పుష్కరాల హాస్య ము(తు)నకలు!
-ప్రతాప వెంకట సుబ్బారాయుడు
"లేదు నాయనా..పోయిన పుష్కరాలకు మా ఆయన అక్కడే తప్పిపోయాడు..దొరుకుతాడని ఆశ"
*****
"ఆ రాజుగాడు పుష్కరాలకు అప్పు తీరుస్తానన్నాడని అప్పిచ్చా..ఎప్పటికీ తిరిగివ్వట్లేదు"
"అదేంటి?"
"ఎప్పుడడిగినా..ఏదో నది పుష్కరాల పేరు చెప్పి అప్పుడిస్తానంటాడు."
*****
"మీకు రికార్డులు సృష్టించడం ఎంత ఇష్టమైతే మాత్రం ఈ పుష్కరాల నుంచీ వచ్చే పుష్కరాల వరకు నీళ్లలో మునిగి ఉంటాననడం నా మాంగళ్యానికి ఏదో ఎసరు తెచ్చేట్టుందండీ"
"?"
*****
"మీ అబ్బాయి పేరు కృష్ణాపుష్కర్-2016 అని పెట్టావా? అదేంటి"
"పుష్కర సమయంలో పుట్టాడనీ.."
*****
"పుష్కర సమయంలో దేవుళ్లందరూ నదిలో కొలువుంటారని..వాళ్ల సాక్షిగా నా మెళ్లో సింపుల్ గా మూడు ముళ్లేసి పెళ్లి చేసుకున్నాననడం..నాకేం నచ్చలేదు, రాజూ"
***
No comments:
Post a Comment