కళ్యాణి మణిద్వీప మందున ఉదయించే తొలిరాగమై
రెడ్లం చంద్రమౌళి
పల్లవి: సంగీతం శ్రుతిలయలుగా సాహిత్యం కృతి పలికెనే
లయతోడై రాగమ్ము రసమయ భావాన్నే పలికించగా
װసంగీతంװ
చరణం:1 నాధంలో వెలిసింది రాగం స్వరగతులే ధ్వనియించగా
నాట్యంలో విరిసింది తాలం తాండవమూ లాస్యమ్ముగా
ఊహల్లో జనియించి భావం అక్షరమే ప్రతిరూపమవగా
గానంలో రసరమ్య గీతం హృదయాన్నే కదిలించలేదా
సంగీతం...స్వరమేలే...సాహిత్యం...పదమేలే...
చరణాలే జతచేరి పల్లవి గేయంలో జ్ఞానమ్ము తెలుపగ
װసంగీతంװ
చరణం:2 కళ్యాణి మణిద్వీప మందున ఉదయించే తొలిరాగమై
ప్రతిరాగం కళ్యాణి నుండీ జతవీడి జనియించగా
ఓంకారం ప్రధమాక్షరముగా పలికేనే పాపాయిలే
ప్రతి మంత్రం ఉచ్ఛారమందున ప్రాణమ్మే ఓంకారమవగా
వేదాలే...నాధాలై...ఓంకారం...బీజాలై...
కుండలినీ జాగృతిని చేయుచు ఓంకారం సాగింది నాలో
װసంగీతంװ
No comments:
Post a Comment