* * * \\ జామ పండు // * * *
విజయ సువర్ణ
తోటలో ఒక చిన్న మొలక మొలిచింది,
ఆ చిన్ని మొలకకు చుట్టు పాదును కట్టి,
పక్క బావి నుండి నీళ్లు చకచకా చేది,
బిందె లోనికి నింపి పిల్ల పాదుకు పెట్టి,
చిన్నారి మొక్కను ప్రేమగా పెంచితే,
వానజల్లుల తడిసి వేడి ఎండలో ఎండి,
చల్లనీ నీడలో వెన్నెల వెలుగుల లో,
ఏపుగా ఎత్తుగా చూడగా పెరిగింది,
లే లేత రెమ్మలతో చిగురుటాకులతో,
పచ్చనీ గుబురులా కొమ్మలేసింది,
కొమ్మలన్నీ పెరిగి చెట్టుగా మారింది,
ఆ చెట్టు మా చెట్టు అది జామ చెట్టు ...
ఆ చెట్టు విరివిగా పూతలే పూసింది,
పూతలన్నీ చిరుత పిందెలుగ మారి,
పిందేలన్ని లేత కాయలు కాసినవి,
కాయలన్నీ మారి దోరగా పండినవి,
దోరగా పండిన తీయనైనా పండ్లు,
పాపలు బాబులు జామపండిదిగో,
అందరికి పంచేము ఆ జామపండ్లు ..
* * * * * * * * *
No comments:
Post a Comment