పండిపోయిన అరటికాయ పచ్చడి
పెయ్యేటి శ్రీదేవి
ఒక్కోసారి వెంతనే వండడం కుదరక అరటికాయలు పండిపోతుంటాయి. అలాంటప్పుడు ఈవిధంగా చెయ్యండి.
బాగా పండిన అరటికాయ ఒలిచి మెత్తగా నలపాలి. చింతపండు పులుసులో ఎండుమిర్చి, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకఱ్ఱ, కరివేపాకు, ఇంగువ పోపు వేసి, అరటిపండు గుజ్జు అందులో వేసి, ఉప్పు వేసి బాగా కలపాలి. కూరవడియాలు కూడా వేయించి అందులో కలపాలి. ఉట్టినే తిన్నా బాగుంటుంది. అన్నంలో కలుపుకు తిన్నా బాగుంటుంది. మరెందుకాలస్యం? చే్సిచూడండి.
No comments:
Post a Comment