ఆ ఒక్క శాతం
-ప్రతాప వెంకట సుబ్బారాయుడు
అవకాశాలు అందరికీ రావు..
వచ్చినా అందరూ సద్వినియోగం చేసుకోలేరు..
తపన..నిబద్ధత..అంకితభావం..ఉండగానే సరిపోదు
పరిస్థితులూ..అనుకూలించాలి
లేదంటే శ్రమించైనా..అందర్నీ సమాధానపరచైనా
తనకనుకూలంగా మలచుకోవాలి
వనరుల సమీకరణాసాగాలి..అదీ అంత సులభం కాదు
అనుకున్నది సాధించినవాడిని అందరూ అదృష్టవంతుడని ఆకాశానికెత్తేస్తారు..కానీ
లక్ష్యాన్ని చేరుకున్నవాడికి తెలుస్తుంది
దారిలో ఎన్నిముళ్లు, రాళ్ళూ, రప్పలు తొలగించుకుని సుగమం చేసుకున్నాడో
రాత్రనక..పగలనక ఎంతగా శ్రమించాడో..
ఇప్పుడాదారి అందరికీ రహదారి
అయితే ఒక్కటి గుర్తుంచుకోవాలి
ఆ బాటన వెళితే మనం చేరేది ఒకరు చేరిన లక్ష్యానికే
మనం మరో ధ్యేయంతో అడుగేస్తే ..కొత్తది ఆవిష్కృతమవుతుంది
ప్రపంచానికి పరిచయం చేయబడుతుంది
అది ఉపయోగించుకోడానికి 99% మంది సిద్ధంగా ఉంటారు
మిగిలిన ఆ ఒక్కశాతమే ప్రగతిపథానికి ఆశాభావకిరణాలు ఎప్పుడూ..
*****
No comments:
Post a Comment