శివం – 21
(శివుడే చెబుతున్న కధలు )
రాజ కార్తీక్
9290523901
మంత్రిగారు కళ్ళు తెరిచి చూశాడు. ఇదంతా అతని కలా? సహజంగా మంత్రిగారికి ఉద్భవుడి మీద సహజ వాత్సల్యం కలదు. అందులకే ఆయన ఉద్భవుడి గూర్చి చింతిస్తున్నాడు. అర్ధరాత్రి అతనికి వచ్చిన కల చూసి దిగ్ర్భాంతి చెందాడు. తన కల నిజమగుటకు కావలసిన లక్షణాలు ఉద్భవుడిలో ప్రస్పుటంగా కనిపిస్తున్నాయి. తన మందిరంలో ఉన్న శివలింగము దగ్గరికి వెళ్ళి “మహేశ్వర! మా ఉద్భవుడిని క్షమించు “ అని ప్రాధేయపడుతున్నాడు. ఆ ప్రార్ధన నాకు చేరింది,ఏమి చేయాలో నాకు తెలుసు తెల్లవారబోతుంది.
ఇక నిజమైన కార్తీక శుద్ధ పాడ్యమి.
దేవాలయం...పూజలు...భటులు...గుడిలో భటుల ప్రవేశం..పౌరుల ప్రతిఘటన గుడిలో పూహళ్ భంగం... ప్రజల్ని కట్టిపడేయడం... ఉద్భవుడి రాక, అతగాడి ప్రేలాపన అంతా తన కలలో మాదిరి నిజంగా జరిగింది. మంత్రిగారికి భయం వేయసాగింది, తన కలలో లాగా శివుడు ఉద్భవుడ్ని ప్రత్యక్షం చంపడానికి వస్తాడని కాని, జరుగుతున్న పరిణామాలు అంతే ఉన్నాయి. ఇక, ఉద్భవుడి పైశాచికత్వం తీవ్రస్థాయికి చేరింది. బ్రాహ్మనోత్తముల నందరిని బయటకు లాగి ఒకచోట చేర్చాడు. వాళ్ళతో “విప్రులారా! రాజాజ్ఞను దిక్కరించారు...”
విప్రులు: ఇది ఒక రాజాజ్ఞ, భగవంతుని పూజించవద్దు కంటే మరొక దారుణమైన విషయం ఉందా?
ఉద్భవుడు: “అలాగా అయితే ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి, వాటిని చూస్తూ బ్రతికారుగా, నిమ్నకులం అని పేరుచెప్పి కొంతమందిని గుడిలోకి రానివ్వట్లేదు కదా? అప్పుడు ఏమైంది మీ దారుణం, మీరు చేస్తే న్యాయం, ఎదుటివాడు చేస్తే పగ, ఈ తప్పుకు శిక్ష విధించాలి అనుకుంటే నాకన్నా మీకు ఎన్నోవేలసార్లు శిక్ష వేయాలి అని అన్నాడు, ఆ మాటకు అందరూ తలవంచుకున్నారు. గతంలో మిమ్మల్ని అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పట్లేడుగా అంటున్నాడు బిగ్గరగా ఉద్భవుడు.
మంత్రిగారు కల్పించుకొని “నాయనా! ఉద్భవా నీ మొండి పట్టువీడు, ఇకనైనా మించిపోయినది ఏమిలేదు, అంతా అపశకునాలు తోస్తున్నాయి, నీ తండ్రి వంటి వాడ్ని?” ఉద్భవుడు చప్పట్లు కొట్టాడు. అంతలో భటులు మంత్రిగార్ని కట్టిపడవేశారు. మంత్రికి తన కల నిజమయ్యింది అనే భావన పూర్తిగా వచ్చింది. అంతా, అయిపోవచ్చింది. ఉద్భవుడు గుడి తాళాలు తీసుకొని కోనేరులో వేశాడు. ఏవో పేలుడు పదార్ధాలు తీసుకున్నాడు. అది విసురుగా తీసి ఆ గుడిగోడపైన వేశాడు. అంతే పెద్ద విస్ఫోటనం గుడి గోడ బ్రద్ధలైంది. రాజాజ్ఞ మేర భటులు కూడా అంతే ఆ గుడి యొక్క పెద్ద ద్వారాలు బద్దలు చేశారు. పెద్ద విస్ఫోటం. కట్టిపడి ఉన్న మంత్రి కళ్ళు మూసుకొని “శివ శివ శివ హర హర మహాదేవ” “శివుడు వచ్చాడు శివుడు వచ్చాడు” అంటూ బిగ్గరగా అరుస్తున్నాడు. కళ్ళు తెరచి చూసిన మంత్రికి నేను కనపడలేదు. మంత్రి అదేంటా అనుకున్నాడు.
తన కల అనుకున్నట్లు స్పష్టంగా జరిగినా చివరికి నా ప్రత్యక్ష్యం ఒకటి జరగకపోవటం చాలా బాధ వేసింది అతనికి కాని ఉద్భవుడు స్థిరంగా జీవించి ఉన్నాడు అని ఆనందపడ్డాడు.
ఉద్భవుడు:”మంత్రిగారు, ఏమిటి వయస్సు ముదిరి చాదస్తం వచ్చిందా ఏంటి?”
మంత్రి: “అదికాదు నాయన! నీవు నన్ను కట్టిపడవేసినందుకు కోపంలేదు అంటూ తన కళను పూర్తిగా చెప్పాడు.
ఉద్భవుడు: “మంత్రిగారు తెల్లవారుజామున వచ్చిన కలలు నిమవుతాయి కానీ, అర్ధరాత్రి వచ్చిన కలలు కాదు! అంటూ నవ్వుతున్నాడు.
మంత్రి: “నాయనా వద్దు ఎదురీత చర్య మనకు”
ఉద్భవుడు: భటులారా ఈ మందిరాన్ని ప్రేల్చివేయండి, ఇలాంటిది ఒకటి చేస్తే ఈ సారి ధిక్కరించటానికి సంకోచిస్తారు.
మంత్రి: నాయనా! ఇది నీ తండ్రి కట్టించిన గుడి, దానిని ఏమి చేయకు, నీ నాస్తికవాదం సరైంది అయితే నీవు అవలంభించు, అంటే కాని, అందర్ని”
ఉద్భవుడు: సరైనది అందుకే అందరూ అవలంభించాలి.....
అలా పేలుడు పదార్ధాలు వేయబోతున్నప్పుడు, మూకుమ్మడిగా ప్రజలు చాలా మంది వచ్చారు. వారు ఘర్షణకు దిగారు, కాని ఉద్భవుడి మనసు ఏమి మారలేదు. సైన్యానికి ఉద్భవుడు చెప్పిన పని నచ్చకపోయినా, అతని పట్ల విధేయతకు ఏ పని అయినా చేయవలసి వస్తుంది. చివరిగా వచ్చిన వారందర్నీ కట్టడి చేశారు ఉద్భవుడి సైన్యం అందర్ని కట్టివేశారు.
ప్రజలు: ఉద్భవరాజా, నీకు మతి చలించింది, అందుకే ఈ విపరీత బుద్ధి, ఆఖరికి దేవాలయాలన్నీ ధ్వంసం చేయుటకు పూనుకున్నావు. ఇంతకంటే... మీరు....... మమ్మల్ని వదిలి పెట్టు.
ఉద్భవుడు: అయితే మీరు హరినామస్మరణ ఆపండి..
ప్రజలు: మేము ఆపము, ఏమి చేస్తారో చేయండి అన్నారు.
ఉద్భవుడు అందర్ని కొరడాలతో కొట్టమని ఆజ్ఞాపించాడు. అందులో కొంత మంది కట్లు తెన్చుకొని పారిపోబోతున్న వారిని సైన్యం పట్టుకున్నారు.
ఉద్భవుడు: దేవుడు లేడు , ఇదంతా నాటకం అని అనండి వదిలిపెడతాను అని బిగ్గరగా నవ్వాడు.
ప్రజలు మాత్రం ఒప్పుకోలేదు, దానితో క్రోధించిన ఉద్భవుడు అందర్ని తైలం పోసి సామూహికంగా తగలబెట్టటానికి నిర్ణయించుకున్నాడు. అందరు హాహాకారాలు చేస్తున్నారు. అవి వింటూ కూడా మంత్రి, భటులు మౌనం వహించారు. ఉద్భవుడు ఒక్కసారిగా అందరిని నిప్పంటించ బోయాడు.
“ఆగు ఉద్భవా! నీ భక్తికి మెచ్చాను” అనే పెద్ద స్వరం వినబడింది అందరికి ఎవరిదీ ఆ వాణి అని అందరూ ఆశ్చర్యపోతున్నారు, ఉద్భవుడు భక్తుడు ఏమిటి అని బ్రాంతి పడుతున్నారు.
(సశేషం..)
No comments:
Post a Comment