మనసు
- ప్రతాప వెంకట సుబ్బారాయుడు
మధుర ఫల వృక్షమై
ఆకొన్నవారి ఆకలికి ఔషధమవుతుంది
ఇంకోసారి
అమృత సరోవరమై
దప్పికతో ఉన్నవారి దాహార్తిని తీరుస్తుంది
మరోసారి
కష్టాలకి కుంగిపోయేవారికి బాసటగా నిలచి
సుభాషితాలతో సాంత్వన పరుస్తుంది
చూపుల్తో చల్లదనం
స్పర్శతో ఉపశమనం..కలిగిస్తూ
బేల మనసులకి మార్గదర్శకత్వం వహిస్తుంది
దృఢచిత్త నాయకుల అడుగుజాడల్లో
వినమ్రంగా గమ్యం వైపు సాగిపోతుంది
మనిషిని నడిపించే మనసు
మంచి ఛోదక శక్తయితే
మనిషి..మహాత్ముడవుతాడు
మనీషయితీరతాడు!
***
No comments:
Post a Comment