"జీవితం ..." - అచ్చంగా తెలుగు
 "జీవితం ..."

 సుజాత తిమ్మన..


 వైకుంఠము  చేరి...
విష్ణు దర్శనము చేయాలనుకున్తున్నావా...
కైలాసముమున కేగి..
శివ సాన్నిధ్యము పొందాలనుకుంటున్నా వా..
లేక ..స్వర్గ లోకంలోని అప్సరలలతో కూడి
భోగాలనుభవించాలని తలపోస్తున్నావా..
ఏ లోకం చేరి.... నీ ఏమి చేయాలని
నీ...ఈ ...అవాంతర ప్రయాణం....
వేదనలు నిను చుట్టుముట్టాయని...
నిరాశల వీధిలో పయనిస్తూ....
ధైర్యాన్ని కోల్పోయి ...
సమస్యలని ఎదుర్కోవాలనే విషయాన్ని మరిచావే..
కష్టాలు కొలిమి వంటివి...
అవి కలకాలం ఉండవు కదా..
పూర్తిగా కాలినాక ...చల్లారి బూడిదై..
చివరికి ...మసవుతుందని ..తెలుసుకో.... 
అమ్మ తనువూ..మనసు....మాత్రమే కాక..
ఆయువును..  ఫణంగా పెట్టి మరీ నిన్ను కన్నది...
నాన్న తన స్వార్ధం విడిచి..ప్రతి క్షణం నీ
ఉన్నతిని కాంక్షిస్తూ ..ఆరని చెమటలతో.
నీ ఎదుగుదలకి  కారణమయినారు...
వారి ఆశల దీపాన్ని ఆర్పేస్తూ...
ఆత్మాహుతి చేసుకునే ముందు...
లిప్త పాటు క్షణం...తెలిరిచిన రెప్పలు  మూసుకొని...
హృదయంలోకి నిన్ను నీవు చూసుకొని మరీ నిర్ణయించుకో...
ఎవరో వస్తారు..ఏదో చేస్తారు...అనే కంటే..
నేను ఏమి చెయ్యగలను...అన్న ప్రశ్నవేసుకుని చూడు...
నీవు...నీ చుట్టూ..ప్రపంచంలో ప్రతీ కదలిక అవగతమవుతుంది...
జన్మ జన్మల పుణ్యఫల ఫలితమే ...మానవ జన్మ కదా..!!
మనం మహాత్ములు అని చెప్పుకుంటున్న వారు కూడా ..మనుషులే కదా !!
వారి ఆదర్శాన్ని జీవంగా మలచుకొంటె...మహిమాన్వితమయిన జీవితం ..నీదే ఇక...!!
(విలువైన జీవితాన్ని అపజయాలను ఎదుర్కోను దైర్యం చాలక యువత తమ జీవితాలను అంతం చేసుకోవాలనుకునే వారికి..చిన్న ఈ నా స్పందన అంకితం..)

No comments:

Post a Comment

Pages