వందే వందే గజాననా(గేయం)
చెరుకు రామమోహనరావు
గౌరీ ప్రియసుత గజాననా
హారతిగొని మాకలుషమెల్లను
హరియించుమయా హరుతనయా || వందే వందే గజాననా ||
సకల కార్యముల కాద్యుడవీవే
సర్వ శుభములను కూర్తువు నీవే
నీదు పాదములు మదిలో నిలిపి
నిన్నే నిన్నే వినుతిన్తుమయా || వందే వందే గజాననా ||
మాతా పితరుల పాద సేవలో
మహిమమను నాదే చూపిటివి
జగతినేల్ల కాదు శీఘ్రగమనమున
చుట్టి కొమరుని ఓడగొట్టితివి || వందే వందే గజాననా ||
కార్య నిరతి కర్తవ్య దీక్షలో
కలకాలము మము నిలుపుమయా
గరికే పోచల గంపెడు ఆకుల
పూజలందుకొని భువిని బ్రోవుమా || వందే వందే గజాననా ||
ఆగ్రహ నిగ్రహ శక్తి యుతుడవు
అనుగ్రహించుము మాపైన
కరములు కలిపి వేడుకొందుము
కనికరించుమా కరుణాహృదయా || వందే వందే గజాననా ||
No comments:
Post a Comment