వాల్ మార్ట్ విశేషాలు
అంబడిపూడి శ్యామసుందర రావు ,
గుంటూరు ,ఫోన్ నం 9440235340.
ప్రపంచములోనే అతి పెద్దదైన వాల్ మార్ట్ గొలుసు దుకాణాల గురించి తెలుసుకోవాలంటే మనము అమెరికాలోనే ఉండనవసరములేదు ఎందుకంటే ప్రస్తుతము వాల్ మార్ట్ గొలుసు దుకాణాలు లేని నగరము లేదు కాబట్టి. ప్రపంచములోనే ధనిక కుటుంబాలలో ఒకటైన వాల్టన్ కుటుంబము చేత నడపబడే సంస్త వాల్ మార్ట్. 1962లో ప్రారంబింపబడి ఎవరు ఉహించని స్తాయికి ఎదిగిన సంస్త ఈ వాల్ మార్ట్. ప్రారంభములో వాల్ మార్ట్ వారు అమెరికా,కెనడా, మెక్సికో దేశాలలోని నగరాలలో రిటైల్ దుకాణాలను ప్రారంభించి అనతికాలములోనే ప్రపంచ దుకాణాలను ప్రారంభించి వాల్ మార్ట్ అనేది అంతర్ జాతీయ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు .
వాల్టన్ కుటుంబము మరియు వాల్ మార్ట్ కార్పొరేషన్ 28 దేశాలలో(చైనా,ఇండియా,జర్మనీ,బ్ రెజిల్ మరియుఇంగ్లాండ్ వంటి దేశాలతో సహా) గొలుసు రిటైల్ దుకాణాలతో విస్తరించింది కాబట్టి అమెరికాలో నివసించని వారైన వాల్ మార్ట్ లో సరుకులు కొంటునే ఉంటారు. ఇంతగా విస్తరించటానికి రిటైల్ వ్యాపార రంగములో ఆధిపత్యము సంపాదించటానికి రిటైల్ మార్కెట్ ను ఇంతగా దోచుకోవటానికి కారణాలు ఏమిటొ కొద్దిగా పరిశీలిద్దాము మొదటి కారణము ఇది చాలా చాలా పెద్దది. అక్కడ షాపింగ్ చేసే వారికి తెలియని విశేషాలు ఏమిటి అంటే ప్రపంచ వ్యాప్తముగా వాల్ మార్ట్ ఉద్యోగుల సంఖ్య 2.2 మిలియన్లు ఇంకా ఉద్యోగులను తీసుకొనే అవకాశము కూడా ఉంది ఈ సంఖ్య చైనా సైన్యము (2.29 మిలియన్ల)కు దాదాపు సమానము,అమెరికాలోని సైనికుల సంఖ్య ( 1. 43 మిలియన్ల )కన్నాఎక్కువ ఒక్క అమెరికాలోనే 4,540 రిటైల్ వాల్ మార్ట్ దుకాణాలు ఉన్నాయి ఈ సంఖ్య మిగిలిన బ్రాండ్ల దుకాణాల సంఖ్య కన్నా రెట్టింపు 31 మార్చ్ 2015 నాటికి అంతర్జాతీయముగా దుకాణాల సంఖ్య 6,301, వీటిలో దాదాపు 90%శాతము దుకాణాలు వాల్ మార్ట్ పేరుతో కాకుండా బెస్ట్ ప్రైస్,అస్డా,బొడెగా సేయియు, ట్రస్ట్ మార్ట్, హైపర్ మార్కట్ మరియు తోడో దియా వంటి పేర్లతో వివిధ దేశాలలో చెలామణి అవుతున్నాయి.
అన్ని రకాల పన్నులు కట్టి ,వాటాదారులకు డివిడెండ్ రూపములో చెల్లించినాకా వాల్ మార్ట్ నికర లాభము 2014లో 15. 88బిల్లియన్ల డాలర్లు ఇది లాభము మాత్రమే సుమా అమ్మకాలు కాదు. ఈ లాభాలవల్ల అమెరికాలోని మొదటి పదిమంది ధనవంతుల జాబితాలో నలుగురు వాల్టన్ కుటుంబము లోని వారే . వాల్టన్ కుటుంబ సభ్యుల వ్యక్తిగత ఆదాయము 30 బిలియన్ డాలర్లు. వాల్టన్ కుటుంబములోని ఆరుగురి ఆదాయము అమెరికా జనాభా లోని 40%ప్రజల సమానము. డగ్లస్ మ్యాక్ మిలన్ వాల్ మార్ట్ c.e.o జీతము సాధారణ వాల్ మార్ట్ ఉద్యోగి పొందే జీతము కన్నా 1,034 ఎక్కువ. ప్రంచములోనే ఒక సంస్తకు చెందిన ఉద్యోగుల జీతాలలో ఇంత అంతరము ఎక్కడా చూడము.
ఒక వారములో అమెరికాలోని వాల్ మార్ట్ దుకాణలకు వచ్చే కొనుగోలుదారుల సంఖ్య దాదాపు 140 మిలియన్లు అంటే అమెరికా జనాభాలో 44% మంది వాల్ మార్ట్ లో కొనుగొలుదారులే. వాల్ మార్ట్ స్టొర్స్ అన్నింటిని కలిపితే
మాన్ హట్టన్(అమెరికా లోని ప్రముఖ నగరము) సైజ్ ను మించి పోతుంది. అమెరికాలో అతిపెద్ద తుపాకుల రిటైల్ అమ్మకముదారు వాల్ మార్టే .
క్రిందటి సంవత్సరము వాల్ మార్ట్ కార్పొరేషన్ మరియు ఫౌండేషన్ 1.4బిల్లియన్ల డాలర్లు లను విరాళాలుగా(నగదు లేదా వస్తు రూపములో) ఇచ్చింది ఈ విధముగా తన దాతృత్వాన్ని తెలుపుకుంది కాని ఈ సొమ్ము వాల్టన్ కుటుంబ ఫౌండేషన్ ఆదాయములో 0.1% మాత్రమె అదికూడా న్యాయపరముగా కొంత పన్ను ఎగవేతకె అని వ్యాపారవర్గాలు అంటు ఉంటారు.
****
No comments:
Post a Comment