తెలియక
భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు.
ఆ అడుగులే తననుండి నిన్ను దూరంగా
తీసుకువెళ్తాయని తెలియక.
నిన్ను తనఒళ్లో కూర్చుండపెట్టుకొని మరీ
తొలి పలుకులు నేర్పించింది.
ఆ పలుకులే తనవద్ద కొచ్చేసరికి
దూషణలౌతాయని తెలియక.
నీ వెంటపడి మరీ కొసరికొసరి ముద్దలు తినిపించింది.
ఆ ముద్దలు పెట్టడానికే నువ్వు తనని
కసిరికసిరి కొడతావని తెలియక.
నీ కంటతడి రానీకుండా తను ఒకవరమై నిన్నుకాచింది.
ఆ వరమే తనపాలిటి కలవరమై తనతో
అనుక్షణం కంటనీరు పెట్టిస్తుందని తెలియక.
తన శక్తికి మించి నువ్వు కోరినవన్నీకాదనక సమకూర్చింది.
ఆ కూర్పే తనపాలిటి తీర్పై,ఊహించని మార్పై,
తనను నీనుండి దూరంగా వెలివేస్తుందని తెలియక.
కలలో,మెలకువలో కూడా నీమేలే మరీమరీ కోరింది.
ఇవన్నీ మరిచి,తనను విడిచి నువ్వు వెళ్తావని తెలియక.
ఐనాసరే నీపై అరవక, నిన్ను మరువక, నీ ప్రవర్తనకు వెరవక
తన ప్రేమను ప్రతీక్షణం నీపై కురిపిస్తూనే ఉంది,
పాపం అమ్మ,తనేమాత్రం అలియక.

****
No comments:
Post a Comment