వర్ణములు
సేకరణ : మంతిన ఝాన్సీ
మనుషులకు గుణము ముఖ్యము కాని వర్ణము కాదని తెలిపే పద్యాలు ( చందో బద్దం అవునో కాదో తెలియదు) ;; ఎవరు రచించారో తెలియదు. మా అమ్మమ్మ అమ్మకు నేర్పితే మా అమ్మ నాకు నేర్పారు.
--తెలుపు--
కైలాసగిరి తెలుపు,, కాలకంఠుడు తెలుపు
కలహప్రియుడు తెలుపు,, గంగ తెలుపు
వెన్నెల గిరి తెలుపు,, వెలయచుక్కలు తెలుపు
శరాదాంగము తెలుపు,, శంఖు తెలుపు
పార్వతీ పతి తెలుపు,, పాల సంద్రము తెలుపు
ఐరావతము తెలుపు,, హంస తెలుపు
మంచిముత్యము తెలుపు,, మల్లె పూవులు తెలుపు
పరగ వెండి తెలుపు,, పాలు తెలుపు
తెలుపు జెప్పగ నేల తెలివికి మేలైన గుణముకలిగె నేని కోటి సేయు
--ఎరుపు--
అరుణోదయంబెరుపు,, అరుణాచలంబెరుపు
అర్కమండలమెరుపు,, అగ్ని యెరుపు
బ్రహ్మదేవుండెరుపు,, బందూకరంబెరుపు
ఫణిఫణాదులు ఎరుపు,, పద్మమెరుపు
పద్మరాగంబెరుపు,, పగడంపు తీగెరుపు
కుందనపు చాయెరుపు,, కుంకుమెరుపు
మంకెన పూవెరుపు,, మరి దొండ పండెరుపు
దాసాన పూవెరుపు,, తాంబ్రమెరుపు
ఎరుపు చెప్పగ నేల వెలదికి మేలైన గుణము కలిగెనేని కోటి సేయు
--నలుపు--
ఇంద్ర నీలము నలుపు,, ఇంద్రాచలము నలుపు
ఇంద్ర వజ్రము నలుపు,, యముడు నలుపు
సామజంబులు నలుపు,, రామచంద్రుడు నలుపు
రతివల్లభుడు నలుపు,, రాత్రి నలుపు
కృష్ణదేవుడు నలుపు,, కోకిలమ్మలు నలుపు
నళిన దృష్టుడు,, నలుపు నరుడు నలుపు
నీరజాక్షి కొప్పు నిడు వెంట్రుకలు నలుపు,, కొమరైన కస్తూరి బొట్టు నలుపు
నలుపు జెప్పగ నేల నాతికిమేలైన గుణము కలిగెనేని కోటి సేయు
--పచ్చ--
శ్రీ తరుణి పతి మీది పీతాంబరము పచ్చ; కమలమిత్రుని తురంగము పచ్చ
దేవతాచార్యులా దేహకాంతులు పచ్చ ; ఘనమైన పుష్పరాగములు పచ్చ
వికసిత శత పత్ర మకరందమది పచ్చ; పరిపక్వ జంబీర ఫలము పచ్చ
బాగుగా బూసిన తంగేడు పువు పచ్చ ; చాల బూసినయట్టి రేల పచ్చ
పదమూడు వన్నెల బంగారమది పచ్చ; భామ చెక్కుల మీది పసుపు పచ్చ
పచ్చ జెప్పగ నేల పణతికి మేలైన గుణము కలిగెనేని కోటి సేయు.
***
No comments:
Post a Comment