శివం – 25 - అచ్చంగా తెలుగు

శివం – 25

Share This

శివం – 25  

(శివుడే చెబుతున్న కధలు )

రాజ కార్తీక్
9290523901

(  శివభక్తుడైన ఉద్భవుడి కధను చెబుతుంటాడు శివుడు..)
మంత్రి గారు “నాయనా ఉద్భవా ! ఇంతకాలం నిన్ను తప్పుగా అర్ధం చేసుకున్నాను. అవును, నిన్నే కాదు మహాత్ములు ఎవరినీ ఈ ప్రపంచం అర్ధం చేసుకోలేదు. యుగాలు తపస్సు చేసిన దొరకని అదృష్టం, నువ్వు మాకు కల్పించావు. నిజమైన భక్తికి దేవుడు పరుగున వస్తాడు అని నిరుపించావు. నీ ప్రజ్ఞా పాటవాలు తెలిసి కూడా నీ మనసుని అర్ధం చేసుకోలేక నిన్ను చాల సార్లు దుషించాను, నన్ను క్షమించు .నిజంగా నీవు నీ తండ్రి పూజ పలం కొద్ది పుట్టావు  ”అనుకున్నాడు మనసులో.
ఉద్భవుడు నన్ను అలాగే నిశ్చలంగా చూస్తున్నాడు. జక్కన్న ఇంకా పరుగున వచ్చి నన్ను ఆర్తిగా చూస్తున్నాడు.
రూపం లేని నేను వీరందరి కోసం విరాట్ రూపంలో దర్శనం ఇచ్చాను.
నేను “చెప్పు ఉద్భవా, నీ కోరిక ఏమిటి ?” అని అడిగాను.
ఉద్భవుడు “నాకు ఏమి కోరికలు ఉన్నాయ్ స్వామి, రాజ్యం ఇచ్చావు ,ఇంతమందికి రాజును నీకు సేవకుడను. ”
నేను “ఉద్భవా ..లింగోఉద్భవా..రాజ్యాన్ని పరిపాలించి ఆదర్శ రాజుగా పేరు తెచ్చుకుంటావు. ఇహము పరము రెండిటిని నీకు  అనుగ్రహిస్తున్నా” అన్నాను.
అక్కడ  ప్రజలందరూ వరుసగా వచ్చి నా పాదాలకు వందనం చేసుకుంటున్నారు
సమూహంలో ఈ రోజు అదృష్టం అన్న బైరాగి,  నా చరణాలు పట్టుకొని “మహేశ్వర ..ఇంత కన్నా ఆనందం ఏమి ?? ఆలయంలో దేవుణ్ణి దర్శించుకునట్టు ప్రత్యక్షంగా నిన్ను ఈ ఉద్బవుడి వల్ల  చూడ గలుగుతున్నాం” అన్నాడు.
చెప్పడం మరిచాను ..ఇందాక ఆలయ గోడ పేలుడు ధాటికి మూర్చిల్లిన ఒకడు లేచి
“ఉద్భవుడు..ఎక్కడ నీ అంతు చూస్తా” అని కసిగా జన సమూహాన్ని చూస్తూ నన్ను గమనిచకుండా వస్తున్నాడు.
అంతే అతను నన్ను చూసాడు ..ఒక్కసారిగా మాట రాలేదు .
చేతులు పైకి ఎత్తి “సామీ సామీ నీవేనా నిజమేనా ..శివయ్య .వామ్మో ఇది కలా నిజామా ..ఏందీ శివయ్య ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నాడు ”అంటూ అటు ఇటు చూసాడు ..
అందరు తల పైకి ఎత్తి నన్నే చూస్తున్నారు ..
“సామి ఉద్భవుడ్ని చంపటానికి నువ్వోచ్చావ్ కదూ ! చంపావా ఆ దైవ ద్రోహిని ? ”అని అడిగాడు.
ఉద్భవుడు”ఇంకా అంత అదృష్టం రాలేదు నాయనా నాకు ” అన్నాడు శాంతంగా.
నేను “కుమారా ..భయపడవలదు. మీ రాజు నా కోసమే ఇదంతా చేసాడు. ఆలయపు గోడ మళ్లీ పునర్నిర్మించాడానికి ఇదంతా చేసాడు..” అన్నాను.
“ఉద్భవా..నువ్వు అడుగకున్నా నీ కోరిక నెరవేరుస్తాను. జక్కన్న మీ అమ్మాయి నీ బతికిస్తున్నా, పూర్ణ ఆయుషుతో నన్ను చేరుకునే భాగ్యం కూడా ఇస్తున్నా”
అనగనే ఒక వెలుగు రూపం ఆ అమ్మాయిలోకి ప్రవేశించింది. ఆ అమ్మాయి లేచి వచ్చి నాన్నగారు అంటూ జక్కన్నను వాటేసుకుంది.
ఉద్భవుడు “చిన్నారి, అదిగో అందరికి నాన్న పరమ పిత అయిన పరమేశ్వరుడు. పుట్టాక చావు లేని వాడు ..అన్ని అంతా తానుఒక్కటే అయి ఉండే వాడు” అన్నాడు.
అందరూ “ఇదేమన్న వింతా ? శివయ్య తలుచుకుంటే ఇవన్ని ఏమి ఉంది ?” అంటున్నారు ఈ లీల చూసి.
ఈలోపు జకన్న భార్య కూడా వచ్చి తన కుమార్తెను చూసి ఎంతో గానో ఆనంద పడింది.
అందరు నన్ను శరణు వెడుతున్నారు.
నా పైగా ఒక మహా మేఘం వెళ్తోంది. నా మీద మాత్రమే వాన కురిపిస్తుంది. అదీ నాకు అభిషేకం చేస్తుంది. అందరికి అది కన్నుల పండుగగా ఉంది.
“అభిషేక దర్శనం పాప హరణం ..మోక్ష ప్రదాయకం ..”అంటూ అందరూ గీతాలు ఆలపిస్తున్నారు.
తర్వాత, నేను “నాయనా ఉద్భవా! నీకు పితృ సమానడు అయిన మీ మంత్రిగారు చూసిన కన్యను పరిణయం ఆడు. నీవు నా ప్రియమైన భక్తుడువి. ఇక మీరు కూడా మానవత్వం తో మీ జీవన విధానాన్ని కొనసాగించండి. మీరందరూ నన్ను చేరుకుంటారు.” అన్నాను.
అందరు అలగే అన్నట్లు ఆనందంగా తలలూపారు.
నేను “నాయనా నీవు అడిగినట్లు నీ కోరిక తీర్చాను, సంతోషమేనా” అని అడిగాను.
ఉద్భవుడు “చివరిగా ఒకటి ప్రభు ” అంటూ ఆగాడు.
నేను “చెప్పు నాయనా ” అన్నాను.
ఉద్భవుడు “ప్రభూ మిమ్మల్ని ఇక్కడ ప్రజలందరూ ప్రత్యక్షముగా అభిషేకం చేసుకుంటారు.” అని విన్నవించుకున్నాడు.
నేను “తధాస్తు ” అని, మాములు రూపం లోకి వచ్చి, వారి ముందు ఉన్నాను.
ఉద్భవుడు వెనువెంటనే పల్లకి తెప్పించాడు.
“స్వామి ఎప్పుడూ మీ విగ్రహారూపాన్ని ఊరేగిస్తాము .ఈరోజు సాక్షాత్తు మిమ్ములనే ఊరేగిస్తాము.” అంటూ ఉద్భవుడు నన్ను చెయ్యి పట్టుకొని తీసుకువెళ్ళాడు పల్లకి అధిరోహింప చేసాడు.
ఇక అందరూ “హర హర మహాదేవ ”అంటూ ఊరేగిస్తున్నారు. ఆ గుంపులో చాలా మంది నా పైన పూల జల్లు కురిపిస్తున్నారు. ఉద్భవుడు ఐతే పల్లకి వదిలిపెట్టకుండా తీవ్ర తన్మయత్వంతో నన్నే తలుస్తున్నాడు. అందరు అదే స్థితిలో ఉన్నారు.
ఆలయం లోకి తీసుకువెళ్ళి  గర్భ గుడిలో నన్ను అసినుడ్ని చేసారు.
ఇక నాకు అభిషేకం చేయని వారు లేరు. నన్ను స్పర్శించని వారు లేరు.
నా పాదాలకి నమస్కారించని వారు లేరు. పిల్లలు పెద్దలు అందరూ దణ్ణాలు పెడుతున్నారు. నా ఎదురుగా ఉన్న నంది విగ్రహం లోంచి ‘నేను కనపడట్లేదు’ అని బేల చూపులు చూస్తున్నాడు.
ఉద్భవుడు ఐతే నన్ను అదే పనిగా అంటిపెట్టుకొని ఉన్నాడు.
అందరి మనసు నిజస్తితిలో ఓలలాడుతుంది.
అందరు ఒక్కసారి “హర హర మహాదేవ ”అంటూ ఊగిపోతున్నారు.
నేను “భక్తులారా. నన్ను చూచుటకు మీరు వెతుకే న్యాయమైన మార్గాలకు నా అండదండలు ఎప్పుడూ ఉంటాయి. ఎల్లప్పుడూ భక్తి భావన కలిగి ఉండ౦డి. అన్నీ నేనే  నడిపిస్తాను ..” అన్నాను.
ఉద్భవుడు ,మంత్రిగారు ,జక్కన్న కుటుంబం, భైరాగి ,ప్రజలు అందరూ ఎంతో ఆనందంలో ఉన్నారు.
నేను “ఉద్భవుడు వంటి రాజు దొరకటం మీ అదృష్టం. ఏ రాజుయినా తమ ప్రజలు సుఖ సంతోషములతో ఉండాలి అని చూస్తాడు. కానీ మీ రాజు తన ప్రజలకు జ్ఞాన వైరాగ్యాలను, భగవంతుని కరుణను, సాక్షాత్కారాన్ని చూపించాలి అనుకున్నాడు .అలగే ఎవరు నా గురించి ఎవరికీ చెప్పినా అది కూడా మీ పూజ లో భాగమే. ” అన్నాను.
ప్రజలు “మన మహారాజు ఉద్భవుడికి జై ”అని అంటుండగా ఉద్భవుడు “జయజయ శంకర హర హర శంకర ”అంటూ జయధ్వానాలు చేసాడు.
నేను “సర్వేజనా సుఖినోభవంతు ”అన్నాను.
విస్పోటనం లాంటి వెలుగు రాగానే.. అక్కడ దేదీప్యమైన శివ లింగం ఒకటి ఉంది.
“నేను ఐనా ఈ శివ లింగo ఐనా అంతా ఒకటే” అన్న స్వరం అందులోంచి వినిపించింది.
అందరు “ఓం : నమ శివాయ” అన్నారు.
        అదీ ఉద్భవుడు కధ. మీరు కూడా నన్ను చేరుకోటానికి న్యాయమైన మార్గములు అన్వేషించండి ..నెరవేరుస్తాను...ఎందుకంటే అంతా చేసేది నేనే.....

No comments:

Post a Comment

Pages