“మా ““మిడి “.... - అచ్చంగా తెలుగు

“మా ““మిడి “....

Share This

“మా ““మిడి “....

సుజాత తిమ్మన...

93 91 34 10 29 ..

" మా " లో...ఉంది అమ్మతనం...

" మిడి " లో నుడికారం ...మమకారమై...

ప్రతి ఎదను దోచే...రాజసమున్న ఫలం 'మామిడి పండు ..'

మండు వేసవిలో కూడా చెదరని నిగనిగలతో...

పసుపు ...ఎరుపు కలగలిపిన మిశ్రమ రంగుతో..

కన్నుల విందు చేయడమే...కాదు...కత్తితో కోసినంతనే....

పులుపు...తీపి కలయికలతో...తేనెలూరు రుచులతో..

అమొహమైన మైమరపుకు గురిచేస్తుంది..' మామిడి పండు '

మన భారతదేశం లో మాత్రమే..దొరికే అత్యంత అపురూపమైన..

విదేశీయులను సైతం అబ్బురపరిచే...అపూర్వ సంపద ...

ప్రకృతి మనకు అందించిన వరం...’మామిడి పండు ‘..

ఆకట్టుకునే...ఆకృతి...మధురమయిన రుచులే కాక

ఆరోగ్య పరంగా అనేక విటమిన్లను దాచి..

అమృతమయమై అందినది ఈ ...' మామిడి పండు '...

నూజివీడు..నీలాలు ..ఇత్యాది....వివిధ రకాలుగా రుచులలో...

 అతి కొద్ది తేడాతో..తేనెలూరురసాలు...

బంగ నపల్లి..తోతాపరిలు .. ముక్కలుగా మనల మెప్పించేవే కదా ఈ ..'మామిడి పండ్లు '

ఏడాదికి రెండు నెలలే కాపుకోచ్చి ...కనిపించినా ...

మిగిలిన కాలమంతా ఆ మధురాస్వాధనల అనుభూతిని..

నెమరు వేసుకుంటూ..స్క్వాష్ల రూపంలో సేవిస్తూ...

మళ్ళి వేసవి ఎప్పుడు వస్తుందా.....

మండుటెండలయినా ...మామిడి రుచులకోసం..

ఎదురుచూసేలా చేసేదే.. ఈ ....'మామిడి పండు '!!

****   *****    *****     ******

No comments:

Post a Comment

Pages