పెళ్ళికూతురు
తక్కెడశిల జానీ బాషా (అఖిలాష)
పెళ్ళి పీటలపై పెళ్ళికూతురివై
నవ్వులో నవరత్నలను రంగరించుకొని
చెక్కిలకు సిగ్గుల ఆభరణాలు తొడిగి
ముసి ముసి నవ్వులు చిందిస్తూ
మరు మల్లెల జీవితానికై మదిలో
మోహన మేడలు నిర్మించి
మాంగల్యనికై మస్తకము దించి
సౌభాగ్య సిరుల మాల ధరించుటకై
బుడి బుడి నడకలు వేస్తూ
నీ పాదాలతో పుడమిని పులకరింపజేస్తు
భూగోలన్ని నారికేలంగా చేసుకొని
కరముల నరములతో బిగపట్టి
ఇంద్రధనస్సు ను పసుపుతాడుగా చేసి
సూర్య చంద్రులను తాళి బొట్టులుగా చేసి
నారికేళన్ని అలంకరించుకొని పెళ్ళి పందిరి
వైపు మాంగల్యముతో నడుస్తూఉంటే
ఆ మాంగల్య మిల మిల మెరుపులు
ఇంద్రలోకాన్ని తలిపిస్తున్నది కదా
పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగి
నన్ను ఎవరు చూడలేదు అనుకున్నట్లు
పెళ్ళిపీటలపై కాబోయే మొగడి పక్క కూర్చొని
ఓర చూపులతో పతిని పదే పదే చూస్తూ మురిసిపోతుంటివి
ముక్కోటి దేవతల వేదమంత్రాలతో దీవించెగా
మంగళ వాయిద్యాలతో సమస్త జగత్తు
మారుమ్రోగుతుండగా మాంగల్యా ధారణ గావించితివి
నక్షత్రలను తలంబ్రలుగా స్వీకరించి
సంసార సాగరంలోకి బుడి బుడి నడకలు వేస్తివి
సంసార సాగరంబును ఈది
సర్వ జగత్తుకు ఆదర్శ జంటగా నిలిచి
పండంటి పసి పాపలకు జన్మనిచ్చి
అమ్మతనపు కమ్మదనాని రుచి చూడుము
*******
No comments:
Post a Comment