స్వప్నసాక్షాత్కారం - అచ్చంగా తెలుగు

స్వప్నసాక్షాత్కారం

Share This

స్వప్నసాక్షాత్కారం

భమిడిపాటి స్వరాజ్య నాగరాజారావు.

 

నీ స్వప్నాలు సాక్షాత్కరింపబడాలంటే,

నిరాశల అలలను, అలజడులల సుడులను దాటి
నీ స్వప్నాలు నిజరూపం దాల్చాలంటే,
కెరటాల్లా, ఆరాటంగా పడిలేచే ఆలోచనలకు
నిశ్చలత్వం రావాలంటే,
నీ ఆశలు ఆవిష్కరింపబడాలంటే,
విజయాన్ని సాధించటం నీ తరమవాలంటే
నీ ప్రయత్న ప్రాకారంలోకి ఉత్సాహాన్ని ఆహ్వానించాలి,
పట్టుదలతో పిడికిళ్ళు బిగించాలి,
నిరాశ, నిస్తేజాలను చంపుకోవాలి,
ఆవేదనల సంకెళ్ళను త్రెంపుకోవాలి,
శ్రమను ప్రేమతో స్పందించాలి,
నీ మదిలో దానికి ప్రధమస్థానం అందించాలి.
అప్పుడు విజయం నీ పరమౌతుంది,
వికాసం నీ తరమౌతుంది,
అలా నీకలలు సాకారమౌతాయి,
నీ ఆనందపు ప్రాకారమౌతాయి.

No comments:

Post a Comment

Pages