మా తెలుగుతల్లికి మల్లెపూదండ - అచ్చంగా తెలుగు

మా తెలుగుతల్లికి మల్లెపూదండ

Share This

మా తెలుగుతల్లికి మల్లెపూదండ

సుజాత తిమ్మన


భరతావనిలో పోగయిన భాగ్యమంతా..
మన తెలుగు వారి సొంతం....
శ్రీనాధుని భాగవతం....అన్నమయ్య కీర్తనలు...
కృష్ణదేవరాయల వారి  అష్టదిగ్గజాలు...
రామదాసుని రమ్యమయిన .. ఆలాపనలు.......
అంధ్రప్రదేశ్ అమ్మ ప్రసవించిన మణి మాణిక్యాలు...
భాషలలో బాగమైన యాసల మార్పులు...
అవి తేటతెలుగు లోని సొగసులు...
బావాలు  పలికిస్తాయి గానీ.. ....మారనివి  అర్ధాలు....
మండు టెండల్లో మల్లెల పరిమళాలు ......
మరువలేని మధుర రసాన్ని  అందించే ..
మావిళ్ళ ఆస్వాధనలు ....అనుభూతించటంలోనే ఉన్నాయి...
 సాటిలేని  అమృత తుల్యమైన మాధుర్యాలు......
ఆకలి నెరిగి అన్నం పెట్టె..అమ్మకోసం ఆరాట పడుతూ....
ఇటు ఆంధ్రా...అని..అటు  తెలంగాణా..అని..అనుకున్నా..
సోదరభావం వీడక..సమంగా పంచుకున్నా...
అమ్మ మనకందరికీ... నేర్పిన సంస్కృతి ఒక్కటే...
అమ్మ ఆత్మీయతతో..చేసే.....ఆవకాయఅయినా... ...
రాగి సంకటి అయినా..పనసపొట్టు కూరయినా...పచ్చిపులుసయినా.....
నా అనుకునే...ఒక్కటే వరుసయిన భావం...
దూరాలు పెరిగినా ...దగ్గరతనాలకు  అందిన అనుభందాలు ఒకటే....
జ్ఞాన సరస్వతిచదేవి  పాదాలు కడిగిన గోదావరమ్మ...
రామ ధ్యానంలో శ్థబ్ధమయినా.....పాపికొండల దాటి
అంతర్వేదిలోని సంద్రంలో...కలసినట్లు.....
ప్రకృతినే...కాదు....పరిస్థితిని సామరస్యంతో కాపాడుకుందాం....!!
కలిసి మెలిసి పాడుకుందాం..ఒక్కటే గీతాన్ని...
“మా తెలుగుతల్లికి మల్లెపూదండ...” అంటూ...
జై...సీమాంద్ర ....జై ...తెలంగాణా....నినాదాలు...
వివాదాలు దరి చేరనియ కుండా..
బేదాలు లేని భవితను పేర్చుకుందాము....!!
**************      ***********   ************ 

No comments:

Post a Comment

Pages