నీళ్ళు......నీళ్ళు...........! !!
పెయ్యేటి శ్రీదేవి
నీళ్ళు లేవంటారేం?
ఎక్కడబడితే అక్కడ నీళ్ళు!
మనం నడిచేది నీళ్ళమీంచే!
నల్లాగొట్టాలు చిల్లుపడి
రోడ్లమీద వద్దన్నా వినక
వృధాగా, విచ్చలవిడిగా, సర్పనాట్యం చేస్తూ పోయే
నీళ్ళమీంచే కదూ మనం నడుస్తున్నాం?
మేము తక్కువా అన్నట్లు
మరోపక్క డ్రైనేజిగొట్టాల్లోంచి కూడా
పొంగిపొర్లిపోయి,
తప్పించుకుందామన్నా కుదరక
పాదాలను తాకుతూ, దుర్గంధాన్ని వెదజల్లుకుంటూ పోయే
మురికినీటిలోంచే కాదూ
' ఛీ!' అనుకుని ముక్కు మూసుకుంటూ మనం నడిచేస్తున్నాం?
మనసులోని బాధని అణచిపెట్టుకుని,
వాటికి అలవాటు పడిపోయి,
ఎవరికి వారం ' మనకెందుకులే?' అనుకుంటూ
పట్టించుకోకుండా అందరూ వెళ్ళిపోతుంటే,
మనసులోని బాధని ఆపుకోలేక,
ఓ వెర్రినవ్వోటి నవ్వుకుని,
' ఇండియా ఈజ్ మై కంట్రీ'
అనుకుంటూ నేనూ సాగిపోయా!
నీళ్ళు లేవంటారేం?
టాంకర్లలోంచి వృధాగా పోయే నీరు!
రోడ్లమీద నీరు! వర్షపునీరు!
కంట్లో ఆగని కన్నీరు!
కాని, నల్లాల్లో నీరే వుండదు!
తాగటానికి, వాడకానికి పనికిరాక,
నేలమీద వృధాగా పోయే నీరు
ఎంతుంటే మాత్రం ఏమిటి?
ప్రజల కళ్ళనించి వచ్చే కన్నీటికి
మంత్రుల కంట్లో కన్నీరు వచ్చేనా?
వారి మనసులు కరిగేనా?
అన్నట్లు నల్లా వచ్చే టైమయిందని
వర్షపునీటిలో తడుచుకుంటూ వెడితే
ఆరోజు నల్లా రాదన్నారు.
ఉసూరుమని ఖాళీబిందెతో వస్తూ
కింద వర్షపునీరు, మురికినీరు
కలిసిపోయి ప్రవహిస్తూంటే
తప్పించుకుందామన్నా కుదరక
జారిపడ్డాను!!
కాలు నెప్పి చేసింది.
బిందె సొట్టపోయింది.
నాలిక తడారిపోయింది.
నీళ్ళు వచ్చేదెప్పుడో?
ప్రజల నీటికష్టాలు తీరేదెప్పుడో??" నల్లాలో నీటిని రప్పించలేం!
కంట్లో కన్నీటిని ఆపలేం!!"
_____________________
ఎక్కడబడితే అక్కడ నీళ్ళు!
మనం నడిచేది నీళ్ళమీంచే!
నల్లాగొట్టాలు చిల్లుపడి
రోడ్లమీద వద్దన్నా వినక
వృధాగా, విచ్చలవిడిగా, సర్పనాట్యం చేస్తూ పోయే
నీళ్ళమీంచే కదూ మనం నడుస్తున్నాం?
మేము తక్కువా అన్నట్లు
మరోపక్క డ్రైనేజిగొట్టాల్లోంచి కూడా
పొంగిపొర్లిపోయి,
తప్పించుకుందామన్నా కుదరక
పాదాలను తాకుతూ, దుర్గంధాన్ని వెదజల్లుకుంటూ పోయే
మురికినీటిలోంచే కాదూ
' ఛీ!' అనుకుని ముక్కు మూసుకుంటూ మనం నడిచేస్తున్నాం?
మనసులోని బాధని అణచిపెట్టుకుని,
వాటికి అలవాటు పడిపోయి,
ఎవరికి వారం ' మనకెందుకులే?' అనుకుంటూ
పట్టించుకోకుండా అందరూ వెళ్ళిపోతుంటే,
మనసులోని బాధని ఆపుకోలేక,
ఓ వెర్రినవ్వోటి నవ్వుకుని,
' ఇండియా ఈజ్ మై కంట్రీ'
అనుకుంటూ నేనూ సాగిపోయా!
నీళ్ళు లేవంటారేం?
టాంకర్లలోంచి వృధాగా పోయే నీరు!
రోడ్లమీద నీరు! వర్షపునీరు!
కంట్లో ఆగని కన్నీరు!
కాని, నల్లాల్లో నీరే వుండదు!
తాగటానికి, వాడకానికి పనికిరాక,
నేలమీద వృధాగా పోయే నీరు
ఎంతుంటే మాత్రం ఏమిటి?
ప్రజల కళ్ళనించి వచ్చే కన్నీటికి
మంత్రుల కంట్లో కన్నీరు వచ్చేనా?
వారి మనసులు కరిగేనా?
అన్నట్లు నల్లా వచ్చే టైమయిందని
వర్షపునీటిలో తడుచుకుంటూ వెడితే
ఆరోజు నల్లా రాదన్నారు.
ఉసూరుమని ఖాళీబిందెతో వస్తూ
కింద వర్షపునీరు, మురికినీరు
కలిసిపోయి ప్రవహిస్తూంటే
తప్పించుకుందామన్నా కుదరక
జారిపడ్డాను!!
కాలు నెప్పి చేసింది.
బిందె సొట్టపోయింది.
నాలిక తడారిపోయింది.
నీళ్ళు వచ్చేదెప్పుడో?
ప్రజల నీటికష్టాలు తీరేదెప్పుడో??" నల్లాలో నీటిని రప్పించలేం!
కంట్లో కన్నీటిని ఆపలేం!!"
_____________________
No comments:
Post a Comment