ముల్లంగి-క్యారట్ పెరుగు పచ్చడి
అక్కిరాజు ప్రసాద్
కావలసిన పదార్థాలు:
================
రెండు ముల్లంగి గడ్డలు
రెండు క్యారట్లు
కాస్త తురిమిన అల్లం
సన్నగా కోసుకున్న పచ్చిమిరపకాయలు, కొత్తిమీర
దానిమ్మ గింజలు (ఎండ బెట్టినవి కాదు, తాజాగా పండునుండి ఒలిచినవి)
కరివేపాకు ఆకులు కాసిని
పోపుకు నూనె, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ

తయారు చేసే పద్ధతి:
================
ముందుగా ముల్లంగి, క్యారట్ చెక్కు తీసి తురుముకోవాలి. బాణలిలో ఒక స్పూన్ నూనె వేసి ఆ తురుమును ఉప్పు పసుపుతో కలిపి ఒక 5 నిమిషాల పాటు వేయించాలి. దీని వలన పచ్చి ముల్లంగిలోని ఘాటు పోతుంది. రెండు తురుములు కూడా ఉడుకుతాయి. ఇది పక్కకు పెట్టుకోవాలి. బాణలిలో కొంచెం నూనె వేసి, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసి పోపు చేసుకోవాలి. దానిలో కరివేపాకు, తరిగిన పచ్చి మిరపకాయలు, అల్లం తురుము వేసి ఒక నిమిషం వేయించాలి. ఆ పోపులో ముందుగా వేయించుకున్న ముల్లంగి-క్యారట్ తురుమును వేసి ఒక రెండు నిమిషాలు స్టవ్ పైనే ఉంచాలి. ఈ మిశ్రమం చల్లారిన తరువాత పెరుగులో కలపాలి. అన్నీ కలిపిన తరువాత ఉప్పు చూసుకుని అవసరమైతే కాస్త వేసుకోవాలి. చివరగా తరిగిన కొత్తి మీర, దానిమ్మ గింజలతో ఈ పెరుగు పచ్చడిని అలంకరించుకోవచ్చు. ముల్లంగి జీర్ణవ్యవస్థకు, రక్తశుద్ధికి ఎంతో ఉపయోగకరమైన కూరగాయ. వారానికి ఒక్కసారైనా తింటే మంచిది అని డాక్టర్లు చెబుతారు. ఈ పెరుగు పచ్చడి అన్నంలోకే కాదు, పుల్కాలు/చపాతీలతో కూడా రుచిగా ఉంటుంది.

No comments:
Post a Comment