పండుటాకులని...
భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు.
పండుటాకులని పక్కన పెడతారా?
ఎందుకూ పనికిరారని ఎగతాళి చేస్తారా?
కపటంలేని మనసులు వారివని తెలియదా?
వారివి మలినంలేని మమతలని మరిచారా?
మనని కన్నవెంటనే పెంటకుప్పపై పడవేసుంటే,
మనస్థితి ఏమయ్యేదో తలచేరా?
కన్నపేగుపై మమకారాన్ని తక్షణం వదిలేసుంటే,
మనగతి ఎలాఉండేదో మరిచేరా?
చేవచంపుకొని చెత్తలేరుకొని
బ్రతికే వారము కామా?
కడుపునిండుగా తిండి దొరకక
నిలిచేవారము కామా?
ఎందుకూ పనికిరారని ఎగతాళి చేస్తారా?
కపటంలేని మనసులు వారివని తెలియదా?
వారివి మలినంలేని మమతలని మరిచారా?
మనని కన్నవెంటనే పెంటకుప్పపై పడవేసుంటే,
మనస్థితి ఏమయ్యేదో తలచేరా?
కన్నపేగుపై మమకారాన్ని తక్షణం వదిలేసుంటే,
మనగతి ఎలాఉండేదో మరిచేరా?
చేవచంపుకొని చెత్తలేరుకొని
బ్రతికే వారము కామా?
కడుపునిండుగా తిండి దొరకక
నిలిచేవారము కామా?
కరిగిన కండల కలతలతో
చెదిరిన కన్నుల కాంతులతో
చిరుగులు కలిగిన బట్టలతో
బెదిరిన గుండెల బరువులతో
భావితలుచుకొని బాధనణుచుకొని
భవిష్యత్తంతా అంధకారమై
వర్తమానము వికారమై
క్షణమొక యుగమై బ్రతుకొక వ్రణమై
తెల్లపోవుచు,తల్లడిల్లుతూ
విలువలు తెలియని ఆ స్థితిలో
వలువలు లేని ఆ గతిలో
గమ్యమగమ్యం అయ్యేను కాదా?
మన బ్రతుకు నడిరోడ్డే కాదా?
చెదిరిన కన్నుల కాంతులతో
చిరుగులు కలిగిన బట్టలతో
బెదిరిన గుండెల బరువులతో
భావితలుచుకొని బాధనణుచుకొని
భవిష్యత్తంతా అంధకారమై
వర్తమానము వికారమై
క్షణమొక యుగమై బ్రతుకొక వ్రణమై
తెల్లపోవుచు,తల్లడిల్లుతూ
విలువలు తెలియని ఆ స్థితిలో
వలువలు లేని ఆ గతిలో
గమ్యమగమ్యం అయ్యేను కాదా?
మన బ్రతుకు నడిరోడ్డే కాదా?
అలా చేయక,మనని వదిలివేయక
లాలించి,పోషించి,దీవించి
చేయిపట్టుకొని నడకను నేర్పించి
ఇంతవారిగా చేసిన వారిపై
ప్రేమను మరిచి,ద్వేషం పూనటం మంచిదేనా?
భార్యకు వెరచి,దూరం చేయటం మానవతేనా?
***
లాలించి,పోషించి,దీవించి
చేయిపట్టుకొని నడకను నేర్పించి
ఇంతవారిగా చేసిన వారిపై
ప్రేమను మరిచి,ద్వేషం పూనటం మంచిదేనా?
భార్యకు వెరచి,దూరం చేయటం మానవతేనా?
***
No comments:
Post a Comment