ఫటా ఫట్..ధనా ధన్ - అచ్చంగా తెలుగు

ఫటా ఫట్..ధనా ధన్

Share This
 
ఫటా ఫట్..ధనా ధన్
- ప్రతాప వెంకట సుబ్బారాయుడు

అతి తెలివి అంటే?
కోర్ట్ బయట భగవద్గీతలు అమ్ముకోవడం.
*****
ఇష్టమైన రాక్షసులు?
పిల్లలు
*****
కట్టె..కొట్టె..తెచ్చే..?
కథ రాశాడు..పోస్ట్ చేశాడు..తిరిగొచ్చేసింది
*****
మంచితనం?
మోసపోవడానికి మార్గం..మోసంచేయడానికి అస్త్రం
*****
ఒకరి తలమీద మరొకరు చెయ్యెడితే?
పెళ్లి.
*****
ఉత్తమ రాజకీయ నాయకుడు?
శారీరకంగా మనుషుల మధ్యలో..మానసికంగా వాళ్లకందనంత ఎత్తులో
*****
పెళ్లిచూపుల్లో అబ్బాయి తండ్రి ఎడిటర్ అయితే?
"అమ్మాయి నచ్చితే వీలువెంబడి తెలియజేస్తాం. దానిపై ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకు తావులేదు"అంటాడు.
*****

No comments:

Post a Comment

Pages