ఆ చేతులు..
- ప్రతాప వెంకట సుబ్బారాయుడు
అరచేయి చాపి, హస్తసాముద్రికంతో
భవిష్యత్తు తెలుసుకోవడానికి ఉబలాటపడతాము
అదృష్టం తలుపుతడుతుందేమోనని ఆశపడతాము
చేతి ఉపరితల నిర్మాణానికి..ఆకారానికి
గజిబిజి రేఖలకీ..అర్ధాలు చెబుతుంటే
మైమరచిపోతాం
చెడు ఎదురవబోతోందని హెచ్చరిస్తూ
ఉపసంహారం తెలియజేస్తే..మురిసిపోతాం
కానీ..మన చేతుల్లోనే మహత్యం ఉందని
అది కొండని పిండి చెయ్యగలదని
మనసులోని సృజనాత్మకతకి
కళల రూపమియ్యగలదని
అసలు రేపటి మన భవిష్యత్తు సృష్టికర్త అదేనని
తెలుసుకోకపోవడమే మన దురదృష్టం!
***
No comments:
Post a Comment