కృష్ణవేణి(కవిత)
సుజాత తిమ్మన
భారతావనిలో మూడవ స్థానంలో...
ధక్షిణభారతదేశంలో రెండవ అతి పెద్ద నదిగా
పేరుపొందిన కృష్ణమ్మా...
పడమటి కనుమలలో మహారాష్ట్ర లోని
మహాబలేశ్వర్ కి ఉత్తరంగా ..మహాదేవ పర్వతాల నడుమ
చిన్న దారగా జన్మించినావమ్మా..
నీలోన మరెన్నో ఉపనదులను కలుపుకుంటూ..
కర్ణాటక...తెలంగాణ..ఆంద్రదేశాలను
ప్రాంతీయ భేదం లేక కలుపుకుంటూ..
పరవళ్ళనురగలతో...సింగారాలు పోతూ..
దివి సీమచేరి..హంసల దీవిలో
నీ సఖుని సంధిట సంగమించితివా తల్లీ...కృష్ణవేణి
నీ కులుకుల నడకలకు
పరవశించి పచ్చదనాల హారాన్ని
ధరించింది... పుడమి తల్లి..
ద్వాదశజ్యోతిర్లింగాలలో సుప్రసిద్ధ శైవక్షేత్రమైన
శ్రీశైలంలో కొలువై ఉన్న బ్రమరాంబ మల్లికార్జునునికి
అభిషేకాల సేవలలో తరించి...
ఆలంపూర్ అమ్మవారి కృపను అందుకుంటూ..
బెజవాడ కనకదుర్గమ్మ ముక్కుపుడక మెరుపువై..మెరుస్తూ..
అమరావతి అమరలింగేశ్వర స్వామీ
అర్చనలల అజరామరమైనావే తల్ల్లీ...కృష్ణవేణి.
ఆల్ మట్టి ..నారాయణ్ పూర్ ప్రాజెక్టులే కాక
నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ పేరుతొ అతిపెద్ద ఆనకట్ట వేసి..
నీ ఉరుకులకుసంకెలలు వేసినా....కోపించక..
రైతుల పాలిట ...అన్నపూర్ణవి అయినావే తల్లీ ...కృష్ణవేణి
పన్నెండేళ్ళకొకసారి వచ్చే పురస్కారం...
మాలోని భయాలను ..వేదనలరోదనలను
నీలో కలుపుతూ...పితృదేవతల ఆశిస్సు లందుకుంటూ..
నీలో మునకలేసి తరించేమే తల్లి...కృష్ణవేణి...
క్లిష్ట సమయాన్ని అవలీలగా దాటే అభయమీయవే..తల్లీ..కృష్ణవేణి...!!
****
No comments:
Post a Comment