వల్లభా...ప్రియ వల్లభా! - అచ్చంగా తెలుగు

వల్లభా...ప్రియ వల్లభా!

Share This

వల్లభా...ప్రియ వల్లభా!

సత్యవతి దినవహి  


అలనాడు నా కలలో కనిపించి
కల నిజమైతే బాగుండుననిపించి
తలపుల నిండి ఇహము మరపించిన అందగాడు
కాలగమనంలో నా జీవనపథంలో తారసిల్లి
స్నేహం తో బంధం కలిపి మనస్సును దోచి
ఇతగాడే నా జతగాడు అనిపించిన మనోహరుడు
విద్యావంతుడిగా సంస్కారిగా మృదుస్వభావిగా
మితభాషిగా స్నేహశీలుడిగా సహనశీలుడిగా
ఎల్లరి మన్ననలను అందుకున్న సుగుణశీలుడు
‘నీ తోనే నా జీవితం’ అని పలు బాసలు చేసి
పాణిగ్రహణంతో తన జీవితంలోకి ఆహ్వానించి
సుఖదుఃఖాలలో బాసటగా నిలచిన సహచరుడు
నాలో అర్థభాగమై నా జీవితానికి అర్థమై
పెళ్లినాటి ప్రమాణాలకు రూపమై నిలచి
నా జీవితాన్ని ఆనందమయం చేసిన నా "ప్రియ వల్లభుడు."
***

No comments:

Post a Comment

Pages