అభినయ తపస్విని - ప్రొఫెసర్ అలేఖ్య
భావరాజు పద్మిని
నవరసాల్ని నవనాడుల్లో నింపుకున్నారు ఆవిడ. అందుకేనేమో, ఆమె ప్రతి కదలికలో ఒక దర్పం, నిరుపమాన సౌందర్యం ఉంటుంది. ప్రతి కవళిక కళ్ళను కట్టిపడేస్తుంది. హావభావాల ప్రదర్శనలో ఆమెకు ఆమే సాటి అనిపిస్తుంది. నృత్య తపస్సు చేసి తాదాత్మ్య స్థితికి చేరుకున్న 'అభినయ తపస్విని' ప్రొఫెసర్ అలేఖ్య గారితో ప్రత్యేక ముఖాముఖి
ఈ నెల మీకోసం...
మీరు ఎన్నేళ్ళ వయసు నుంచి నాట్యం నేర్చుకోవడం మొదలు పెట్టారు ?
నేను మూడున్నర నాలుగు సంవత్సరాల నుంచి నేర్చుకోవడం మొదలెట్టాను..
భరత నాట్యమా లేక కూచిపూడా ?
నేను హైదరాబాద్ నాంపల్లి లోని మాంటెస్సరీ స్కూల్ లో చదివాను. అక్కడ రెండున్నర సంవత్సరాల వయసులో జాయిన్ అయ్యాను. ఆ స్కూల్ లో డాన్స్ పాఠ్యాంశంలో ఒక భాగంగా వుండేది. అక్కడంతా ఆక్టివిటీస్ బేస్డ్ ఎడ్యుకేషన్. అందులో డాన్స్ కూడా ఒక భాగంగా వుండింది. నాకెందుకు మొదలయిందో గాడ్స్ గిఫ్ట్ గా అలా ఇంట్రెస్ట్ కలిగింది.
నేను 8th క్లాస్ నుంచి, అలా డాన్స్ మొదలయ్యిందో లేదో వెళ్లి పోయేదాన్ని. అక్కడ సీనియర్ స్టూడెంట్స్ డాన్స్ చేస్తుంటే.. మైమరిచి చూస్తుండి పోయేదాన్ని. తరువాత కొన్నాళ్ళకి నేను డాన్స్ క్లాస్ లో జాయిన్ అవ్వాలని ట్రై చేశాను. ఆ తరువాత మా అమ్మ గారు మా టీచర్స్ , ప్రిన్సిపాల్ గారితో మాట్లాడి నన్ను డాన్స్ క్లాస్ లో చేర్పించారు.
మా గురువు గారు ఒడిస్సీ కథక్ లలో నిష్ణాతులు. కానీ నాకు మాత్రం భరత నాట్యం... కూచిపూడి నేర్చుకోవాలన్న ఆసక్తి బలంగా వుండేది. అప్పుడు మా నాన్న గారు నన్నుఉమా రామారావు దగ్గర జాయిన్ చేసారు. ఆవిడ నాకు కూచిపూడి, భరతనాట్యం రెండిట్లో శిక్షణ ఇచ్చారు.
.ఈ నేపధ్యంలో మీ విధ్యాభ్యాసం ఎలా కొనసాగింది ?
అమ్మ గారు ఎప్పుడు చెప్పే వాళ్ళు ‘డాన్స్ , డాన్స్’ అంటూ చదువును నిర్లక్ష్యం చెయ్యొద్దని ! మా అమ్మగారికి నేను మాటిచ్చాను “... అలా ఎప్పటికి జరగదు. ఐ విల్ గివ్ ఇంపార్టెన్స్ టు బోత్ “ అని.
నేను ‘ఫిలాసఫీ అండ్ భరత నాట్యం’లలో డిగ్రీలు చేశాను. నేను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ‘శిల్పకళ మరియు పురావస్తు శాస్త్రం’లో పీజి చేశాను. మన తెలుగు విశ్వ విద్యాలయం నుంచి PhD చేశాను.
ఎక్స్ లెంట్ అండి...మీ దృష్టిలో అసలు నాట్యం అంటే ఏమిటి ?
నాట్యం అంటే అదొక ఫిజికల్ ఎక్సర్ సైజ్ కాదు. ఇదొక క్రమశిక్షణ కోసం, ఏకాగ్రత కోసం ఇంకా చెప్పాలంటే “దైవత్వాన్ని చేరుకునేందుకు” ఇదొక సాధనం. ఇదొక “యోగం”. మనం నాట్యం చేసేటప్పుడు అన్ని మర్చిపోతాం. మనకొకటే ధ్యేయం వుంటుంది... “....దైవాన్ని చేరుకోవాలని”.
అలాంటివి తరచుగా ఎప్పుడు జరుగుతూనే వున్నాయి. అందులో ముఖ్యమైనదొకటేంటంటే నేను ముంబై లో ‘కల్కి
కళా సమ్మేళనం’లో డాన్స్ చేయడానికి వెళ్ళాను. అక్కడ ప్రతి పార్టిసిపెంట్ కు 45 నిముషాల వ్యవధి ఇచ్చారు. అక్కడ నా కోసం కొరియోగ్రఫీ చేసిన ‘మహేశ్వరి మహంకాళి’ ప్రదర్శిస్తూ, నేనందులో పూర్తిగా లీనమై పోయాను. ఈ నలభై ఐదునిముషాల వ్యవధి ఎప్పుడు గడిచి పోయిందో కూడా నాకు తెలియదు. సాధారణంగా కాంపిటిషన్స్ లో సమయాభావాన్ని సూచించేందుకు రెడ్ లైట్ మరియు గ్రీన్ లైట్ ఉపయోగిస్తుంటారు. రెడ్ లైట్ వెలిగినా కూడా పట్టించు కోనంతగా నేను లీనమైపోయి చేస్తున్నాను.
కళా సమ్మేళనం’లో డాన్స్ చేయడానికి వెళ్ళాను. అక్కడ ప్రతి పార్టిసిపెంట్ కు 45 నిముషాల వ్యవధి ఇచ్చారు. అక్కడ నా కోసం కొరియోగ్రఫీ చేసిన ‘మహేశ్వరి మహంకాళి’ ప్రదర్శిస్తూ, నేనందులో పూర్తిగా లీనమై పోయాను. ఈ నలభై ఐదునిముషాల వ్యవధి ఎప్పుడు గడిచి పోయిందో కూడా నాకు తెలియదు. సాధారణంగా కాంపిటిషన్స్ లో సమయాభావాన్ని సూచించేందుకు రెడ్ లైట్ మరియు గ్రీన్ లైట్ ఉపయోగిస్తుంటారు. రెడ్ లైట్ వెలిగినా కూడా పట్టించు కోనంతగా నేను లీనమైపోయి చేస్తున్నాను.
అక్కడ ఆర్గనైజర్ చాలా పెద్దాయన, దేవీ భక్తుడు. నా పర్ఫార్మన్స్ పూర్తవగానే... నా పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసారు. “ అమ్మా... నువ్వలా నృత్యం చేస్తుంటే నీలో నాకు అమ్మవారు కనిపించింది. ఈ మాట నేను ఒక ఆర్గనైజర్ గా చెప్పడం లేదు, ఒక అమ్మ భక్తుడిగా నమస్కారం చేసుకున్నాను...“ అన్నారు.
ఎన్నో సంవత్సరాలు క్రమశిక్షణతో ఒక పద్దతిలో చేసాక, మాకు ఏదైనా ప్రత్యేకంగా చేయాలనిపించింది. హిస్టారికల్ , మైథలాజికల్ సబ్జక్ట్స్ ను ఎన్నుకోవడం జరిగింది. నాయకి కానివ్వండి, మందాకినీ కానివ్వండి, మేము ఈ మధ్య చేసిన రుద్రమ కానివ్వండి... ఇలాంటి ప్రయత్నాలే. ఇవన్ని కూడా ఒక దానిని మించి ఒకటి కొరియోగ్రఫీ చేయడం జరిగింది. ప్రజలు కూడా వాటిల్ని అంత బాగా ఆదరించారు. ఇవన్ని కూడా నాకు చాలా మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇప్పుడాలోచిస్తుంటే “...ఇదొక ఫలవంతమైన మధుర జ్ఞాపకాల ప్రయాణం “ అనిపిస్తున్నది.
మీరు సాధించిన అవార్డ్స్ గురించి చెప్తారా ?
సాహిత్య పీఠం వారు అభినయంలో నేను సంపాదించుకున్న పేరును దృష్టిలో పెట్టుకుని మరియు నేను చేసే
విధానాన్ని గుర్తించి ‘అభినయ తపస్విని’ అనే బిరుదుతో సత్కరించారు. తరువాత మన ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఇచ్చిన ‘హంస’ అవార్డు, రాజీవ్ ప్రతిభ పురస్కారం, ఉగాది పురస్కారం, తరువాత వీటన్నింటికి మించింది సెంట్రల్ సంగీత్ నాట్య అకాడమీ అవార్డు, ఇంటర్నేషనల్ గా నాకొచ్చిన ‘స్త్రీ కళాపూర్ణ’, శ్రీ అన్నమాచార్య ప్రాజెక్ట్ నార్త్ అమెరికా వాళ్ళు ఇచ్చిన అవార్డు, ఇంకా తానా, ఆటా లు ఇచ్చిన ‘ ఎక్స్ లెన్స్ లైఫ్ టైం అవార్డ్స్’ ను అందుకున్నాను.
విధానాన్ని గుర్తించి ‘అభినయ తపస్విని’ అనే బిరుదుతో సత్కరించారు. తరువాత మన ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఇచ్చిన ‘హంస’ అవార్డు, రాజీవ్ ప్రతిభ పురస్కారం, ఉగాది పురస్కారం, తరువాత వీటన్నింటికి మించింది సెంట్రల్ సంగీత్ నాట్య అకాడమీ అవార్డు, ఇంటర్నేషనల్ గా నాకొచ్చిన ‘స్త్రీ కళాపూర్ణ’, శ్రీ అన్నమాచార్య ప్రాజెక్ట్ నార్త్ అమెరికా వాళ్ళు ఇచ్చిన అవార్డు, ఇంకా తానా, ఆటా లు ఇచ్చిన ‘ ఎక్స్ లెన్స్ లైఫ్ టైం అవార్డ్స్’ ను అందుకున్నాను.
చాలా బావుందండి..మీరు ఏమన్నా డాన్స్ స్కూల్ ని ప్రారంభించి, మీ విద్యను ముందుతరాల వారికి నేర్పుతున్నారా ?
నేను స్థాపించిన ‘కృష్ణ’ అనే డాన్స్ స్కూల్ వుంది. అక్కడ ఆసక్తి వున్న పిల్లలందరికి కూచిపూడి నేర్పుతున్నాము. అదొక నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ (NGO). I only teach because I want to share my knowledge in classical dance, my expertise and my experience. ఇది హిమాయత్ నగర్ లో వుంది.
నాకు ఈ కళ భగవంతుడిచ్చిన ఒక వరంగా భావిస్తున్నాను. కాబట్టి ఎంత వీలుంటే అంత మంది పిల్లలకి ఈ కళను పంచి, వాళ్ళను ఉన్నతంగా తీర్చిదిద్దాలనుకుంటున్నాను. కళ నేర్చుకోవడం వలన ‘వాళ్ళొక బెటర్ ఇండివిడువల్’ అవుతారని నా నమ్మకం.
డాన్స్ ఫీల్డ్ లోకి వచ్చే వాళ్ళకి మీరేమన్నా సందేశం ఇవ్వాలనుకుంటున్నారా ?
“.....కళ నేర్చుకోవడం అనేది కేవలం ప్రదర్శించేందుకు మాత్రమే కాదు, ఒక మంచి మనిషిగా తనను తను మలచుకునేందుకు సహాయ పడుతుందని “ నా ప్రగాఢ నమ్మకం. అందులో నాట్యం అనేది ఒక సమగ్రమైన కళ.
చాలా సంతోషం అలేఖ్య గారు... చాలా చక్కగా చెప్పారు. మా ‘అచ్చంగా తెలుగు’ అంతర్జాల పత్రిక కోసం, మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు కృతజ్ఞతలు. మీరు మరిన్ని విజయాలు సాధించి, విజయ శిఖరాలను అధిరోహించాలని మనసారా ఆకాంక్షిస్తున్నాము.
***
అలేఖ్య గారి నాట్యాన్ని క్రింది లింక్ లలో దర్శించండి.
No comments:
Post a Comment