తృప్తి - అచ్చంగా తెలుగు

తృప్తి

Share This

తృప్తి

ప్రతాప వేంకట సుబ్బారాయుడు 


నాకు తెలియదు
గమ్యాన్ని నిర్దేశించుకుని
దృఢంగా వేసే అడుగులు
అడుగుజాడలవుతాయని !
సంఘటితమైతేనే అనూహ్యబలమని
అందరి ఆలోచనలు కలిస్తేనే
అందమైన ఆకృతి రూపుదిద్దుకుంటుందని..మాట్లాడిన మాటలు
ప్రేరేపిత శిలాక్షరాలవుతాయని
అడుగు ముందుకేస్తూ కదులుతున్న
నా వెనక అసంఖ్యాక అడుగులు పడుతున్నాయని
నన్ను నాయకుడిని చేశాయని
అయితే, సాధించిన విజయానికి
నేను చిరునామా కాదల్చుకోలేదు
కర్తవ్యోన్ముఖుడు..కారణజన్ముడు..లాంటి పొగడ్తలు..బిరుదులూ
వద్దే వద్దు
ఎవరు పూనుకుంటేనేం?
అందరి మంచికోసం
మనోబలం..మనబలమైన తీరు ప్రశంసనీయం
అనుకున్నది సాధించిన ఈ తృప్తి చాలు
*****

No comments:

Post a Comment

Pages