"మౌనలిపి" మహర్షి - ఆర్టిస్ట్ వాసు
భావరాజు పద్మిని
చిత్రకళ ఒక మౌనలిపి. ఎన్నో భావాలను, ఉద్వేగాలను చెప్పకనే చెబుతాయి అద్భుతమైన వాసు గారి చిత్రాలు. ఆసక్తి, తపన ఉండి, సాధన చేస్తే, అవే మనకు గురువులై, అద్భుతమైన కళను అందిస్తాయి అనేందుకు ఉదాహరణ ఆర్టిస్ట్ చెన్నుపల్లి వాసు గారు. పౌరాణిక గాధలలోని ఘట్టాలను కళ్ళకు కట్టినట్లుగా కళకళలాడిపోయేలా వెయ్యటం ఆయన ప్రత్యేకత. ముచ్చటగా, తీరుగా, ఠీవిగా, దర్పంగా, గర్వంగా, అమాయకంగా, అనేక భావాలను పలికించగలవు వాసు గారి బొమ్మలు. తెలుగువారు గర్వించదగ్గ ఆర్టిస్ట్ లలో ఒకరైన వాసు గారితో ప్రత్యేక ముఖాముఖి ఈ నెల మా చదువరుల కోసం...
నాకు ఇద్దరన్నయ్యలు ఉన్నారు. వీరిద్దరూ బొమ్మలు వేస్తూ ఉండేవారు. వీరు వెయ్యడం గమనిస్తూ ఉండేవాడిని, నేనూ ప్రాక్టీసు చేస్తూ ఉండేవాడిని. నాకు ఇన్స్పిరేషన్ మాత్రం మా ఇద్దరు అన్నయ్యలే.
మీ అన్నయ్యలు బొమ్మలు ఎలా వేసేవారండి ? వారికి ఎవరైనా నేర్పారా?
ఇంట్లో ఈ ప్రొఫెషన్ కు సంబంధించి ఎవరూ లేరండి, బొమ్మల పట్ల ఆసక్తితో హాబీ క్రింద వేసేవారు.
చిన్నప్పుడు మీరు ఎటువంటి చిత్రకారుల బొమ్మల్ని చూసి వేసేవారు?
‘చందమామ’ లో వచ్చే వడ్డాది పాపయ్య గారు,శంకర్ గారు, చిత్ర గారు, వంటి వాటిని చూసి వేస్తూ ఉండేవాడిని. ఒక
పుస్తకంలో ఎక్కడ ఖాళీ కనిపిస్తే, అక్కడ చిన్న చిన్న బొమ్మలు వేస్తూ ఉండేవాడిని. ముఖ్యంగా నాకు చంద్రా గారి బొమ్మలు బాగా ఇష్టమండి. ఒక వయసు, జ్ఞానం వచ్చాకా, చంద్రా గారి బొమ్మలు కట్ చేసి బాగా కలెక్ట్ చేసే వాడిని. అవి కాపీ చేసేవాడిని. అప్పట్లో సొంతగా ఊహించి వేస్తారన్న జ్ఞానం లేదు నాకు. అప్పుడొకసారి చంద్రా గారిని కలిసినప్పుడు ఆయన ఏదో బొమ్మని అలా వేసుకుంటూ వెళ్ళిపోయారు. అప్పుడే నాకు “ఊహించి వెయ్యడం” అన్న ప్రక్రియ ఉందని తెలిసింది. ఆ తర్వాత నా సొంతగా ప్రాక్టీసు చేసేవాడిని.
పుస్తకంలో ఎక్కడ ఖాళీ కనిపిస్తే, అక్కడ చిన్న చిన్న బొమ్మలు వేస్తూ ఉండేవాడిని. ముఖ్యంగా నాకు చంద్రా గారి బొమ్మలు బాగా ఇష్టమండి. ఒక వయసు, జ్ఞానం వచ్చాకా, చంద్రా గారి బొమ్మలు కట్ చేసి బాగా కలెక్ట్ చేసే వాడిని. అవి కాపీ చేసేవాడిని. అప్పట్లో సొంతగా ఊహించి వేస్తారన్న జ్ఞానం లేదు నాకు. అప్పుడొకసారి చంద్రా గారిని కలిసినప్పుడు ఆయన ఏదో బొమ్మని అలా వేసుకుంటూ వెళ్ళిపోయారు. అప్పుడే నాకు “ఊహించి వెయ్యడం” అన్న ప్రక్రియ ఉందని తెలిసింది. ఆ తర్వాత నా సొంతగా ప్రాక్టీసు చేసేవాడిని.
బాగా ప్రోత్సహించేవారు. మా నాన్నగారు స్కూల్ హెడ్ మాస్టర్ గా చేసేవారు. మా ఇంటికి ఏదైనా పనిమీద టీచర్లు వాళ్ళు వస్తే, వాళ్లకు నా బొమ్మలు చూపించేవారు. వారంతా మెచ్చుకుని, మరిన్ని బొమ్మలు వెయ్యమనేవారు. మా నాన్నగారు ఈ విధంగా గొప్ప ప్రోత్సాహం అందించేవారండి.
స్కూల్ లో మిమ్మల్ని ఎలా ప్రోత్సహించేవారు ?
గమ్మత్తు ఏమిటంటే, స్కూల్ లో చాలామందికి నా పేరే తెలీదు. “ఆర్టిస్ట్” అనేవారు. అదో రకం నిక్ నేమ్ లాగా ఉండేది. ఇదొక మధురానుభూతి.
లేదండి, ఎక్కడా నేర్చుకోలేదు. కాని, నేర్చుకుని ఉంటే, ఇంకొంచెం మంచి బొమ్మలు వేసేవాడినని నాకు బాగా అనిపిస్తుంది. ఇదొక లోటుగా అనిపిస్తుంది నాకు.
లేదండి, మీ బొమ్మల్లో మాత్రం ఆలోటు కనిపించదు. పరిపూర్ణమైన కళ ఉట్టిపడుతుంది. మరి మీరు కంప్యూటర్ మీద కూడా ఇల్లుస్త్రేషన్లు వేస్తారా ?
లేదండి. అవి నాకు ఇష్టం లేదు. ఇందులో ఒక ఫ్లేవర్, ఒక ఫీల్ ఉంటుంది. రంగులు కలపడంలో, లైన్ పట్టుకోవడం, స్ట్రోక్స్ ఇవ్వడం, దీంట్లో ఉన్న టేస్ట్ దాంట్లో లేదని నాకు అనిపిస్తుంది. అందుకే దాని జోలికి వెళ్ళలేదు నేను.
మీ అభిమాన చిత్రకారులు ఎవరు ?
వడ్డాది పాపయ్య గారు, చంద్రా గారు, బాపు గారు వీరు నా అభిమాన చిత్రకారులు. వడ్డాది పాపయ్య గారి బొమ్మలంటే ప్రాణం నాకు.
వాటర్ కలర్స్, అక్రిలిక్, పోస్టర్ కలర్స్ ,ఆయిల్ కలర్స్ అన్ని రకాలు వాడతాను నేను. అవసరానికి తగ్గట్లు కాన్వాస్, పేపర్, డ్రాయింగ్ షీట్, అన్నీ వాడతాను. ఎక్కువ బొమ్మలు నేను జిరాక్ష్ కాపియర్ మీదే వేస్తుంటాను.
మీరు ఎటువంటి బొమ్మలు వేస్తూ ఉంటారు ?
అన్ని రకాలు వేస్తాను, ప్రాక్టీసు చేస్తాను. పోర్ట్రైట్ లు కూడా నా ఫేస్బుక్ చూస్తే మీకు బాగా కనిపిస్తాయి.
స్వంతగా ఇంత గొప్ప చిత్రకళా ప్రావీణ్యం సంపాదింకునేందుకు మీరు ఎలా సాధన చేసేవారు ?
ఇంట్రెస్ట్ అండి, చిన్నప్పటి నుంచి బాగా ఇంట్రెస్ట్. మంచి బొమ్మలు వెయ్యాలి అని అనిపించేది. ఎవరైనా బొమ్మ బాగుంది అంటే, ఇంకొంచెం మంచి బొమ్మ వేస్తే, మరికాస్త ప్రోత్సాహం వస్తుందని, చిన్నతనంలో అనిపించేది.
మీ విద్యాభ్యాసం ఎంతవరకు కొనసాగింది ?
మా ఇంట్లో అందరికంటే తక్కువ చదువుకున్నది నేనేనండి. మా
నాన్నగారికి ఈ విషయంలో కాస్త బాధ కూడా ఉండేది. 10 వ తరగతి తరువాత ITI చేసాను. ఆ తర్వాత ఈ రంగంలోకి వచ్చాను.
నాన్నగారికి ఈ విషయంలో కాస్త బాధ కూడా ఉండేది. 10 వ తరగతి తరువాత ITI చేసాను. ఆ తర్వాత ఈ రంగంలోకి వచ్చాను.
మీ చిత్రకళా ప్రస్థానం ఎలా మొదలయ్యింది ?
చదువు తర్వాత నేను హైదరాబాద్ వచ్చాను. అప్పుడు కొంతమంది మిత్రులు ‘ఈ తరహా పని పబ్లికేషన్ లకు ఉపయోగిస్తుంది’ అన్నారు. ప్రయత్నించమని ప్రోత్సహించేవారు. అప్పట్లో ఇక్కడ నాంపల్లి లో ‘కాకతీయ పబ్లికేషన్స్ ‘ అని ఉండేది. ‘మయూరి చిత్రభూమి’ అని పత్రికలు వచ్చేవి వారికి. దాంట్లో మొట్టమొదట ట్రైనీ ఆర్టిస్ట్ గా చేరాను. తర్వాత ఈనాడుకు వచ్చాను. ఆ తర్వాత ఉదయం లో చేసాను. ఆ తర్వాత ఒక 10-15 ఏళ్ళు ఒక అమెరికన్ ప్రాజెక్ట్ కు ఫ్రీ లాన్సర్ గా చేసాను. గత 30 ఏళ్ళుగా ఈ రంగంలో ఉన్నాను.
మీరు పొందిన అవార్డ్స్ కాని, మీరు మర్చిపోలేని ప్రసంశలు కాని, ఏమైనా ఉన్నాయా ?
ఏ పోటీలకు నేను బొమ్మలు పంపలేదండి. ఆ వైపు ఆసక్తి లేదు. నేను వేసే బొమ్మ నాకు తృప్తి కలిగిస్తే చాలనుకుంటాను. ఎక్సిబిషన్ లలో కూడా ఎప్పుడూ పాల్గొనలేదు.
భవిష్యత్తులో మీరు ఎటువంటి బొమ్మలు వెయ్యాలని అనుకుంటున్నారు ?
కాలం తీసుకువెళ్ళిన విధంగా వెళ్ళడం తప్ప, ముందస్తు ప్రణాళికలు ఏమీ ఉండవు నాకు.
ఒక బొమ్మకు సుమారుగా ఎంత సమయం తీసుకుంటారు ?
బొమ్మని బట్టి అండి. ఒక బొమ్మ అరగంటలో అయిపోతే, ఒక్కొక్కటి రెండు మూడు రోజులు పడుతుంది.
బొమ్మల్ని సేల్ కి పెడతారా, లేక ఆర్డర్ పై వేస్తారా ?
ఎవరైనా ఫోన్ చేసి అడిగితే, వారి అవసరాన్ని, ఆ కంటెంట్ ను బట్టి వేసి ఇస్తాను.
సహజంగా నాకు ఏ బొమ్మైనా నాకు నచ్చే వేసుకుంటాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం బొమ్మ నచ్చుతుంది. అప్పుడు వారు మెచ్చుకుని, ప్రోత్సాహం అందిస్తారు.
మన గురవారెడ్డి గారు (సన్షైన్ హాస్పిటల్) ఉన్నారు కదండీ, వారు ఎక్కడ సంపాదించుకున్నారో, ఒకసారి సంక్రాంతికి వేసిన బొమ్మ, పెద్దది చేయించుకుని, ప్రింట్ లో స్టేజి వెనుక పెట్టుకున్నారు. తర్వాత ఆయన ఫోన్ చేసి, ఒక బొమ్మ గురించి బాగా మెచ్చుకున్నారు.
ఏం లేదండి. నన్ను బొమ్మలు వెయ్యమని ఎవరూ బలవంతపెట్టలేదు. నేనూ అలాగే వాళ్లకు ఆసక్తి ఉన్న రంగాలను ఎంచుకోనిచ్చాను. వాళ్ళు ఇటు వచ్చి
ఉంటే, నా దగ్గర చాలా నేర్చుకునే అవకాశం ఉండేది. కాని, వాళ్లకు ఆసక్తి లేనప్పుడు నేను వారిమీద ఒత్తిడి పెట్టదలచుకోలేదు.
ఉంటే, నా దగ్గర చాలా నేర్చుకునే అవకాశం ఉండేది. కాని, వాళ్లకు ఆసక్తి లేనప్పుడు నేను వారిమీద ఒత్తిడి పెట్టదలచుకోలేదు.
మీ చిత్రకళకు మీ కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎలా ఉంటుంది ?
నా వృత్తే ఇది కనుక, వారు కూడా అర్ధం చేసుకుని, అన్నివిధాలా సహకారం అందిస్తారు.
మీరు ఎవరికైనా ఆర్ట్ నేర్పుతున్నారా ?
సెలవల్లో వచ్చిన పిల్లలకు గతంలో నేర్పించాను. ప్రస్తుతం నాకు అంత సమయం లేదు.
ప్రస్తుతం ఎక్కడ పనిచేస్తున్నారు ?
సాక్షిలో చేస్తున్నానండి. ‘ఫ్యామిలీ సండే’ అన్న ఫీచర్ లో మిగతా చోట్ల కూడా అక్కడక్కడా నా బొమ్మలు కనిపిస్తూనే ఉంటాయి.
ప్రస్తుతం ఆర్ట్ రంగం ఎలా ఉంది ? భావి చిత్రకారులకు మీరిచ్చే సందేశం ఏమిటి ?
శ్రీ వాసు గారు మరిన్ని గొప్ప గొప్ప బొమ్మలు వేసి, తెలుగు చిత్రకారుల జాబితాలో అగ్రస్థానంలో నిలవాలని, మనసారా ఆకాంక్షిస్తోంది "అచ్చంగా తెలుగు".
No comments:
Post a Comment