స్థావరం
సుజాత తిమ్మన
అక్కసు తో..తన వెన్నలని
నీకు పులిమేసి..
తాను ఎరుపెక్కి...
మెల్లగా జారుకుంటున్నాడు...
చందమామ...అదిగో చూడు....
ఆ కొండలకవతల
మబ్బుల మాటున....
ఒక దానితో ఒకటి పోటీ పడుతూ
గుస గుసల రాగాలు పలికిస్తున్నాయి
సెలయేటి అలలు ....
మంద్రంగా వీచే మలయమారుతం
తాకిడికి మత్తుగా ఊయలలూగుతున్నాయి
లేత చిగురులు...
నీ పాదాలను ముద్దాడుతున్న
పరవశంలో మ్రోగడం మరిచాయి
ముత్యలజతలతో మువ్వలు ....
ప్రకృతినే మైమరపింపజేస్తున్న
ఓ చెలీ...!!
అలనాటి రాధవై
ఆరాదనల నన్ను
అర్పింపజేసుకున్నావు
ఆ నందకిశోరునిగా
నన్ను మార్చి…
ప్రేమ సముదాయాలకు
స్థావరమవ్వాలి
మన ఐక్యతలో
ప్రతి నిత్యం....
మూసిన రెప్పల మాటున
దాగిన నలుపు సైతం
కలిసిన మన చూపుల
వెలుగులకి జడిసి
దరిచేరనిది అవ్వాలి...
శ్వాసల నుంచి జనించే..
ప్రేమ సుగంధ పుష్పాల
అభిషేకాలతో...మైమరచి...
మమేకం అవ్వాలి ..
మనం నుంచి ‘మా ‘ లోకి..!
*** *** *** ***
No comments:
Post a Comment