ప్రేమ మిగిలే ఉంది - అచ్చంగా తెలుగు

ప్రేమ మిగిలే ఉంది

Share This

ప్రేమ మిగిలే ఉంది

 యామిజాల జగదీశ్


అప్పుడు ప్రేమ అనడానికి
అర్ధం ఏదీ తెలీలేదు
కానీ
ఏ కాస్తైనా ప్రేమ అని చెప్పుకోవడానికి
ఓ స్వల్ప ఏకాంతమే అవసరమయ్యింది
తెల్లవారి వెలుగులో కలిసే
ఆ చూపులతో మమేకమవడంతో
కన్నాను ప్రేమను
మనసును కట్టిపడేసే
నీ ముంగురులు గాలికి
సయ్యటలాడుతుంటే
కన్నాను ప్రేమను
తటాలున అనుకోకుండా
ఇచ్చిన ఓ ముద్దు మోముతో
కన్నాను ప్రేమను
ఓ చిన్నారికి రహస్యంగా ముద్దిచ్చే
ఓ పెద్దాయన పెను శ్వాసలో
కన్నాను ప్రేమను
ప్రత్యర్ధి అనుకున్న ఒకరిని
అతిధిగా స్వీకరించిన తరుణంలో
కన్నాను ప్రేమను
ఎప్పుడూ ఒక్కటిగా నిద్రపోయే
సఖుల అంతరంగ కలలో
కన్నాను ప్రేమను
కౌగిలించుకోలేని ఓ దేహాన్ని
అనుకోకుండా అక్కున చేర్చుకున్నప్పుడు
కన్నాను ప్రేమను
ఎవరికోసమే ఎవరో
నరుక్కునే నరాలలో
పవిత్రమైన రక్తధారలో
కన్నాను ప్రేమను
మరేదైనా జరిగి ఉండవచ్చు
మరెలాగైనా ఉండు ఉండవచ్చు
ఏదేమైనా ఇప్పుడు
మిగిలే ఉంది ప్రేమ
ఓ చిన్నపాటి స్వార్ధంలో
ఓ స్వల్ప ఏకాంతంలో
ఓ చిన్ని చిన్ని సంఘటనల్లో !
 ***

No comments:

Post a Comment

Pages