అమ్మ ఉంటే...
భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు.
9393109261
దేవుడు మనకిచ్చిన వరం అమ్మ!
అమ్మ పక్కనుంటే దశావతారాలూ,
దర్శనమివ్వాలని దరిచేర చూస్తాయి.
అమ్మ నట్టింటిలో నడయాడుతుంటే,
నవగ్రహాలూ తమ అనుగ్రహాన్ని అందించాలని,
ఉవ్విళ్ళు ఊరుతూఉంటాయి.
అమ్మ అండగాఉంటె అష్టఐశ్వర్యాలూ
అందుబాటులో ఉండాలని ఆత్రుతతో చూస్తుంటాయి.
అమ్మ సరసన ఉంటె సప్తఋషులూ స్పందించి,
సవ్యమైన జీవితాన్ని మనముందుంచుతారు.
అమ్మ ఆశీర్వదిస్తే అరిషడ్వర్గాలూ అణకువనే ప్రదర్శిస్తాయి.
అమ్మ ప్రేమకు పంచభూతాలూ పరవశిస్తాయి.
అమ్మ వాక్కుముందు నాలుగువేదాలూ అవాక్కై పోతాయి.
అమ్మసన్నిధి కోసం త్రిమూర్తులూ తహతహలాడుతూ ఉంటారు.
ద్వంద్వాలన్నీ అమ్మసేవలో ఆదమరచి,
దివ్యత్వాన్ని పొందాలని అనుకుంటాయి.
ఏకైకపరబ్రహ్మకూడా అమ్మగాపుట్టాలనే ఆశిస్తుంటాడు.
అందుకేతాను ఆదిలో అమ్మరూపంలోనే పుట్టాడు.
***
No comments:
Post a Comment