ఆజ్ఞమేరకు ,మేనక తన రూపలావణ్యాలతో విశ్వామిత్రుడిని సమ్మోహనపరచి, అతని తపస్సును భగ్నం చేస్తుంది. కొన్ని దశాబ్దాల క్రితం... మైసూరు మహారాజు సంస్థానంలో గొప్ప భారతీయ చిత్రకారుడిగా పేరుపొందిన ప్రద్యుమ్న ‘ప్రపంచ కొలంబియన్ ప్రదర్శన’ కోసం, రాకుమారి సుచిత్రాదేవినే తన చిత్రానికి నమూనాగా వాడుతూ, మేనక విశ్వామిత్రుడికి తపోభంగం చేసే సన్నివేశాన్ని అత్యద్భుతంగా చిత్రిస్తూ, ఈ క్రమంలో రాకుమారితో ప్రేమలో పడి గుప్తంగా రాజ్యం వదిలి పారిపోతాడు. రాజు పారెయ్యమన్న ఆ చిత్రం అనేకమంది చేతులు మారి, చివరగా  దాన్ని బ్రిటన్ తీసుకువెళ్ళాలన్న కోరికతో కొన్న ఒక విదేశీయుడి  వద్దకు చేరుతుంది. ఆ తర్వాత అది ఏమైందో ఎవరికీ తెలీదు. 
ప్రస్తుతం... ముంబై స్టాక్ ఎక్స్చేంజి లో పనిచేస్తున్న త్రివేది గారు, ఉదయాన్నే ఫాక్ష్ లో వచ్చిన సందేశం చూసి, అవాక్కవుతారు... కారణం తెలియాలంటే, కొంత గతం తెల్సుకోవాలి....  కొన్ని నెలల ముందు మాంచెస్టర్ లో  గొప్ప వ్యాపార దిగ్గజమైన మహేంద్ర, చేపట్టిన ‘ప్రద్యుమ్న ఆర్ట్ గేలరీ’ ప్రాజెక్ట్ కోసం చిత్రాలు సేకరించేందుకు అతని మాంచెస్టర్ ఆఫీస్ లో పనిచేస్తుంటారు స్నిగ్ధ, అప్సర. ఈ క్రమంలో స్నిగ్ధకు స్విస్ బ్యాంకు మాంచెస్టర్ ఆఫీస్ లో సీనియర్ క్లైంట్ బ్యాంకర్ గా పనిచేస్తున్న ఋషి తో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారుతుంది. ఋషిని  అప్సర సామీప్యంలో చూసిన స్నిగ్ధ మనసు క్షోభిస్తుంది. స్నిగ్ధ తో కలిసి ముంబై వెళ్తుండగా, జరిగినదానికి సంజాయిషీ ఇవ్వబోయిన ఋషిని పట్టించుకోదు  స్నిగ్ధ.  అతను మౌనం వహించి, కళ్ళుమూసుకుని, గత జ్ఞాపకాలు నెమరేసుకుంటూ ఉంటాడు...  ఆర్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్’ కోసం పనిచేసేందుకు మాంచెస్టర్ వచ్చి, ముందుగా ఆర్ట్ గురించిన అవగాహన కోసం ప్రయత్నిస్తున్న ఋషి, ఫేస్బుక్ లో స్నిగ్ధ ప్రొఫైల్ చూసి, అచ్చెరువొందుతాడు. స్నిగ్ధకు మహేంద్ర కంపెనీ లో ఉద్యోగం వస్తుంది. ఈలోగా ఋషి మాంచెస్టర్ ఆర్ట్ గేలరీ దర్శించేందుకు వచ్చి, స్నిగ్ధను కలిసి, ఆమెనుంచి ఆర్ట్ కు సంబంధించిన ఎన్నో విషయాలు తెలుసుకుంటాడు. ఫేస్ బుక్ లో ఋషి, స్నిగ్ధ చాటింగ్ ద్వారా వారిద్దరూ మరింత చేరువ అవుతారు. కొత్తగా చేరిన ఉద్యోగంలో మృణాళ్, అప్సరల ప్రవర్తన స్నిగ్ధకు ఆశ్చర్యం కలిగిస్తుంది, అదే ఋషితో చెప్తుంది. మహేంద్రను కలిసిన ఋషి, అతని వ్యాపార ప్రతిపాదనకు అంగీకరించి, స్నిగ్దను, అప్సరను ఆఫీస్ లో కలుస్తాడు. అప్సర, ఋషి మధ్య చనువు స్నిగ్ధకు ఆందోళన కలిగిస్తుంది. ఇక చదవండి...)
“గుడ్ ఈవెనింగ్ స్నిగ్ధ, అయితే నేను నిన్ను నీవున్న చోటునుంచి పిక్ అప్ చేసుకోనా ?” రుషి స్నిగ్దను అడిగాడు.
అది చిత్రాల వేలం వెయ్యబోయే రోజు సాయంత్రం. స్నిగ్ధ అప్సర, ఋషి తో పాటు ఆర్ట్ ఫండ్ కలెక్షన్ కు చెందినా చిత్రాల వేలాన్ని పూర్తి చెయ్యాల్సి ఉంది.
“ఓ, ఇవాళ కూడా నువ్వు అప్సరతో బిజీగా ఉంటావని అనుకున్నాను !” కోపాన్ని అణచుకోలేక వెంటనే తన భావాల్ని వెలిబుచ్చింది స్నిగ్ధ. గత కొన్నిరోజులుగా వేలానికి సంబంధించిన పనిలో రుషి అప్సరతో బిజీ గా ఉన్నాడు. కొన్నిసార్లు స్నిగ్ధ అతనితో మాట్లాడాలనుకుంటే, అతను ఫోన్ కూడా తీసేవాడు కాదు. అందుకే ఆమెకి కాస్త దిగులుగా ఉంది.
“హ హ స్నిగ్ధ, నీకెంత అసూయ. దిగులుపడకు, నీకోసం నేనింకా ఇక్కడే ఉన్నాను. నేనొచ్చి నిన్ను పిక్ అప్ చేసుకుంటాను. మామూలుగా ఉండు, ఐ లవ్ యు,” అంటూ బదులిచ్చాడతను.
“ఓకే, నువ్వు ఫ్రీగా ఉంటే అరగంటలో ఇక్కడికి రా. నేను తయారయ్యి, మా భవంతి వద్ద నీకోసం నిరీక్షిస్తాను.” స్నిగ్ధ నిష్టూరాలాడకుండా బదులిచ్చింది. విషయాన్ని ఇంకా సాగదీసి, ఈ క్షణాన్ని పాడుచెయ్యటం ఆమెకు ఇష్టంలేదు.
“అలాగే” అంటూ ఋషి ఫోన్ పెట్టేసాడు.
ఆమె తయారవ్వగానే బైటికొచ్చి, ఋషి కోసం నిరీక్షించసాగింది. చల్లగాలి ఆమె చెంపల్ని తాకుతోంది. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. మరో ఐదు నిముషాల్లో ఋషి తన కార్లో రాగానే స్నిగ్ధ లోపలికి ఎక్కి  కూర్చుంది.
“గుడ్ ఈవెనింగ్ స్నిగ్ద,” అన్నాడు ఋషి.
“గుడ్ ఈవినింగ్ ఋషి, సాయంత్రానికి అంతా సిద్ధమేనా?” ఋషిని విచారించింది స్నిగ్ధ. ఆమె కూడా ఈ రోజుకోసం నిరీక్షిస్తోంది, ఆర్ట్ మ్యుజియం టార్గెట్ ఈ రోజుతో పూర్తికానుంది.
“కాఫీ తాగుదామా ? నేను లంచ్ కు ఏం తినలేదు. టైం దొరకలేదు,” అంటూ బరిష్టా వద్ద కార్ ఆపాడు ఋషి. కార్ ప్రక్కకు పార్క్ చేసి, స్నిగ్ధ దిగేందుకు డోర్ తెరిచాడు.
“కాఫీకి ఎప్పుడైనా సిద్ధమే. పూర్వకాలంలో దాన్ని అరేబియన్ వైన్ అనేవారు అని విన్నాను.” అంది స్నిగ్ధ అతని ఆహ్వానం మన్నిస్తూ. ఇద్దరూ బరిస్టాలోకి వెళ్ళారు.
“దాని గురించి నాకు తెలీదుకాని ఇటాలియన్ భాషలో బరిష్టా అంటే కాఫీ సర్వ్ చేసే బార్ అటండర్ అని నాకు తెలుసు. ఇప్పుడు, మనం ఆర్డర్ ఇవ్వడానికి బరిష్టాను పిలుద్దాము. “, అంటూ ఋషి సర్వీస్ స్టాఫ్ వారిని పిల్చి, రెండు కప్పుల వేడి ఎక్ష్ప్రెసో తెమ్మన్నాడు.
అయితే గత రెండు రోజులుగా హడావిడిగా పరిగెడుతూ ఉన్నావా ? వేలానికి సంబంధించిన ఏర్పాట్లలో నిజంగా బిజీగా ఉండుంటావు కదూ?” విచారించింది స్నిగ్ధ.
“నిజమే, నా కొలీగ్ లీవ్ లో ఉన్నాడు. ఈ వేలం విజయం సాధిస్తే, పడ్డ శ్రమంతా ఎగిరిపోతుంది. తిండి కూడా మానేసి, కేవలం కాఫీల మీద బ్రతుకుతున్నాను.” నవ్వుతూ అన్నాడు ఋషి.
“కాని ఇది నాకు మామూలే. చదువుకునేటప్పుడు ఇలాగే చేసేవాడిని. రోజుకి మామూలుగా 3,4 కప్పుల కాఫీ తాగేవాడిని. అది రాత్రి చదివేటప్పుడు నన్ను మెలకువగా ఉంచేది,” అంటూ మానసిక స్థితిపై కాఫీ ప్రభావాన్ని గురించి ప్రస్తావిస్తూ అన్నాడు ఋషి.
చాలామందికి కెఫీన్,” ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ” నిషేధించిన వాటి లిస్టులో ఉందని తెలీదు. ఒక మి.లీ మూత్రంలో 12 మైక్రోగ్రాముల కంటే ఎక్కువ కెఫీన్ కలిగిన అధ్లెట్ లను ఒలెంపిక్స్ నుంచి బాన్ చేస్తారు. కేవలం 5 కప్పుల కాఫీతో ఈ స్థాయికి చేరవచ్చు.
“అలాగా ? అయితే నువ్వు టర్కిష్ వధువుకు తగిన వరుడివి. టర్కీలో వరుడు తన వధువును సరికొత్త రకాల కాఫీలతో మురిపిస్తానని ప్రమాణం చెయ్యాలి. అలా చెయ్యలేకపోతే అది విడాకులకు అర్హమౌతుంది.” అంది స్నిగ్ధ నవ్వుతూ, ఋషి కూడా శృతి కలిపాడు.
“అలా అయితే నువ్వు కూడా టర్కిష్ వరుడికి తగ్గ వధువువేగా, నువ్వు ఎన్ని కప్పుల కాఫీ అయినా తాగగలవు. నీకు తాగేందుకు బోర్ కొడితే, కాఫీ పొడితో కళాఖండాలు సృష్టిస్తావు,” అంటూ కాఫీ షాప్ లోని టేబుల్ క్లాత్ ను చూపాడు ఋషి. ఆ బట్టపై ఎక్ష్ప్రెసో కాఫీతో “కరేన్” అనే అనే కాఫీ ఆర్ట్ స్పెషలిస్ట్ వేసిన చిత్రాలున్నాయి.
కాఫీ ఆర్ట్ అనేది ఒక అరుదైన కళ. దానికి సున్నితమైన స్పర్శ కావాలి. అది చాలా క్లిష్టమైన ప్రక్రియ. ఎక్ష్ప్రెసో పై పొరల్ని నిర్మించాలి. కరేన్ వేసిన పెయింటింగ్స్ తాజా కాఫీ పరిమళంతో ఘుమఘుమలాడుతూ ఆ కాఫీ షాప్ లో ఉన్నాయి. చిన్నగా వినవస్తున్న మాటలు, కాఫీ ఆవిర్లు, పరిమళం ఆమె పెయింటింగ్స్ లో కొత్త కోణాల్ని ఆవిష్కరించేలా ప్రేరణ కలిగించాయి.స్నిగ్ధ, ఋషి ఆర్టిస్ట్ ఎక్ష్ప్రెసో తో వేసిన పెయింటింగ్స్ ను పొగిడారు. వారి దృష్టి అప్పుడు వస్తున్నా టీవీ న్యూస్ కవేరేజ్ పై పడింది. అక్కడ క్రింది వైపు స్క్రోల్ లో వేలం గురించిన వివరాలు ఉన్నాయి.
“ అయితే మహేంద్ర కూడా ఈ వేలానికి వస్తున్నారా?” ఋషి మొదటి సిప్ తీసుకుంటూ స్నిగ్దను అడిగాడు.
“లేదు, ఆయనెందుకో ఒక కోర్ట్ కేసు కోసం వెంటనే ఇండియా కు వెళ్ళాల్సి వచ్చింది. నిజానికి ఆయన రావాలనే అనుకున్నారు. కానే, హఠాత్తుగా నిన్న సాయంత్రం వెళ్ళిపోయారు. ఆయన బదులు అప్సర మనతో వస్తుంది.” స్నిగ్ధకు మహేంద్ర వెళ్ళిపోయి, అప్సరకు వచ్చే వీలు కల్పించడం కాస్త అసంతృప్తిగా ఉంది. అలా జరగటం ఆమెకు ఇష్టం లేదు. కాని, తన బాస్ ఆర్డర్ కనుక, ఏమీ మాట్లాడలేకపోయింది.
“అలాగా? అయినా అప్సర కూడా బాగా పనిచేస్తుంది. అందుకే ఇబ్బంది లేదు,” అన్నాడు ఋషి మామూలుగా కాఫీ త్రాగుతూ.
స్నిగ్ధ తాగుతున్న కాఫీ ప్రక్కన పెట్టి,” నువ్వు అప్సరతో సంబంధాల్ని కాస్త నియంత్రించుకుంటే మంచిది.” అంది. ఋషికి ఆమె భావాలు అర్ధం కావడంతో సంభాషణ పొడిగించలేదు. ఆమె కాఫీ తాగడం పూర్తి చెయ్యగానే ఇద్దరూ ఋషి కార్లోకి ఎక్కి, వేలం జరగనున్న హోటల్ వైపుకు వెళ్ళారు.
***
కాన్ఫరెన్స్ రూం ప్రవేశ ద్వారం వద్దే అప్సర వాళ్ళను కలిసి గ్రీట్ చేసింది. స్నిగ్ధ ఆమెకు జీవం లేని ఒక నవ్వును బదులిచ్చింది.
ఋషి వాళ్ళను లోనికి తీసుకు వెళ్ళాడు. రూం లోకి వెళ్ళగానే వాళ్ళకు ఒక 'పాడిల్ ' ను ఇచ్చారు. 'పాడిల్ ' అనేది వేలానికి వచ్చేవారు చేతిలో పట్టుకోదగ్గ చిన్న నోటీస్ బోర్డ్. చేతులెత్తే బదులు, వేలం లో కొనుగోలుదారులు దీన్ని చూపుతారు.
స్నిగ్ధకు ఇదంతా కొత్త కనుక కాస్త అసౌకర్యంగా ఉంది. ఆమెకు చిన్న ఆఫీస్ గదిలో చిత్రాల వెల గురించి చర్చిస్తూ పని చెయ్యడమే బాగున్నట్లు అనిపించింది. కానీ సజీవ చిత్రాల కొనుగోలుకు మిలియన్ల రూపాయల్ని విసిరేసే వ్యక్తుల్ని వ్యక్తిగతంగా కలవటం ఇదే ఆమెకు మొదటిసారి. రెప్పపాటులో మిలియనీర్ల సంపద్ను కదిలించగల చిత్రకారుల భావనలకున్న శక్తిని చూసి ఆమె ఆశ్చర్యపోతూ ఉంటుంది. ఆమె అందర్నీ గమనిస్తూ ఉండగా, ఆ రూంలో ఒక మూల కూర్చున్న కొందరు టెలిఫోన్ కాల్స్ మాట్లాడుతున్న రిసెప్షనిస్ట్ ల వంటి కొంతమంది అమ్మాయిలు ఆమె దృష్టిని ఆకర్షించారు.
వేలానికి వచ్చేవారు హాజరును మామూలుగా ఆరక్కడికి స్వయంగా వస్తేనే వేస్తారు. ఆర్ట్ కలెక్టర్లు స్వయంగా కొనుగోళ్ళు చేస్తారు లేక వాళ్ళ ప్రతినిధులని పంపుతారు. వారి బిజీ షెడ్యూళ్ళను దృష్టిలో పెట్టుకొని, వారిని టెలిఫోన్ ద్వారా కూడా పాల్గొనే అవకాశాన్ని ఆక్షన్ హౌస్లు ఇస్తాయి. 'ఆక్షన్ బేబ్స్ ' గా పిలవబడే అంకితభావంగల ప్రతినిధుల ద్వారా, అక్షన్ హౌస్లు  కలక్టర్స్ కు వేలాన్ని వినే సదుపాయాన్ని  కల్పిస్తాయి.
వేలం వేసే వ్యక్తి రాగానే క్కడ నిశ్శబ్దం అలముకొంది. వేదికపైన ఉన్న గంట కొట్టడం ద్వారా అతను వేలం ప్రక్రియ ఆరంభమయిందని ప్రకటించాడు.
"ముందుగా మనం పికాసో పెయింటింగ్ తొ మొదలుపెడదాం. ఈ పెయింటింగ్ చరిత్ర, ఇది జాన్ మెనార్ట్ కీన్స్ సేకరణ లో ఉందని తెలుపుతుంది. ఇతను గొప ద్రవ్యోల్బణ ఆర్ధిక వేత్త. ప్రపంచ బ్యాంకు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ సృష్టికర్త ' అంటూ అతను అందరికీ వీరాలు చెబుతుండగా, తొలివిడత పెయింటింగ్ ను వేలం కోసం ప్రదర్శనకు ఉంచారు.
"కీన్స్ ఆర్ట్ కలక్టర్ అని నాకు తెలీదు", అంటూ రుషితో నెమ్మదిగా అంది అప్సర, అంతా వేలంలో పాల్గొంటుండగా. ఇది 'భారతీయ కళాఖండాల ' జాబితాలో లేకపోవడం వలన అప్సర అందులో పాల్గొనలేదు.
"చాలామందికి అతను ప్రపంచంలోనే ధనవంతుడైన ఆర్ధికవేత అని మాత్రమే తెలుసు. కానీ అతని వ్యక్తిగత జీవితం కూడా ఆసక్తికరం గా ఉంటుంది. అతను స్వలింగ సంపర్కుడని, అతని కాలంలోని ఒక మగ ఆర్టిస్ట్ తో ప్రేమలో ఉన్నాడని అంటారు. చివరికి అతను బల్లెరినా అనే రష్యన్ ను పెళ్ళి చేసుకున్నడు" అని రుషి అప్సరకు చెప్పాడు.
"రుషి, నువ్వు నిజంగా గొప్పవాడివి. ఇవన్నీ ఎలా గుర్తుంచుకొంటావు? నువ్వు చెప్పేవి వింటూనే ఉండాలనిపిస్తుంది", అమెచ్చుకొంది అప్సర.
"మాతుర్స్య మహాప్రీతి; శ్రంగారరస చింతనం, పరోపదేశే పాండిత్యం, పండితస్య త్రయోగుణా" అంటూ సంస్కృత శ్లోఅకం చదివి, దాని అర్ధం అప్సరకి చెప్పాడు. "మిఠాయిల పట్ల ఆశక్తి, శ్రంగారం గురించి ధ్యాస, విషయాల వివరణలో నైపుణ్యం, ఇవి ఓక్ నిపుణిడి ప్రమాణాలు" అంటూ కన్ను గీటి "నేనెల్లప్పుడూ నిపుణుడననే అనుకుంటాను" అన్నాడు. అప్సరకు అది నచ్చింది.
స్నిగ్ధ వేలాన్ని చూడడం లో బిజీగా ఉండడంలో వాళ్ళ మాటలు వినలేదు.
"రెండవ విడత వేలం వేయ బోయేవి మొఘల్ ల కాలంలో భారతీయ చిత్రాలు. 'బేతింగ్ విలేజ్ లేడీ' అనే పెయింటింగ్ ఇంది. అంతా మీ వద్దనున చాటలాగ్ లోని లాట్ నంబర్ 25 ని చూడండి. దాని వెల 1.2" అంటే ఆక్షన్ హౌస్ వారు నిర్ణయించిన వెల GBP1.2 మిలియన్లు. భారతీయ వెల సూఅరు 8 కోట్ల రూపాయలు.
ఎవరైనా సిద్ధపడతారా అనుకుంటూ స్నిగ్ధ చూస్తుండగానే 6 పాడిల్స్ గాల్లోకి లేచాయి. వేలం మొదలవగానే ఆ గదిలో ఒక ఉత్సాహభరితమైన వాతావరణం అలముకొంది. అందర్నీ వేలం వేసే అతను నియంత్రిస్తున్నాడు. చివరికి అది GBP1.5 మిలియన్లకి ఖరారు కాగానే ఆక్షనీర్ సుత్తిని కొట్టి వేలం పూర్తి అయిందని సూచించాడు.
ఈ స్థితిలో అప్సర జోక్యం చేసుకొని 1.6 మిలియన్లకు దాన్ని సొంతం చేసుకొంది.
"అయితే మీరు ఈ రోజు మొదటి పెయింటింగ్ కొన్నారు. చిత్రాల్లో మృదువైన సృంగారాన్ని గుర్తించడంలో మెరు నిపుణులే" అప్సరతో గుసగుసలాడాడు రుషి.
"నేను ఆర్ట్ రంగంలోకి రాగానే, ఒక విషయం గుర్థించాను ", అంది అప్సర. "శృంగార భరితమైన స్త్రీల చిత్రాలను వారి శరీరాకృతిని ప్రతిబింబిచేలా చాలా మంది చిత్రకారులు గీసారు. పూర్వకాలం లో వీనస్ పెయింటింగ్స్ అయినా, ప్రద్యుమ్న చిత్రాలైనా, ఆలయాల్లో చిత్రాలైనా చిత్రకారుల ప్రధాన ఉద్దేశం స్త్రీల దేహంలోని సూక్ష్మమైన అంశాల పట్ల ఆరాధన్. ఈ విషయం నిపుణుల స్వీయ విమర్శలకు అందనిది", రుషి పొగడ్కు స్పందిస్తూ అంది అప్సర.
"ప్రద్యుమ్న?" అంటూ రుషి వెంటనే ఆ అర్టిస్ట్  తో అనుసంధానమయ్యాడు". మె వద్ద ఆ చిత్రకారుడి చిత్రాలు ఏమైనా ఉన్నాయా? ఆయన చేసిన వాటన్నిటిలో మేనకా విశ్వామిత్ర చిత్రం గొప్పదని విన్నాను".అన్నాడు రుషి.
"మహేంద్ర కూడా దాన్ని గురీంచి చెప్పారు. నా నెట్వర్క్ లో ఎవరో ఒకరి ద్వారా దాన్ని మ్యూజియం కోసం తేగలనని అనుకుంటున్నాను", బదులు ఇచ్చింది అప్సర.
రుషి చాలా ఉత్సాహభరితంగా "మీకది దొరికితే, అందరికన్నా ముందు దాన్ని నాకు చూపిస్తారా?" అని అడిగాడు బ్రతిమాలుతూ.
అతనంత ఉత్సుకతతో ఎందుకు ఉన్నాడో అప్సరకు అర్ధం కాకపోయినా, వేలం పని పూర్తయ్యాకా కూడా ఋషిని పట్టి ఉంచేందుకు తనకొక అంశం దొరికిందని, ఆమె సంతోషించింది.
వేలం సాయంత్రం దాకా కొనసాగింది. ఈ ప్రక్రియలో వేలం ధరని ఆక్షనీర్ ప్రకటించగానే వేలంలో పాల్గొనేవారు ధరను పెంచసాగారు. చివరికి అప్సర అందరికంటే ఎక్కువ ధరను చెల్లించి, చిత్రాలను సొంతం చేసుకుంది. ఆమెకు దగ్గరగా పాల్గొన్నది జర్మనీకు చెందిన ఆర్ట్ కలెక్టర్ అశ్విన్ మెహతా. అతను చిత్రాల కోసం చాలానే ప్రయత్నించాడు కాని, ఒక స్థాయి దాటి వెళ్ళలేక పోయాడు.
“ఇవాళ నువ్వు నన్ను మీరిపోయావనే చెప్పాలి,” అన్నాడు అశ్విన్ వేలం తర్వాత డ్రింక్ తాగుతుండగా.
“ నేను వీటికోసం చాలాకాలంగా ఎదురు చూస్తున్నాను. కాని, ఇవి ఎవరి ప్రైవేట్ కలెక్షన్ కూ వెళ్లనందుకు నాకు సంతోషంగా ఉంది. ప్రదర్శించని పని, చెయ్యని పనితో సమానం,” అని నా అభిప్రాయం. అంది అప్సర.
జాతీయ కళాఖండాలుగా ముద్రించబడిన వాటిలో కేవలం 10% తప్ప, అప్సర దాదాపు అన్ని పెయింటింగ్స్ ను వేలంలో కొనేసింది. మొత్తం వంద చిత్రాలను ఆమె వందకోట్ల రూపాయలతో కొనగలిగింది.
“మీ పొగడ్తకు కృతఙ్ఞతలు. కానీ, మీరు నా గాలరీకి వచ్చి, కొన్ని పెయింటింగ్స్ ను చూస్తే, మీరు నిరాశపడరు. అవి మీరు కొనేందుకు నేను సాయం చేస్తాను. “ అంది అప్సర అతనికి విజిటింగ్ కార్డు ఇస్తూ. అశ్విన్ నవ్వుతూ అక్కడినుండి వెళ్ళిపోయాడు.
ఋషి అప్సరను అభినందించేందుకు చెయ్యి చాపాడు. ఆమె అవసరమైన దానికంటే ఎక్కువసేపే అతని చేతిని పట్టుకుంది. ఆ తర్వాత అతనిపైకి ఒరిగిపోతూ తిరగసాగింది.
ఇద్దఋ వ్యక్తుల మధ్య దూరం వారి కోరికనో, నిరాసక్తతనో తెలియజేస్తుంది. ప్రొక్షిమిక్ష్ – లేక శరీర భాషా శాస్త్రం ప్రకారం ఇద్దరు వ్యక్తుల సంప్రదింపుల్లో నాలుగు వర్గాలుంటాయి. ఇద్దరూ ఒకరిపట్ల ఒకరు ఆకర్షితులైతే, దూరం (6-18 అంగుళాలు )ఉంటుంది , మంచి స్నేహితుల మధ్య దూరం (1.5-4 అంగుళాలు), సాంఘిక సంభాషణల్లో దూరం (4-12 అడుగులు), సభల్లో పాటించే దూరం  (12 అడుగుల కన్నా ఎక్కువ).
ఆమె ఋషి వైపు వాలుతూ ఉండగా ఆమె వెచ్చటి శ్వాస అతని భుజాల్ని తాకసాగింది. అది అతనికి అనుకున్న దానికంటే ఎక్కువ ఉద్రేకాన్ని కలిగించింది. వారిద్దరి మధ్య దూరం కేవలం 5 అంగుళాలు. ఋషికి మామూలుగా స్త్రీలను ఇంప్రెస్స్ చేసేందుకు ఎక్కువ సమయం పట్టదు. అప్సరకు తనకు నచ్చిన వాళ్ళ వైపు ఒరిగేందుకు ఎవ్వరూ ఆహ్వానించాల్సిన పనిలేదు. నిజానికి, అప్సర తనంతట తానుగా ఎవరినైనా చూసి నవ్వితే, ఆ రోజు అతన్ని అదృష్టం వరించినట్లే.
ఆ రోజున ఋషి అదృష్టవంతుడు అయ్యాడు. స్నిగ్ధ కొన్న చిత్రాల ధరకు సంబంధించిన అంశాలు పరిశీలిస్తూ ఉండడంతో వారిద్దరి మధ్యా ఏమి జరుగుతోందో చూడలేదు. ఫలితంగా, ఆమె వేలానికి సంబంధించిన పనులు పూర్తిచేసేసరికి, ఋషి, అప్సర మధ్య ఆ సాయంత్రం కొత్త బంధాన్ని ఏర్పరచింది.
(సశేషం)

No comments:

Post a Comment

Pages