కృష్ణా జిల్లాలోని ముఖ్య స్నాన ఘట్టాలు, వాటి చరిత్ర - అచ్చంగా తెలుగు

కృష్ణా జిల్లాలోని ముఖ్య స్నాన ఘట్టాలు, వాటి చరిత్ర

Share This

కృష్ణా జిల్లాలోని ముఖ్య స్నాన ఘట్టాలు, వాటి  చరిత్ర 

మంత్రాల పూర్ణచంద్రరావు 


శ్రీకాకుళం :కృష్ణా జిల్లాలో కృష్ణా నది వొడ్డున ఉన్న అతి పురాతన గ్రామము. ప్రాచీన కాలంలో మహా విష్ణు అనే రాజు త్రిలింగ దేశాన్ని (ద్రాక్షారామము, కాలేశ్వరము, ,శ్రీ శైలము ల మధ్య ఉన్నప్రదేశము ) పరిపాలించారు, తరువాత ప్రజలు ఆయన విష్ణుమూర్తి అంశ అని విస్వచించారు , అప్పుడు ప్రజలు ఆయన పేరుమీద దేవాలయము కట్టించి, శ్రీకాకుళ ఆంద్రమహా విష్ణువుగా కొలిచారు. కానీ ఇంకా అంతకు పూర్వమే బ్రహ్మదేవుడు స్వయముగా విష్ణు మూర్తి విగ్రహాన్ని ప్రతిస్థిన్చి పూజలు జరిపినట్టు కూడా కధనాలు ఉన్నాయి. తరువాత క్రి. పూ. 2 లేక 3 శతాబ్దములో శాతవాహనులు ఆ విగ్రహాన్ని అతి పురాతనము అయినదిగా గుర్తించి, ఇదే తమ పూర్వీక రాజు మహావిష్ణు కట్టించినదిగా తలచి గుడిని కట్టించినారు. ఈ ఆలయములో ప్రత్యేకతలు చాలా ఉన్నాయి. విగ్రహ మూర్తికి కుడిచేతి యందు శంఖము, ఎడమ చేతి యందు చక్రము ఉంటుంది, అలాగే ఇక్కడ ఉన్న దశావతారములలో శ్రీ కృష్ణుడు ఉండడు. మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, రామ,బలరామ, బుద్ధ, కల్కి మాత్రమె ఉంటాయి. ఇది భారత దేశములోనే ఒక ప్రత్యెక దేవాలయము, తిరుపతిలో తప్ప వేరెక్కడా లేని విధంగా విగ్రహానికి నిజమయిన సాలిగ్రామాలతో అలంకరించబడి ఉంటుంది . ఇప్పుడు ఉన్న దేవాలయము క్రి. శ. 1010 కట్టినది. ఒకసారి శ్రీకృష్ణదేవరాయలు కలింగ రాజ్యము వెళుతూ విజయవాడలో బస చేసినప్పుడు ఈ దేవాలయము గూర్చి తెలిసికొని చూచుటకు వచ్చినారు .ఇక్కడ బసచేసి ఏకాదశి వ్రతము చేసి ఆ రాత్రి నిదురించినప్పుడు తెల్లవారుజామున విష్ణు మూర్తి కలలో కనపడి తనకి, ఆండాళ్ కి జరిగిన వివాహ వృత్తాంతము తెలుగులో వ్రాయమని చెప్పి అద్రుశ్యమయినారు . తెల్లవారి రాయలు వారు పండితులను కూర్చో పెట్టి స్వప్న వృత్తాంతము చెప్పగా, వారు కల వచ్చిన సమయాన్ని పట్టి నిజమని తేల్చారు. అప్పుడు రాయలు వారు అక్కడే తను కూర్చున్న మంటపములోనే కూర్చుని " ఆముక్తమాల్యద " తెలుగులో రచించినారు. ఈ మధ్య వరకు ఆ మంటపము శిధిలావస్థలో ఉన్నది. 1992 పుష్కరాల సమయములో ఆ ప్రాంత మంతా బాగుచేయించి మంటపము యధాపూర్వముగానే కట్టి అందులో రాయలు వారి విగ్రహాన్ని కూడా పెట్టినారు. అందుకు సంబంధించిన ఛాయా చిత్రములు ఇక్కడ పొందు పర్చుచున్నాను. ఇక్కడ పుష్కర ఘాట్ ఏర్పాటు చేస్తారు . నీటి లభ్యతని పట్టి ఈ రేవుని ఎంచుకోవచ్చు . ఇక్కడకి దగ్గర 25 కి. మీ. దూరంలో ఘంటసాల గ్రామమునందు ప్రముఖ బౌద్ధారామము ఉన్నది . అక్కడ దొరికిన బుద్ధుని కాలం నాటి వస్తువులతో మ్యూజియం ఏర్పాటు చేసారు
.పెదకళ్ళేపల్లి:
కృష్ణా జిల్లాలో ఇది ఒక పవిత్ర క్షేత్రము, ఇక్కడ శివుడు స్వయంభువుగా ఉన్నాడు, కృష్ణా నది ఉత్తరావాహినిగా ప్రవహిస్తుంది, అందువలన దీనిని దక్షణ కాశి అని కూడా అంటారు, ఇక్కడ దుర్గా నాగేశ్వర దేవాలయము అంటారు, అమ్మ వారు కూడా నవ దుర్గలలో ఒకరు అని స్థల పురాణము 1704 లో ఈ దేవాలయము దేవరకోట రాజావారుపునర్మించారు, వారి వారసులే చల్లపల్లి రాజా వారు. ఇప్పుడు ఉన్న దేవాలయము 1982 లో పునర్నిర్మించి పంచముఖ విఘ్నేశ్వరుడు, మరియు రాజగోపురము పుష్పగిరి స్వాముల వారి ఆద్వర్యంలో పునర్నిర్మించారు ఇక్కడ ఒక పెద్ద చెరువు ఉన్నది ఈ చెరువు నాగ జాతికి చెందిన కర్కోటకుడు త్రవ్వించారు అని శిలా శాసనములు తెలుపుతున్నాయి. ఇక్కడి ఉత్తర వాహినిలో స్నానం చేసిన యెడల మరుజన్మ ఉండదని అంటారు.ఇక్కడ కృష్ణా నది పాయ సముద్రములో కలుస్తుంది. నీరు కూడా ఒక చోట తియ్యగా ఒక చోట ఉప్పగా ఉంటాయి.

No comments:

Post a Comment

Pages