సృజనాత్మక చిత్రకారుడు - ఆర్టిస్ట్ శివనాగరావు
- భావరాజు పద్మిని
కళనే ప్రాణంగా, ఊపిరిగా భావించి, చిన్నతనం నుంచి తపస్సు చేసారు ఆ చిత్రకారులు. ఆ తపస్సుకు ప్రకృతి తలొగ్గి, తానే గురువుగా అతనికి శిక్షణ ఇచ్చింది. ఐతే కేవలం రంగులతోనే సరిపెట్టుకోలేదు అతను. తనలోని తృష్ణకు, సృజనను కలిపి, “మైక్రో కార్వింగ్స్” లో, “షార్ట్ ఫిలిమ్స్” తియ్యడంలో కృషి చేసి, తన సత్తా చాటుకున్నారు. ఇప్పటిదాకా 36 ప్రపంచ రికార్డులు స్థాపించి తెలుగువారి కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటుతున్న కృష్ణా తీర నివాసి, ఆర్టిస్ట్ శివ గారితో ప్రత్యేక ముఖాముఖి – మీ కోసం.
మా అమ్మ పేరు వెంకట రమణ, పిడకలు కొట్టేది, పొలం పని చేసింది. మా నాన్న పేరు తాతయ్య , నాన్న లారీ డ్రైవర్. అమ్మది ప్రొద్దుటూరు, కంకిపాడు మండలం, కృష్ణ జిల్లా. నాన్నది కూడేరు, ఐలూరు మండలం కృష్ణ జిల్లా.
ఇక నా గురించిన వివరాలు ఇవి...
నా పేరు : పామర్తి శివ నాగ రావు @ శివ పామర్తి
వృత్తి : పెయింటింగ్స్ వెయ్యటం , మైక్రో బొమ్మలు చెక్కటం
ప్రవృత్తి : ఫిల్మ్ మేకింగ్, మరియు కానూరు జిల్లా పరిషత్ హై స్కూల్ లో పార్ట్ టైం డ్రాయింగ్ టీచర్ గా పని చేస్తున్నాను .
విద్యార్హత : T.T.C, డ్రాయింగ్ హయ్యర్.
నివాసం : వి. ఆర్. సిద్ధార్ధ ఇంజినీరింగ్ కాలేజీ ఆపోజిట్ లో ఉంటున్నాను.
నేను ప్రొద్దుటూరు లో పుట్టాను. 3 వ తరగతి వరకు అక్కడే చదివాను. తరువాత కామయ్యతోపు వచ్చేసాము.
నాకు పెళ్లి అయ్యింది, భార్య పేరు మధులిక. నాకు ఇద్దరు అమ్మాయిలు - పెద్దమ్మాయి పేరు మేఘన, పాపకి ఇపుడు 6 ఏళ్ళు , చిన్న పాప భావన, తనకు 9 నెలలు.
మీ ఇంట్లో ఆర్టిస్ట్ లు ఎవరైనా ఉన్నారా ?
మా ఇంటిలో ఆర్టిస్ట్ లు ఎవరూ లేరు. ఇపుడు మా పెద్ద పాప మేఘన బొమ్మలు గీస్తూ ఉంటుంది. అది కుదిరినా కుదరక పోయినా అలా వేస్తూ ఉంటుంది. నేను మేఘన కి ఆర్ట్ నేర్పించ లేదు, ఇక నేర్పిస్తాను. తను ఇపుడు
ఫస్ట్ క్లాస్ చదువుతుంది.
ఫస్ట్ క్లాస్ చదువుతుంది.
చిన్నప్పటి నుంచే బొమ్మలు వేసేవారా ? చిత్రకళ పట్ల మక్కువ ఎలా కలిగింది ?
నేను 3 వ తరగతి చదవేటప్పటి నుంచే బొమ్మలు గీస్తూ ఉండేవాడిని. మట్టితో బొమ్మలు చేసేవాడిని, మనిషి కూర్చోపెట్టి బొమ్మలు గీసేవాడిని. ఆ ఆనందము వేరు...
64 కళలు గొప్పవే కానీ 64 కళల్లో చిత్ర కళ చాలా గొప్పది. నేను బొమ్మలు వేసినపుడు అంతమంది నిలబడి, నేను వేసిన బొమ్మను చూసి మెచ్చుకుంటున్నారు అంటే - ఇంకా అంతకన్నా ఏమి కావాలి చెప్పండి !
ఎవరూ గియ్యలేని బొమ్మలు నేను గీస్తున్నానంటే ‘నాలో కళ ఉంది’ అని తెలుసుకొని, నాకు నేను చిత్రకళలో పరుగులు పెట్టడం మొదలు పెట్టడం వల్లనే కదా ! అందుకే నాకు చిత్ర కళ అంటే చాలా ఇష్టం.
మీ గురువులు, అభిమానించే చిత్రకారులు ఎవరు ?
ఈ ప్రకృతి నాకు గురువు. ఈ ప్రకృతిలో ఎంత నేర్చుకున్నా నేర్చుకోవలిసింది ఇంకా ఎంతో మిగిలే ఉంది. నేను చిన్నపుడు నేర్చుకుందామని చాలా మంది ఆర్టిస్ట్ ల దగ్గరకు వెళ్ళాను. మొహం మీద తలుపు వేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు.
అందుకే నేను ఆర్ట్ అంటే పిచ్చ ఇష్టం ఉన్న వాళ్ళకి నేర్పిస్తాను, నాకు లాగా ఎవరూ ఇబ్బంది పడకూడదని.
మీ చిత్రకళా ప్రస్థానం ఎలా మొదలయ్యింది ?
నేను 3 వ తరగతి చదవేటప్పటి నుంచే బొమ్మలు గీస్తూ ఉండే వాడిని. మట్టితో బొమ్మలు చేసేవాడిని. బొమ్మల మీద ఇంట్రస్ట్ తో స్కూల్ కి కూడా సరిగ్గా వెళ్లే వాడిని కాదు. స్కూల్ మానేసి బస్ స్టాప్ లో కూర్చుని బొమ్మలు వేస్తూ గడిపేవాడిని.
చాలా దేవాలయాల్లో బొమ్మలు వేసాను, గుడికి వచ్చిన భక్తులు నేను వేసిన
బొమ్మకి దండం పెట్టేవాళ్ళు. అప్పుడు అనిపించేది నేను వేసిన బొమ్మలలో వీళ్ళు నిజంగా దేవుడి రూపాన్ని చూడగలుగుతున్నారని.
బొమ్మకి దండం పెట్టేవాళ్ళు. అప్పుడు అనిపించేది నేను వేసిన బొమ్మలలో వీళ్ళు నిజంగా దేవుడి రూపాన్ని చూడగలుగుతున్నారని.
ఒక విధంగా చెప్పాలంటే ఇది దేవుడు ఇచ్చిన వరం నాకు చిత్రకళ. ఇంటర్ చదవుతూ మధ్యలో ఆపేసాక, కొన్ని ఇయర్స్ తరవాత డ్రాయింగ్ లో లోయర్, హయ్యర్ చేసి టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసాను.
మొదట్లో నా తీరు చూసిన మా నాన్న, ఫుల్ గా కోటింగ్ ఇచ్చి ‘నువ్వు ఇక నుంచి బొమ్మలు వెయ్యటం మానెయ్యి’ అన్నాడని ఆ రోజు నుంచి నాన్నతో మాట్లాడటం మానేశా. చని పోయే వరకు మాట్లాడలా. నాకు బొమ్మలు వెయ్యటం అంటే అంత పిచ్చి.
ఆర్ట్ కోసం నా ప్రాణం ఇచ్చేయమన్న ఇచ్చేస్తా.
నేను ఈ రంగం లోకి వచ్చాకా చాలా ఒడిదొడుకులు ఎదురుకున్నాను. చిన్నపుడు నేను కొంత మంది ఆర్టిస్ట్ ల దగ్గరకు వెళితే మొహం మీదే తలుపు వేసేవాళ్ళు. “ నీకెందుకు ఈ వర్క్ ?”అన్నవాళ్ళు ఉన్నారు. అయినా పట్టించుకునే వాడిని కాదు, బస్ స్టాప్ లో కూర్చుని సినిమా పోస్టర్స్ ని చూసి గీసేవాడిని. ఎక్కడన్నా పెద్ద హోర్డింగ్ కనిపిస్తే అక్కడ కూర్చుని ఆ హోర్డింగ్ మీద ఉన్న బొమ్మని చూసి గీసే వాడిని. అది గీసే వరకు నిద్ర పోయే వాడిని కాదు, ఇంటికి వచ్చే వాడిని కాదు.
ఒక రోజు నాకు బాగా గుర్తు ఉంది...
ఒక పెద్ద హోర్డింగ్ మీద కనక దుర్గా మాత బొమ్మ ఉంది. అది వెయ్యటానికి స్కూల్ మానేసి ఆ హోర్డింగ్ ముందు కంప ఉంటే, ఆ కంపలో కూర్చుని, ఆ బొమ్మ అయ్యే వరకు అక్కడ నుండి కదిలే వాడిని కాదు, తిండి కూడా మానేసేవాడిని. అలా ఆ బొమ్మ వేసాను.
ఇపుడు ఆర్టిస్ట్ లలో కమర్షియల్ ఆర్టిస్ట్ లు, క్రియేటివ్ ఆర్టిస్ట్ లు అని
వాదించటం మరీ ఎక్కువయ్యింది, అది నాకు నచ్చటం లేదు. చిన్నప్పటి
వాదించటం మరీ ఎక్కువయ్యింది, అది నాకు నచ్చటం లేదు. చిన్నప్పటి
నుంచి రంగులలో బ్రతికిన వాళ్ళని ఇపుడు కొంత మంది ఆర్టిస్ట్ లు ‘మీరు కమర్షియల్ ఆర్టిస్ట్ లా , క్రియేటివ్ ఆర్టిస్ట్ లా?’ అంటుంటే చాలా బాధగా ఉంటుంది.
బొమ్మలు గీసే ప్రతి ఒక్కరు ఆర్టిస్ట్ కదా ! మరి ఇన్ని విబేధాలు ఎందుకో మరి...
మనం గీసే ప్రతి బొమ్మ ఆలోచింప చేసే విధంగా ఉండాలి గాని, నువ్వు కమర్షియల్ ఆర్టిస్ట్ , క్రియేటివ్ ఆర్టిస్ట్ అనే తీరు మారాలని అనుకుంటున్నాను. అమ్మ, నాన్న “మా అబ్బాయి ఏ డాక్టరో, కలక్టరో, లాయరో, ఏ గవర్నమెంట్ ఉద్యోగో అవుతాడని” ఆశపడి అందరిలాగే చిన్నప్పటి నుంచి స్కూల్ కి పంపితే, స్కూల్ లో మాష్టారు చెప్పే పాఠాలు వినకుండా బొమ్మలు గీసేవాడిని. మాష్టారు తన్నాడని స్కూల్స్ ఎగొట్టి బస్సు స్టాప్ లో కూర్చుని బొమ్మలు గీసుకొని, ఇంటికి వచ్చి మాష్టారు రాలేదని ఆబద్దము చెప్పేవాడిని.
మళ్ళి అమ్మ నాన్నతో తిట్టులు తిని, చివరికి అమ్మ నాన్నను కూడా లెక్క చెయ్యకుండా ‘నాకు ఆర్టే ముఖ్యమని’, ఇంటిలో వాళ్ళతో మాట్లడటం మానేసి, ఎవరెవరు ఎక్కడ బొమ్మలు వేస్తున్నారు అని ఊరంతా తిరిగి అర్ధరాత్రి ఇంటికి వచ్చి అమ్మ నాన్నతో తిట్టులు తిని అన్నం తినకుండా పడుకొనేవాడిని. మళ్ళి తెల్లారే లేచి స్కూల్ కి అని చెప్పి ఊరంతా తిరిగొచ్చేవాడిని. ‘మాకు ఈ రంగులే సర్వసం, మా జీవితం ఇదే!’ అనుకొని, చిన్నప్పటి నుంచే గోడల మీద పేర్లు రాస్తూ , బొమ్మలు వేస్తూ ‘మేము ఆర్టిస్ట్ లు’ అని గర్వంగా ఫీల్ అయ్యి ఈ ప్రపంచంలోకి వస్తే, అందరు మమ్మల్ని
కమర్షియల్ ఆర్టిస్ట్ లు, కమర్షియల్ ఆర్టిస్ట్ లు అని అంటున్నా లెక్కచేయ్యక్యండా మేము బొమ్మలు వేస్తూ, “మా శ్వాస , ఊపిరి , ప్రాణం ఈ కళే!” అని బలంగా నమ్ముతూ ఇందులో బ్రతికేస్తున్నాము. ఎప్పటికి ఇందులోనే బ్రతుకుతున్నాము. ఇందులో మళ్ళీ విభేదాలు తీసుకురావడం మాకు తీవ్ర మనస్తాపం కలిగిస్తుంది.
మీరు వేసిన వాటిలో బాగా పాపులర్ అయిన బొమ్మ గురించి చెప్పండి.
చాలా ఉన్నాయి అండి, నేను వేసిన ప్రతి బొమ్మకి ఒక్కో ప్రత్యేకత ఉంది, కాబట్టి నేను గీసిన ప్రతి బొమ్మ గొప్పదే.
మీరు పొందిన అవార్డులు, మర్చిపోలేని ప్రశంసల గురించి చెప్పండి.
ఇప్పటి వరకు చాలా గ్రూప్ షోస్, ఆర్ట్ ఎగ్జిబిషన్స్, క్యాంప్స్ లో పాల్గొన్నాను, అలాగే 36 వరల్డ్ రికార్డ్స్ సాధించాను.
అయినా గాని, నేను ఎప్పటికి నిరంతరం నేర్చుకునే విద్యార్ధిని. ఈ రోజుకి నేను నా చిత్రకళలో " అ " అనే అక్షరాన్నే దిద్దుతున్నాను .
2015 - Road Show - Puducherry
2015 - Chitra Santha – Vijayawada
2004 - Aalla Basavireddy Community Hall – Prodduturu, Krishna District
Group Shows
2015 - KALAM CHITRANJALI, Akrithu Art Gallery, Vijayawada
2015 - Vijayawada Art Society, Akrithu Art Gallery, Vijayawada
2014 - Fine arts Artist Tagore State Grandhalayam – Vijayawada
2016 - Group Show Sankranhi Tharangalu, Machilipatnam
2015 - Naional Group Show TWAAS NGO's HALL, Eluru
2015 - Naional Group Show TWAAS, Hawa Mahal, Vishakapatnam
Awards / Honours
2015 - Jury Award from Ameer Arts Academy – Nellore
2015 - Jury Award from Konaseema Chitrakala Parishad – Amalapuram
1994- 1st Prize from Y's Men's Club Of Vijayawada Town - Vijayawada
1987 - 3rd Prize from Arthika samatha mandali _ Vijayawada
Camps
2015 - Godavari Maha Pushkaram, by AP Government - Rajahmundry
2014 - AP Tourisim & TWAAS Association - Hyderabad
2016 - Mathru bhasha Dhinothsavam, by Saamuskruthi shakha, Ap. Government, Gantasala Cllege, Vijayawada
2015- Wall Painting Camp -Yaanam
2015- Wall Painting Camp -Yaanam
________________________________________________________________________
World Records
గౌతం బుద్ధ పెయింటింగ్
నేను జూలై 3 2014 లో బుద్ధుడు పెయింటింగ్ ని పురికోసతో 11 అడుగులు వెలడుపు 9 అడుగులు నిలువు సైజు లో 3 గంటలలో వేసినందుకు నాకు ఇప్పటి వరకు 36 వరల్డ్ రికార్డ్స్ వచ్చాయి.
- Limca Book Of Records... 2016
- Record Setter United States.. 10 times, 2016
- India Book Of Records... 3 times, 2014, 2015
- Everest World Records... 2 times , 2014, 2015
- Unique World Records... 2 times , 2014
- Miracles World Records ... 2014
- Asist World Records... 2014
- Asia Book Of Records... 2014
- World Records India... 2014
- World Amazing Records... 2014
- Telugu Book Of Records... 2014
- High Range Book Of Records.. 2 times, 2014
- War Of World Records.. , 2014
- Universal Records.. 2 times, 2015
- Wonder Book Of Records.. 2 times, 2014, 2015
- State Book Of Records.. 2 times, 2014
- Creative Records Nepal.. 2015
మైక్రో కార్వింగ్స్
నేను1997 లో పెన్సిల్ ములుకులు, సబ్బులు, చాక్ పీస్లు, సాంబ్రాణి , మైనం , కాకర గింజలు, 5, 10 పైసల నాణాలు, ప్యూమిక్ స్టోన్, బియ్యం , ధర్మాకోల్ వివిధ రకాల మెటిరియల్స్ పై 30 మైక్రో బొమ్మలు చెక్కినందుకు నాకు 7 వరల్డ్ రికార్డ్స్ వచ్చాయి
- India Book Of Records
- Everest World Records
- Unique World Records
- Hihg Range Book Of Records
- Universal Records
- Wonder Book Of Records
- State Book Of Records
మైక్రో కార్వింగ్స్ .....
యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమెరికా వారి రికార్డ్ సెట్టర్ లో ఇప్పటి వరకు 10 రికార్డ్స్ క్రియేట్ చేసాను
10 times record setter
మహర్షి షార్ట్ ఫిల్మ్
నేను 8 నిముషాలు నిడివి గల మహర్షి అనే ఫిల్మ్ ని ‘శివ ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్’ లో 8 గంటలలో తీసాను. ఈ ఫిల్మ్ కి నేనొక్కడినే 20 శాఖలకు పని చేశాను. అవి ......
- అడ్మినిస్ట్రేటివ్ విభాగం, 2. PRO, 3. లోగో మరియు పోస్టర్ డిజైనర్, 4. DI డిజిటల్ ఇంటర్మీడియట్, 5. సెట్స్ మరియు స్థానాలు, 6. మేకప్, 7. లైట్స్ మనిషి, 8. కాస్ట్యూమ్స్ డిజైనర్, 9. అవుట్డోర్ యూనిట్, 10. ఎడిటింగ్, 11. డబ్బింగ్, 12. సౌండ్ & మిక్సింగ్, 13. స్టిల్స్, 14. ఆర్ట్ డైరెక్టర్, 15. సినిమాటోగ్రాఫర్, 16. స్టోరీ, 17. స్క్రీన్ప్లే, 18. మాటల రచయిత, 19. నిర్మాత, 20. డైరెక్టర్
ఈ ఫిల్మ్ ని ఒక్క నటుడుతో మాత్రమే చేశాను. ఈ ఫిల్మ్ లో గొర్రెల యొక్క అశుద్ధాన్ని ( మల విసర్జనని ) మేకప్ గా వాడాము. దీని వలన మాకు ఎలర్జీ కూడా వచ్చింది. ఇందులో నటుడు డ్రగ్స్ ఇంజక్షన్లకు అలవాటు పడతాడు. మేము ఆ డ్రగ్స్ ఇంజక్షన్లని చూపించటం కోసం రియల్ మెడిసిన్ పెయిన్ కిల్లర్ ఇంజక్షన్లని వాడాము, ఎక్కువ స్మోకింగ్ చెయ్యటం వలన నోటి నుంచి రక్తం వస్తుంది. దానికి మేము చికెన్ షాప్ వాళ్ళ దగ్గరకి వెళ్లి, వాళ్ళు కోసినపుడు పారేసే ఆ కోళ్ళ రక్తాన్ని మీము తీసుకొని వాడాము. నాకు 2 వరల్డ్ రికార్డ్స్ వచ్చాయి.
- India Book Of Records
- Wonder Book Of Records
ఇప్పటికి మొత్తం 36 వరల్డ్ రికార్డ్స్ నాకు వచ్చాయి.
మీ అభిరుచులకు మీ కుటుంబసభ్యుల ప్రోత్సాహం ఎలా ఉంటుంది ?
అసలు ఫస్ట్ నుంచి కూడా మా ఇంట్లో వాళ్లకి ఆర్ట్ మీద అంత అవగాహన లేదు. కాబట్టి ఈ విషయంలో నాతో నేనే యుద్ధం గెలుపు కోసం చేస్తాను.
భావి చిత్రకారులకు మీరిచ్చే సందేశం ఏమిటి ?
అన్నిటిని మించి ఫస్ట్ మనం ఆర్ట్ ని ప్రేమించాలి, మన నర నరాల్లో జీర్ణించుకోవాలి. మన ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకోవాలి. మన ఆలోచనలో ఉన్న బొమ్మలు గీస్తూ ఉండాలి. మనం ప్రతి క్షణం ప్రాక్టీస్ చెయ్యాలి, నిత్యం ఏదో ఒక బొమ్మ గీస్తూ ఉండాలి. అంతే కాదు...
ప్రకృతిలో నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది, ఎంత నేర్చుకున్నా ఇంకా మిగిలే ఉంటుంది. సమస్యల మీద పెయింటింగ్స్ చేసే టప్పుడు వాటి మీద స్టడీ చెయ్యాలి, చేసాకా అపుడు పెయింటింగ్స్ వెయ్యాలి. ఆ పెయింటింగ్స్ ఆలోచింప చేసే విధముగా ఉండాలి. నేను ఇప్పటికి ఎప్పటికి, నిరంతరం నేర్చుకుంటున్న విద్యార్థిని.
అందరూ తమ పిల్లలు ఇంజినీరులు డాక్టర్ లు ఇలా ఎన్నో చదవాలనుకుంటారు గాని, ఆర్టిస్ట్ అవాలని కోరుకోరు. బాగా సంపాదించాలని కోరుకుంటారు. తప్పులేదు కాని, మీ పిల్లలో ఆర్ట్ పట్ల మక్కువ ఉంటే కనుక దయ చేసి ఆర్ట్ ని నేర్పించండి, సపోర్ట్ చెయ్యండి.
నేను చాలా గర్వంగా తలెత్తుకొని చెపుతున్నా “నేను ఆర్టిస్ట్ ని” అని. మరి ఆర్టిస్ట్ దగ్గర డబ్బులు ఉండవు సంపాదించడు అంటారా ? అసలు ఒక లక్ష కోట్ల ఆస్తి ఉన్న వాడు ధన వంతుడు కాదు, టైం బాగోక పోతే, ఆ లక్ష కోట్లు పోతే, తన దగ్గర ఏమీ లేని వాడయిపోతాడు. అప్పుడు అతని పరిస్థితి ఏంటి ?
కానీ ఆర్టిస్ట్ ఎప్పుడూ ధనవంతుడే . ఎందుకంటే తన దగ్గర ఎప్పటికి తరగని కళ ఉంది, అదే పెద్ద ఆస్తి. అందరికి రిటైర్మెంట్ ఉంటుంది మనిషి, జీవితానికి కూడా రిటైర్మెంట్ ఉంటుంది. కానీ ఆర్టిస్ట్ కి రిటైర్మెంట్ ఉండదు ఎందుకంటే ఆర్టిస్ట్ లేక పోయినా తాను వేసిన బొమ్మల్లో ఎప్పటికి బ్రతికే ఉంటాడు.
మనం చూస్తున్న దేవుళ్ళ బొమ్మలు వేసింది ఆర్టిస్ట్...
పిల్లలు చదవుకునే పుస్తకాల్లో బొమ్మలు గీసింది ఆర్టిస్ట్ ...
ప్రపంచ పటాన్ని గీసింది ఆర్టిస్ట్ ...
చరిత్రకి ఆధారంగా బొమ్మలు గీసింది ఆర్టిస్ట్ ...
ఎన్నో రంగులకు భావాలను చెప్పింది ఆర్టిస్ట్ ...
ఊహకు రూపం పోసేది ఆర్టిస్ట్...
మీరు చూస్తున్న సినిమాల్లో ఊహాలోకానికి బొమ్మలతో ఆజ్యం పోసింది ఆర్టిస్ట్...
ప్రతి దానిలో ఆర్ట్ ఉంది, మా ఆర్ట్ లేనిదే ఏదీ అంగుళం అయినా కదలదు, అని గర్వం గా చెపుతున్నాను.
నేను ఎవరిని తక్కువ చేసి మాట్లాడటం లేదు, అలాగే ఎవరిని ఉద్దేశించి మాట్లాడటం లేదు. ఈ ప్రపంచాన్ని మన అనుకున్న వాడిగా మాట్లాడుతున్నా.
ఒక్క సారి ఊహించుకోండి మన పిల్లలకి ఏమి నేర్పుతున్నామో, యంత్రాల లాగా తయారు చేస్తున్నాం...
ఈ పోటీ ప్రపంచంలో పిల్లకి ఏది ఇష్టమో, వాళ్ళు ఏది అవుదామనుకుటున్నారో అది తెలుసుకొని నేర్పించాలి. మీ పిల్లల్లో గొప్ప ఆర్టిస్ట్ లు ఉండొచ్చు కదా ఒకసారి చూడండి, మీ పిల్లల మనసులోకి చూడండి. కళలు అంతరించి పోతున్నాయి వాటిని బ్రత్కించుకుందాం. సరిగా చూస్తే అసలు ఈ ప్రకృతి ఒక ఆర్ట్.
మరల చెపుతున్నా ...
నేను ఇప్పటికి ఎప్పటికి నిరంతరం నేర్చుకుంటున్న విద్యార్థిని ..........
" నా ఆర్టే ..... నా బంగారం
నా బంగారమే..... నా ఆర్ట్ @ శివ పామర్తి "
PAINTINGS It's the BACKBONE of MY LIFE........... JAIHIND !!!
ఆర్టిస్ట్ శివ గారు మరిన్ని విజయాల్ని సాధించాలని, మనసారా ఆకాంక్షిస్తోంది - అచ్చంగా తెలుగు.
No comments:
Post a Comment