రుచికరమైన - కందవడలు - అచ్చంగా తెలుగు

రుచికరమైన - కందవడలు

Share This

రుచికరమైన - కందవడలు

శ్రీప్రియ 



ఈ తరం పిల్లలు ఇదివరకటిలా అన్నీ తినట్లేదు. వాళ్ళ మారానికి తలొగ్గి పిజ్జాలు, బర్గర్లు పెట్టే బదులు, మనమే కాసిన్ని రుచికరమైన వెరైటీలు సృష్టిస్తే బాగుంటుంది కదా ! మరి ఇంకెందుకు ఆలస్యం... ప్రయత్నించండి.
కావలసిన పదార్ధాలు :
----------------------------
పావుకిలో కంద
100గ్రా. పెసరపప్పు
ఉల్లిపాయలు - 4
జీలకర్ర - ఒక చెంచా.
కరివేపాకు - 4 రెబ్బలు
చారెడు బియ్యప్పిండి.
ఉప్పు, కారం - తగినంత.
నూనె
తయారీ విధానం
---------------------
ముందుగా పెసరపప్పును అరగంట ముందు నానబెట్టుకోవాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు , జీలకర్ర వేసి, మిక్సీలో రుబ్బుకోవాలి.
కంద చెక్కు తీసి, కడిగి, తురుముకోవాలి. ఇందులో బియ్యప్పిండి, తగినంత ఉప్పు, కారం, పైన రుబ్బిన ముద్ద, కలుపుకుని, నూనెలో వడల లాగా ఎర్రగా వేపుకోవాలి. ఇవి అన్నంలో తిన్నా, విడిగా తిన్నా రుచికరంగా ఉంటాయి. అందుకే పిల్లలు ఓసారి రుచి చూస్తే ఇక వదలరు. ప్రయత్నించండి.

No comments:

Post a Comment

Pages