మమతల రెమ్మ..! - అచ్చంగా తెలుగు

మమతల రెమ్మ..!

Share This

మమతల రెమ్మ..!

 సుజాత తిమ్మన


అమ్మని మించి దైవామున్నదా .....!
అని పాడుకోవడం తప్ప
అమ్మకి  మనం ఏమి ఇస్తున్నాం
అన్న ఆలోచన కలిగిందా... ఒక్క సారైనా...!
కన్న కడుపుకు వేల కట్టిఇమ్మని.....
రక్తాన్ని చనుబాలు గా
మార్చి నీ కడుపు నింపినందుకు....
తన ఒడిని ఉయాల చేసి నిను
లాలించి నందుకు
చందమామనే నీ లోగిలిలోకి చేర్చి..
ఆట లాడిస్తూ ...నీ
నవ్వుల్లో వెన్నెలలు
తాను పంచు కున్నందుకు
బొజ్జ నిండినా...
ఇంకా.. ఇంకా...
ఇంకో  గోరు ముద్ద
అంటూ నీ పెదవంచున
ప్రేమని పూసినందుకు
తడ బడే నీ అడుగులు
చూసి తాను మురిసి
తాను ఊతమై నిను
నిలబెట్టి నందుకు
అక్షారానికి అక్షరం తానై
నీ చేత దిద్డిస్తూ..
నీ ఆశల సౌధానికి
తాను పునాది రాళ్లుగా..
 మారి నందుకు
విదేశాల మోజుతో నీవు..
ఆకాశంలోకి కెగురుతూ...
అమ్మ కంట నిలిచిన
చెమ్మని గమనించని నీవు
నిర్లక్ష్యపు ధోరణికి అలవాటయినందుకు ..
అమ్మా !అన్న ఒక్క నిముషం
పలకరింపు కై తన జవ సత్వాలని
కూడదీసుకొని ఎదురు చూస్తునందుకు
చివరి శ్వాస లొ
మూతలు పడుతున్న
కను రెప్పల అంచున
నీ మసక రూపం కోసం
పరితపిస్తూ ...కలవరింతలలో ...
"కన్నా! ఆ దూర దేశాలలో
ఎం తింటున్నావో..ఎలా ఉన్నవో.."
అంటూ తల్లడిల్లు తున్నందుకు
అమ్మ ఎప్పుడూ.... అడగదు....
అందుకే..అమ్మ అమృత మయి..
అందుకే  అమ్మ అత్మియతల అక్షయపాత్ర...
అందుకే..అమ్మ దైవత్వాన్ని ఆపాదించుకున్న..మమతల రెమ్మ..!
***  ***  ***   ***

No comments:

Post a Comment

Pages