నిరతము నాలో నిన్నే కొలువైపోనీ
ఆర్.చంద్రమౌళి
పల్లవి: మనసున రామ అని మెదిలిన తరంగమే
నిరతము నాలో నిన్నే కొలువైపోనీ
స్వరముల సారం నువ్వే పదముల భావం నువ్వే
హృదయపు వీణను మీటే రాగం నువ్వే
అను పల్లవి: ఆ రాగమే నా స్వాసగా ఆడాలి నాలో హంసా నాధం
హరివిల్లులో వర్ణాలుగా ఈ మౌన రాగం సాగే నాలో
װ మనసున װ
చరణం:1 తొలిపొద్దు వికశించు కిరణాలు నీ వల్లే
జగమందు జ్యోతివి నువ్వే
ప్రతినదిలా పయనించు జీవాత్మ నేనైతే
దరిజేర్చు సంద్రం నువ్వే
ఆ నింగిలో విహరించగా ఈ నేలపై చరియించగా
నివసించు జీవం నీ వల్లేగా
వేకువ నువ్వే వెన్నెల నువ్వే
ఈ భ్రమణ కాలం నీవల్లేగా װ మనసున װ
చరణం:2 తల్లేమో ప్రకృతిగా తండ్రేమో పురుషుడిగా
ప్రతి జీవి జనియించగా
జీవితమను బడిలోన ప్రకృతినే పాఠంగా
కాలముతో నేర్పించగా
చిరు దివ్వెలా... ప్రతి జీవిలో....
వెలుగొందు జ్ఞానం నీవల్లేగా
భవబంధాలా పెనవేస్తావు చితిమంటతో సెలవంటావు
ఈ మాయలోకం నీవల్లేగా װ మనసున װ
గమనిక: ఈ పాటను శ్రీ రామనవమి సందర్బంగా వ్రాయడం జరిగింది నా హృదయ పీఠాన్ని అలంకరించిన నా ఆత్మారాముడైన శ్రీ సాయిరాముని చరణకమలములకు నా పదనిసల నీరాజనం.
No comments:
Post a Comment