కాకరకాయ పొడి కూర - అచ్చంగా తెలుగు

కాకరకాయ పొడి కూర

Share This

కాకరకాయ పొడి కూర 

శిరీష 


వారం రోజులైనా  చక్కగా నిలవ ఉండే 'కాకరకాయ పొడి కూర' ఒక్కసారి  చేసి ఫ్రిజ్ లో పెట్టుకుంటే, ఉద్యోగాలు చేసేవారికి ఎంతో వీలుగా ఉంటుంది. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా !
కావలసిన పదార్ధాలు :
పావుకిలో కాకరకాయలు
పొడికి : పుట్నాల పప్పు - 100 గ్రా.
ఎండు కొబ్బరి - అరచిప్ప
జీలకర్ర, ఉప్పు, కారం నూనె  - తగినంత
తయారీ విధానం :
పొడికి చెప్పిన  పదార్ధాలన్నీ మిక్సీలో పొడి చేసి  పెట్టుకోవాలి.
కాకరకాయలు కొంచెం పెద్ద ముక్కలు కోసి, మజ్జిగ నీళ్ళలో ఉడకబెట్టాలి, ఆ నీరంతా ఆవిరైపోవాలి కనుక, ఎక్కువ పొయ్యకూడదు. అలా ఉడికిన ముక్కలు కాసేపు ఆరనివ్వాలి. తర్వాత నూనెలో కాకరకాయ ముక్కలు వేసి, బాగా వేగాకా, ఈ పొడి కూడా వేసేసి, వేగనివ్వాలి. చక్కటి రుచికరమైన కాకరకాయ పొడి సిద్ధమవుతుంది. మీరూ ప్రయత్నించి చూడండి.
******

No comments:

Post a Comment

Pages