కోపాన్ని అదుపులో పెట్టుకోవడం ఎలా ?
మంత్రాల పూర్ణచంద్రరావు
తన కోపమే తన శత్రువు , అని మనకందరికీ తెలుసు .ఆ కోపమే అన్నీ అనర్దాలకూ మూలము. దాన్ని అదుపులో ఎలా ఉంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాము.
- ఒక నోట్ బుక్ మరియు పెన్ తీసుకోండి .
- ఒక్కొక్క పేజీ లో మీకు కోపం ఎవరి మీద అయితే ఉందొ వారి వారి పేర్లు కోపాన్ని బట్టి వ్రాసుకు రండి . అందరి పేర్లూ వ్రాసిన తరువాత మొదటి పేరునుండి వారి మీద ఉండే ఎక్కువ కోపం నుండి తక్కువ వరకూ అన్నీ వ్రాయండి . అలాగే అందరి పేజీలు నింపండి .పుస్తకం పక్కన పడెయ్యండి .
- ఒక నెల తరువాత వరుసగా చదవండి, అందులో మీరు వ్రాసినవి మీకే హాస్యాస్పదము అనిపించినవి కొట్టివేయండి, మళ్లి పుస్తకము మూసి పక్కన పెట్టండి , ఇంకో నెల తరువాత మళ్ళీ చదవండి, ఇలా చదువుతూ హాస్యాస్పదంగా ఉన్నవి కొట్టివేస్తూ రండి , చివరికి ఒకటో రెండో మిగులుతాయి , అవి కూడా దాయాదులోలేక వ్యాపారము భాగస్వాములు ఇటువంటివి మిగులుతాయి . చూసారా చిన్న చిన్న కోపాలు మీకే హాస్యాస్పదంగా అనిపించాయి , కాబట్టి అన్నీ కోపాలూ కోపగించుకోగలిగినవి కావు .ఇక మిగిలిన పెద్ద కోపాలు ఒకదగ్గర ఇరువురూ కూర్చుని మాట్లాడుకుంటే సామాన్యంగా తీరిపోతాయి అన్నీ పట్టువిడుపులు ఉంటె .
- ఒక్కసారి ఈ చిట్కా ఉపయోగించి చూడండి , మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోండి .
No comments:
Post a Comment