ప్రపంచదేశాలలోని ప్రజా సంక్షేమ చట్టాలు - అచ్చంగా తెలుగు

ప్రపంచదేశాలలోని ప్రజా సంక్షేమ చట్టాలు

Share This

ప్రపంచదేశాలలోని ప్రజా సంక్షేమ చట్టాలు

అంబడిపూడి శ్యామసుందర రావు  


ప్రతి దేశము  ప్రజల సంక్షేమము కోసము చట్ట సభలలో చట్టాలు చేసి అధికార యంత్రాంగము  ద్వారా అమలు పరుస్తుంటారు అమెరికా వంటి దేశాలలో రెండు రకాల చట్టాలు ఉంటాయి ఒకటి మొత్తము దేశానికి వర్తించేది రెండవది అ రాష్ట్రము వరకే పరిమితము అయినది. వీటి ముఖ్యమైన ఉద్దేశ్యము ప్రజల సంక్షేమము ప్రస్తుతము మనము  దేశాలలో అమలులోవున్న చట్టాలను గమనిద్దాము వాటిలో ఇమిడి ఉన్న ప్రజాహితాన్ని గమనిస్తే అటువంటివాటిని మనము కూదా పాటించవచ్చు . మన రాజ్యాంగమే అన్ని దేశాల రాజ్యాంగలను చూసి,మంచి అంశాలను గ్రహించి తయారుచేసినదే కదా.
        ఫిన్లాండ్ దేశములో గర్భిణి స్త్రీకి ప్రభుత్వము ఉచితముగా ఒక "మెటర్నిటీ బాక్స్" ఇస్తారు ఇందులో పసిపిల్లలకు అవసరమైన పక్క బట్టలు,జంప్ సూట్స్, సాక్స్ డైపర్స్ మొదలైనవి ఉంటాయి. ఈ బాక్స్ పుట్టిన శిశువుకు మంచము లా వాడుకొనే వీలు ఉండేలా తయారుచేస్తారు. ఈ విధముగా పుట్టబోయే పట్ల ప్రభుత్వము శ్రద్ద తీసుకొని శిశువు అవస రాలను తీరుస్తుంది .
       ఇంచుమించుగా చాలా దేశాలలో పనిచేస్తున్న గర్భిణీ స్త్రీలకు,వారి భర్తలకు ప్రసూతి సెలవు జీతము నష్టము  లేకుండా ఇస్తారు ఇచ్చే సెలవు కాల పరిమితి ఒకొక్క దేశములో ఒక రకముగా ఉంటుంది ఈ విషయములో బాగా ఉదారముగా ఉండే దేశము జెక్ రిపబ్లిక్. మొదటి బిడ్డకు తల్లిదండ్రులిద్దరి కి 48 వారాలు  జీతముతో సెలవు ఇస్తారు రెండవ బిడ్డ పుట్టినప్పుడు 14 వారాలు జీతముతో సెలవు ఇస్తారు.
     నార్వే దేశములో పండగ సందర్భముగా ప్రజల కొనుగోళ్ళు సులభతరము చేయటానికి వీలుగా ప్రభుత్వము నవంబరు నెలలో  వస్తువులపై ట్యాక్సును యాభై శాతము తగ్గిస్తారు ఫలితముగా క్రిస్మస్ పండుగను తక్కువ ఖర్చుతో ఆనందముగా గడుపుకుంటారు.
       ఫిన్లాండ్ ,స్వీడన్ దేశాలలో హింస లేని నేరాలకు జరిమానా తో సరిపెడతారు. ఈ జరిమానాలు కూడా నేరము చేసిన వారి ఆదాయాన్ని బట్టి నిర్ణయిస్తారు ఉదాహరణకు ఫిన్లాండ్ లో 11 మిలియన్ డాలర్ల ఆదాయము ఉన్న వ్యక్తీ కారు వేగముగా నడిపితే అతనికి వేసే జరిమానా రెండు మిలియన్ డాలర్లు కాబట్టి అ భయము తో ఎవరు నేరాలు చేయటానికి సాహసించరు .మనకేమో ఫైన్ ఎవరికైన ఒకటే కాబట్టి డబ్బు ఉన్నవాడికి నేరము చేయటము ఫైన్ కట్టటము చాలా సులువు.
       నెదర్ ల్యాండ్ దేశములో పది సంవత్సరాల వయసు దాటిన వారు సైకిల్ తొక్కటానికి ప్రాక్టికల్ పరీక్ష పాస్ అయి లైసెన్సుతీసుకోవాలి ట్రాఫిక్ రూల్స్అన్ని తెలిసి ఉంటేనే లైసెన్సు మంజూరు చేస్తారు ఈ రూల్స్ అన్ని సైకిల్ కే మోటార్ సైకిళ్ళు కార్లకు కాదు దీనివల్ల పిల్లలో ట్రాఫిక్ నియమాలు తెలిసి సైకిల్ వాడకము పట్ల అభిరుచిని పెంచుకుంటారు ఫలితముగా కార్ల వాడకము తగ్గి కాలుష్యము తగ్గుతుంది మనకేమో డబ్బున్న వాళ్ళ పిల్లలు సైకిల్ తొక్కవలసిన వయస్సులో,  లైసెన్సు లేకుండా మోటార్ సైకిళ్ళు కార్లు  నడుపుతు ఆక్సిడెంట్లు జరపటము మనము నిత్యము వింటూనే ఉంటాము.
       స్వీడన్ లో స్కూల్ పిల్లలు క్రమము తప్పకుండా స్కూల్ కు హాజరుఅవుతే 1. 87 డాలర్లు సంపాదించినట్లే ఇది పిల్లల హాజరు శాతాన్ని పెంచుతుంది.
         జర్మనీ నగరాలలో ఇళ్ళ చెత్తను తూచి పౌండుకు రెండు దాలర్లచోప్పున వసూలు చేస్తారు అందువల్ల ఇళ్ళలోని వారు చెత్తను బయట పడవేయకుండా చెత్తను తిరిగి ఇతర పనులకు అంటే ఉదాహరణకు చెత్తను కంపోస్ట్ గా ,వాడుకుంటారు
        స్వీడన్ లో ఎవరైతే పౌరులు ట్రాఫిక్ నిభందనలను అతిక్రమించరో వారి పేర్లను ఒక లాటరీ లో జేరుస్తారు ఆవిధముగా లాటరీ పూల్ లో చేర్చబడిన వారికి మూడువేల డాలర్లు గెలుచుకొనే అవకాశాము ఉన్నది దీనివల్ల ప్రజలు ట్రాఫిక్ నిభందనలను అతిక్రమించకుండా జాగ్రత్తగా ప్రయాణిస్తారు వారి జాగ్రత్త ట్రాఫిక్ రూల్స్ పట్ల విధేయతకు బహుమతి (సొమ్ము రూపములో) కూడా లభిస్తుంది,
       ఆస్ట్రేలియాలో పౌరులు విధిగా వోటింగ్ లో పాల్గొనాలి లేని పక్షములో వారికి భారీగా ఫైన్ వేస్తారు అందువల్లే ఆస్ట్రేలియాలో ఎన్నికలలో డాడాపు 95% పోలింగ్ ఉంటుంది  అమెరికాలో అయితే 36. 6%మాత్రమే ఉంటుంది ఆస్ట్రేలియాలో ఫైన్ కు భయపడి వోట్ వేయటము ఇష్టము లేనివారు ఖాళీ బ్యాలెట్ పేపర్ ను  గీతలతో బాక్స్ లో పడవేస్తారు అందుకే మనవారు "నోటా "ఆప్షన్ ఎన్నికలలో ప్రవేశ పెట్టారు
      బ్రెజిల్ దేశములో జైలు శిక్ష అనుభవిస్తున్నవారు జైలులో పుస్తకాలు చదువుతుంటే శిక్షా  తగ్గిస్తారు ఖైదీ తను చదివిన ప్రతి పుస్తకానికి సరి అయిన నివేదిక జైలు అధికారులకు అందజేస్తే పుస్తకానికి నాలుగు రోజుల చొప్పున శిక్ష తగ్గిస్తారు.ఇది ఖైదీలలో మంచి పరివర్తన తెచ్చింది ఈ పధకము అమలు చేసినప్పుడు బ్రెజిల్ లో దాడాపు 30%నేరాలు తగ్గినాయి.
          నార్వే ప్రభుత్వము ఆయిల్ ,పెట్రోల్ పై వసూల్ చేసే పన్నులను" రైనీ డే" పధకము క్రింద నిల్వ చేస్తారు 2014 ప్రారంభములోనే ఈ నిల్వ సొమ్ము 828 మిలియన్ డాలర్లకు చేరింది ఆయిల్ నిల్వలు తరిగిపోయి క్లిష్ట మైన ఆర్ధిక పరిస్తుతులు ఏర్పడితే వాటిని ఎదుర్కోవటానికి ఈ నిల్వ సొమ్ము ఉపయోగపడుతుంది అని అక్కడి ప్రభుత్వము ముందు చూపు చర్య మనకేమో రేపన్న ఆలోచనే లేకుండా వచ్చిన సొమ్ము వచ్చినట్లుగా ఖర్చు చేసి అప్పులకు బయలుదేరుతాము.
       ఇంగ్లండ్ ,ఇతర యూరోపియాన్ దేశాలలో టి.వి లలోని వాణిజ్య ప్రకటనలు  ఎనిమిది నిమిషాలు మించరాదు మనకైతే వాణిజ్య ప్రకటనలు మొదలైతే ఎంత టైము పడుతుందో దేముడికే తెలియాలి అమెరికా వాళ్ళు మనని మించిపోయారు వాళ్ళకు ప్రతి ఎనిమిది నిమిషాల ప్రోగ్రాం కు మూడు నిమిషాల వాణిజ్య ప్రకటనలు ఉంటాయి.
         కెనడాలో విదేశాల నుండి వచ్చి ఉండేవారికి ఒక సంవత్సరము పాటు కెనడాలోని మ్యూజియమ్ లు కల్చరల్ సెంటర్ లలో ఉచితముగా ప్రవేశము ఉంటుంది ఎందుకంటే విదేశాలనుండి వచ్చి కెనడాలో స్తిర పడేవారికి కెనడా సంస్కృతీ సాంప్రదాయాలు తెలియాలి కదా. మన దేశములో అయితే మ్యూజియములు మొదలైనవాటిలో ప్రవేశానికి మనకు పదిరూపాయలైతే విదేశియులకు వంద ఉంటుంది అలాగే గైడ్ లు ట్యాక్సి లవాళ్ళు విదేశీయులను బాగా దోచేస్తారు అందువల్లే మన మీద వాళ్ళకు సదభిప్రాయము ఉండదు.
      యూరొప్ దేశాలలో వ్యాధులు వ్యాప్తి చెందకుండా రోగులకు వేతనముతో కూడుకున్న సెలవు (సిక్ లీవ్)మంజూరు చెస్తారు ఫలితముగా జబ్బు చేసినవారు ఇళ్ళ దగ్గిరే ఉండి రోగాల వ్యాప్తిని అరికడతారు  ఆఫీసులకు వస్తే తోటి ఉద్యోగస్తులకు వ్యాధి క్రిములను అంటగట్టే ప్రమాదము ఉంది .
       రష్యా లో వింటర్ ఒలంపిక్స్ సన్నాహాలలో భాగముగా మెట్రో రైళ్ళలో ప్రయాణించే ప్రయాణీకులు వారి టికెట్టు ను డబ్బు చెల్లించకుండా గుంజీలు తీసి టికెట్టు తీసుకోవచ్చు వింటర్ ఒలంపిక్స్ ప్రారంభానికి ఒక నెల ముందు మాస్కో మెట్రో స్టేషన్ లో ఈ పధకాన్ని  పెట్టారు మంచి స్పందన కూడా వచ్చింది
      మందులు అధిక పరిమాణాలలో వాడటమువల్ల ఇతరత్రా మందుల వాళ్ళ కలిగే దుష్ పరిమాణాలను ప్రజలకు తెలియజేయటానికి నెదర్ ల్యాండ్స్ ప్రభుత్వము ఉచితముగా మందుల పరిశోధన కేంద్రము కేంద్రము ద్వారా సేవలు అందిస్తుంది ఈకేంద్రము ద్వారా మందులలో ఉండే రసాయనాలు  ఫలితాలు ,ఏమైనా హానికర పదార్ధాలు ఉన్నాయా,ఏదైన ప్రమాదము జరిగితే తీసుకోవలసిన చర్యలు అన్ని తెలియజేస్తారు .
ఇవండీ వివిధ దేశాలలో ప్రజా సంక్షేమము కోసము ప్రభుత్వాలు అమలు చేసే ప్రజాహిత కార్యక్రమాలు వాటిలో మంచివి అనిపిస్తే (పాలకులకు) కొన్ని అయిన మనము పాటించవచ్చు ఆలోచించండి
***

No comments:

Post a Comment

Pages