శ్రీధరమాధురి -25 - అచ్చంగా తెలుగు

శ్రీధరమాధురి -25

Share This

శ్రీధరమాధురి -25


(అసలైన భక్తిని, దేవుడి దయను గురించి పూజ్య గురుదేవులు శ్రీ వి.వి.శ్రీధర్ గురూజీ అమృత వచనాలు )
నిష్కామ భక్తి ...
మధ్యంతినార్ ముని, తిల్లై అడవుల్లోని ‘తిరుమూలనాధార్ ‘ అనే శివలింగానికి పూజలు చేస్తూ ఉన్నారు. దైవం పట్ల లోతైన కృతజ్ఞతతో, అంకితభావంతో ఆయన ప్రతి రోజూ పూజలు చేస్తూ ఉండేవారు. తిరుమూలనాధార్ ఆయన భక్తికి మెచ్చి, ఆయన ముందు ప్రత్యక్షమై, ఆయన అభీష్టం( కోరిక ) ఏమిటో తెలుపమని అడిగారు. మధ్యంతినార్ తనకు ఎల్లప్పుడూ దైవసేవలో ఉండాలని ఉందని, అంతకంటే ఏమీ ఒద్దనీ అన్నారు. అయినా, దైవం వరం కోరుకోమని, బలవంతపెట్టారు. మధ్యంతినార్ ఇలా అన్నారు – ‘ఓ దైవమా !ఈ అడవిలో పూలు చెట్లపై ఉన్నాయి, చెట్ల చుట్టూ ముళ్ళకంపలు ఉన్నాయి. మంచి పువ్వులనే ఏరి కోరి నీకు సమర్పించాలని అనుకుంటున్నాను. మంచి పువ్వులు అంటే, నా ఉద్దేశం, పూలల్లో తేనెతో సహా ఉన్న పువ్వులు. ఒక్కసారి సూర్యోదయమైతే, తుమ్మెదలు పూలనుంచి తేనెను తాగేస్తాయి, అప్పుడు ఆ పూలు నీ పూజకు పనికిరానివిగా నాకు అనిపిస్తాయి. కాబట్టి, నేను సూర్యోదయానికి ముందే  పువ్వుల్ని కొయ్యాలి, చీకట్లో నాకు ఏమీ కనిపించట్లేదు. దయుంచి నాకు సాయం చెయ్యండి. ‘
అందుకే మధ్యంతినార్ కు పులి పంజాలను, కాళ్ళను, చూపుని దైవం అనుగ్రహించారు. వీటితో మధ్యంతినార్ చీకట్లో తేలిగ్గా చెట్లు ఎక్కి, చేతులు, కాళ్ళకు గాయాలు అవ్వకుండా పూలను కొయ్యగలిగేవారు. పంజాలు చెట్లు ఎక్కేందుకు సహకరిస్తే, చీకట్లో పులి అనుగ్రహించబడడం వల్ల ఆయన చూడగలిగేవారు. అందుకే ఆయన్ను “వ్యాఘ్రపాదార్” అని పిలిచేవారు. తిల్లై అడవిలో అప్పుడున్న తిరుమూలనాధార్ దైవమే, నేడు తమిళనాడు లోని చిదంబరంలో మనకు కనిపిస్తారు. ఇదే నిష్కామ భక్తి అంటే...
మధ్యంతినార్  నుంచి వ్యాఘ్రపాద మునిగా మారాకా, ఆయన అడవిలో తన ప్రార్ధనలను కొనసాగించారు. మధ్యంతినార్ అన్న పేరే ఉన్న ఆయన తండ్రి కూడా తిల్లై అడవులకు వచ్చి, పెళ్లి చేసుకునేందుకు వ్యాఘ్రపాదార్ ను తనతో రమ్మని అడిగారు. మొదట ఇందుకు ఒప్పుకోకపోయినా, వ్యాఘ్రపాదార్ చివరికి తండ్రి కోరికను మన్నించి, తిల్లై అడవులను వదిలి, ఆయనతో వెళ్ళారు. ఆయనకు వశిష్ట ముని సోదరిని ఇచ్చి వివాహం చేసారు. పెళ్లి తర్వాత ఆయనకు ‘ఉపమన్యు’ అనే కుమారుడు కలిగాడు. వారంతా కొంతకాలం పాటు వశిష్ట ఆశ్రమంలో ఉన్నారు. బాలుడు ప్రతిరోజూ కామధేనువు పాలను త్రాగేవాడు. కొన్నాళ్ళ తర్వాత వారు తిల్లై అడవులకు తిరిగి వెళ్ళారు. కామధేనువు పాలను తప్ప, అడవిలోని ఏ ఇతర ఆహారాన్ని స్వీకరించనని, పట్టుబట్టాడు. వ్యాఘ్రపాదుడు ‘తిరుమలనాధ’ అనే దైవాన్ని ప్రార్ధించారు, ఈయనే పాల సముద్రాన్ని (క్షీర సాగరం)సృష్టించినవారు. ఉపమాన్యువుకు ఈ సముద్రంలోని పాలను అందించేవారు. ఉపమాన్యువు గొప్ప ఋషి అయ్యారు, కృష్ణ భగవానుడికి శివదీక్షను ఇచ్చిందీ వారే !
***
రోడ్లపై ఒక బాలుడు తిరుగుతున్నాడు. ఒక గురువు అతన్ని చూసి, “ఓం నమః శివాయ” అన్న మంత్రోపదేశం చేసారు. మొదట్లో బాలుడు కేవలం జపం చేసేవాడు. కాని, కొన్నాళ్ళ తర్వాత, ఆ మంత్రంలో ఒక దివ్యమైన లయ అతనికి కనిపించి, అత్యంత శ్రద్ధతో జపించసాగాడు. ఆ మంత్రం యొక్క లయబద్ధమైన ప్రకంపనలు విశ్వమంతా నిండసాగాయి. మొత్తం 33 కోట్ల మంది దేవతలు వచ్చి, బాలుడి ముందు కూర్చున్నారు. ఆ మంత్రం కైలాసాన్ని చేరుకుంది. శివ గణాలు, మునులు, గణపతి, సుబ్రహ్మణ్యుడు, బనన్, భైరవుడు, అందరూ కైలాసం వదిలేసారు. పార్వతీదేవి ఇక ఆగలేక శివుడి వంక చూసింది. శివుడు యోగ నిద్రలో ఉన్నారు. పార్వతి శివుడిని లేపింది.
శివుడు – నన్నెందుకు లేపావు పార్వతీ ? అని అడిగారు. పార్వతి – ‘స్వామీ ! ఆ బాలుడి ‘ఓం నమః శివాయ’ అన్న నామ జపం మీకు వినిపించాట్లేదా ? మీరు భూలోకానికి వెళ్లి, అతనికి కావలసినది ఇచ్చేసి, ఆ తపస్సుఆపేలా చెయ్యకూడదా ?’ అని అడిగింది.
శివుడు పార్వతిని చూసి నవ్వి, ‘నేను వెళ్తాను, కాని, నన్ను వెళ్ళమని అడిగినందుకు తర్వాత నువ్వు బాధపడతావు’ అన్నారు. పార్వతి ‘నేనేమీ బాధపడను, మీరు వెళ్లి అతను కోరిన వరం ఇవ్వండి,’
శివుడు భూలోకానికి వచ్చారు. మహావిష్ణువు ఆయనతో, ‘తపస్సు చేస్తూ ఆ బాలుడు మీ పేరే పిలుస్తున్నాడు, కనుక అతన్ని మీరే లేపండి,’ అన్నారు. శివుడు బాలుడిని తట్టి లేపారు. బాలుడు తనముందున్న పెద్ద గుంపును చూసి, శివుడిని ఇలా అడిగాడు – “మీరెవరు ? వీళ్ళంతా ఎవరు ?’
శివుడు – నేను సాక్షాత్కార ఓంకార స్వరూపి నమః శివాయం ను. వారంతా నీ తపస్సుకి ఆకర్షించబడ్డ దేవతలు, పితృ దేవతలు. నేను నీ తపస్సును మెచ్చి వచ్చాను కనుక, నువ్వు నన్ను ఏమైనా వరం కోరుకో, ఇస్తాను,’ అన్నారు.
బాలుడు ఇలా అన్నాడు – ఒక గురువు నాకు ఈ మంత్రాన్ని ఇచ్చారు. ఇది చదివితే నీకు ఆనందం కలుగుతుంది అన్నారు. నేను ఈ మంత్రం యొక్క సౌందర్యంలో మైమరచిపోయాను. మీరంతా వస్తారని ఆశించి, జపించలేదు. వరం సంగతి పక్కన పెడితే, నాకు ఏమీ అక్కర్లేదు. నేను ఈ మంత్రంతోనే సంతోషంగా ఉన్నాను. వెళ్ళిపొండి.’
శివుడు ఇలా అన్నారు – నేనే అసలైన శివుడినని నువ్వు నమ్ముతున్నట్లు లేదు. నేను ఇప్పుడే రామోజీ ఫిలిం సిటీ నుంచి ఈ దుస్తుల్ని అద్దెకు తెచ్చినట్లు అనుకుంటున్నావా ? నేను నీకు దీర్ఘ దృష్టిని ఇస్తాను. ఇప్పుడు నన్ను చూడు. నన్ను ఇప్పుడు నీవు కైలాసం దాకా చూడగలవు. నేను కైలాసానికి వెళ్ళాకా, నువ్వు నన్ను ఒకేఒక్కసారి పిలువు. నేను వెనక్కి వచ్చి వరం ఇస్తాను. రా, నన్ను చూడు.
బాలుడు శివుడిని చూసాడు, శివుడు కైలాసానికి వెనక్కి వెళ్ళిపోయారు. పార్వతి భద్రకాళి లాగా మారిపోయింది. ఆమె – ‘స్వామి, నేను మిమ్మల్ని భూలోకానికి వెళ్లి, ఆ బాలుడికి వరమిచ్చి రమ్మన్నాను, అతను నిరాకరించాడు. ఇది నాకు అవమానంగా భావిస్తున్నాను. అటువంటి బాలుడు బ్రతకకూడదు. నేను నా త్రిశూలంతో అతన్ని సంహరిస్తాను.’
శివుడు నవ్వి, ‘అందుకే నేను వెళ్లనని చెప్పాను. ప్రశాంతంగా కూర్చో. ‘నమః శివాయం నమః శివాయం’ జపిస్తూ, బాలుడు శివ స్వరూపి అయిపోయాడు. నేను భూలోకానికి వెళ్లి మనుష్య స్వరూపిని అయ్యాను. ఆ బాలుడు నన్ను చూడకపోతే, నేను కైలాసానికి వెనక్కి రాగలిగి ఉండేవాడిని కాదు. అతని దృష్టి మాత్రమే నన్ను నీ వద్దకు వెనక్కు చేర్చింది.’
అందుకే, దైవాన్ని ప్రార్ధించండి, ఆయన స్థాయికి ఎదగండి.
***
‘అభ్యాసం’ అంటే ఏమిటి ?
అభ్యాసం అంటే సాధన. ఈ సాధన ఎటువంటి లక్ష్యాలు లేకుండా సాగాలి. ఏదో ఆశించి చెయ్యకూడదు. మనకు తెలిసిన ఉత్తమమైన విధానంలో ఏదీ కోరకుండా సాధన చెయ్యాలి. ఒకవేళ లక్ష్యం అనేది ఏర్పరిస్తే, పరిమితులు లేని మనసుకు మీరు స్థాన సంఖ్యలు విధించి, ఫలితాల కోసం టెన్షన్ పడుతూ ఉంటారు. మనసు స్వేచ్చగా ఉంటే, అది లక్ష్యం లేకుండా, ఏదీ ఎన్నుకోకుండా పనిచేస్తే, దేన్నైతే సాధించలేమో, దాన్ని అది సాధిస్తుంది. ఫలితాలు ఆశించలేదు కనుక, అవి ఉత్తమమైనవిగా ఉంటాయి. ఉత్తమ ప్రతిభ వెలికి వస్తుంది.
***
ప్రతీదీ జరగాల్సి ఉంది కనుక, జరుగుతుంది. ఒక్క దైవానికే కారణాలు తెలుస్తాయి. జీవితం అనే మర్మాన్ని ఎవరూ వెల్లడించలేరు. జీవితాన్ని ఆస్వాదించాలి, కారణాలు వెతక్కుండా ఆశ్చర్యపోవాలి. ఆశ్చర్యపోయే దశ నుంచి మీరు విచారించే దశకు చేరుతారు. పరమాత్మలో విలీనం కావాలన్న ఒక బలమైన కోరిక కలుగుతుంది. ఈ ఐక్యత కోసం పడే తపన తారాస్థాయికి చేరినప్పుడు, ఆత్మ పరమాత్మలో లయమవుతుంది. ఇది జరుగుతుంది. ఇది పరమాత్మపై అపరిమితమైన విశ్వాసం ఉండడం వల్లనే జరుగుతుంది అన్నది నిర్వివాదాంశం.
***
 నిర్వాణ సుఖదాయిన్యై నమః
లలితా పరమేశ్వరి మనం ‘ నిర్వాణాన్ని’ పొందేందుకు సహకరిస్తుంది. ‘నిర్వాణ’ దశను పొందాలన్న మీ తపన, మిమ్మల్ని దీవించాలన్న ఆమె కోరిక. ‘నిర్వాణ’ అంటే ‘దిగంబర’ అని అర్ధం, లోపల, వెలుపల. ఇది భైరవుడి అంశ. ‘నిర్వాణం’ అంటే మీరు నేర్చుకున్నవి మర్చిపోయి, మిమ్మల్ని తిరిగి అమాయకంగా చెయ్యడం. మీనుంచి విజ్ఞానం అనే చెత్తను నిర్మూలించడం. బంగారం వంటి మీ అమాయకత్వాన్ని ఇది పాడుచేసింది. మీలోని పసిపాపను వెనక్కు తెచ్చేందుకు, మీకున్న విజ్ఞానాన్ని తీసివెయ్యడమే – నిర్వాణం. అదే ‘నిరమలం’ అంటే, శూన్య స్థితి. అమాయక స్థితి. అది అలౌకిక ఆనందాన్ని ఇస్తుంది కనుక, అదే అసలైన జ్ఞానం. అటువంటి ‘సుఖాన్ని’ లలిత అమ్మవారు ఇస్తారు. ‘దిగంబర’ అంటే దత్త రూపం. జ్ఞానానికి ప్రతీక. లలితా దేవి చాలావరకు దత్త రూపంలో ఉంటుంది. ఆమె ‘నిర్వాణం’ పొందేందుకు దీవిస్తుంది. అందుకే ఆమే గురువు. ఆమె దత్త మహారాజు. నిర్వాణాధికారి.
***

నాకొక ఆలయ పూజారి తెలుసు. ఆయన చాలా మంచివారు, భైరవ దేవుడి పట్ల ఎంతో ప్రేమ కలిగినవారు. ఆయన కృష్ణ యజుర్వేద పండితులు. ఆయన ప్రార్ధించేటప్పుడు, మీరు దైవం పట్ల ఆయనకు ఉండే ‘భక్తి’ ని చూడవచ్చు. ఆయనకు దైవం యొక్క స్వరం వినాలన్న కోరిక కలిగింది. ఆయన కోరిక తీరాలని, నా కోరిక.
 ‘సాయంత్రం 6 గం. కల్లా, భైరవుడి స్వరం వినపడకపొతే, నేను ఆలయంలో ఉన్న కొలనులో దూకి, భైరవుడి వద్దకే వస్తాను’ అంటూ ఒకరోజున ఆయన భైరవుడిని ఇలా ప్రార్ధించడం నేను విన్నాను. ఆరోజున నేను ఆలయానికి కేవలం 500 కి.మీ. దూరంలో ఉన్నాను. నేను అక్కడికి మధ్యాహ్నం దాటాకా చేరుకున్నాను.
ఆయన భైరవుడికి అభిముఖంగా కూర్చుని, తీవ్ర ధ్యానంలో ఉన్నారు. నేను గర్భ గుడిలో ప్రవేశించి, కాలభైరవుడి ప్రతిమ వెనుక దాక్కున్నాను. ఇప్పుడు నాకు ఏం చెయ్యాలో తెలీలేదు. ఆయన పేరుతో ఆయన్ను పిలిస్తే, అది విని, ఆయన ఆత్మహత్య గురించిన ఆలోచనను విరమించుకుంటారని అనుకున్నాను. నేను ఆయన పేరును పిలవబోతూ ఉండగా, నా నడుముకు కుడిప్రక్కన ఎవరో చక్కిలిగింతలు పెట్టారు. ఆ తర్వాత ఎడమ ప్రక్కన... తర్వాత మళ్ళీ కుడి వైపున, ఎడమ వైపున, ఇక ఆ చక్కిలిగింతలు అధికంగా పెట్టసాగాయి. నా వెనుక నాకు ఎవరూ కనిపించలేదు. నేను ఇక ఆపుకోలేకపోయాను. బిగ్గరగా నవ్వసాగాను. నాకు స్పష్టంగా మరొక స్వరం నవ్వడం కూడా వినిపిస్తోంది. మళ్ళీ చక్కిలిగింతలు, నేను మళ్ళీ నవ్వసాగాను. మరొక నవ్వు కూడా వినిపిస్తూనే ఉంది. ఆయన అమితానందంతో ధ్యానం నుంచి లేచారు. బహుశా ఆ నవ్వు ఆయనకీ వినిపించి ఉంటుంది. ఇది అయిపోగానే, ఆయన భైరవుడికి హారతి ఇచ్చి, సాయంత్ర పూజ (సాయరక్షై) చేసి, తలుపు తాళం పెట్టి వెళ్ళిపోయారు. నేను దైవం వదనం లోని సౌందర్యాన్ని చూస్తూ, ఆయన ముందు కూర్చున్నాను.
తెల్లవారు ఝామున  మరొక్కసారి చక్కిలిగిలిగా అనిపిస్తే, నేను లేచాను. నేను దైవం నన్ను చూసి నవ్వుతుండడం చూసాను. మరికాసేపటి తర్వాత నన్ను నేను నా కార్ లో గుర్తించాను, మధురై కు వెనక్కు వెళ్లాను. అంతా దైవానుగ్రహం.  
***

No comments:

Post a Comment

Pages