బోలెడు డబ్బులుంటే చాలదా?
ఆండ్ర లలిత
అనగనగా ఒక ఊరిలో సోముడు, మరియు రాముడు అనే ప్రాణ స్నేహితులుండేవారు. రోజూ బడికి కలిసి వెళ్ళటం ..కలిసి ఆడుకోవటం.. అల్లరి చేయటం. మరి బడిలో కూడ బోజనాల గంట కొట్టిన వెంటనే ఒక చోట చక్కగా ఇద్దరూ వాళ్ళు తెచ్చుకున్నవి పంచుకుంటూ,బోజనం ఆస్వాదిస్తూ ఉండేవారు.సోముడు ధనవంతుడు. చదువంటే అశ్రధ్ధ మరియు బధ్ధకం... తాతలు ముత్తాతలు నేతులు త్రాగారుట..తండ్రి వారి ఆస్తులు సమర్థించుకుని రాకపోయినా బోళ్లడంత ఆస్తి. వాళ్ళింట్లో అందరూ పనులు పురమాయించేవారే కాని పని చేసేవారు కదు.. అదే సోముడికి అలవాటు...పని,చదువు అంటే ఆమడదూరం పరుగెడతాడు..
కాని రాముడు అలాకాదు.రాముడు మధ్య తరగతి కుటుంబములో జన్మించాడు. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి. తల్లి గృహిణి.రాముడికి చదువంటే శ్రధ్ధ, ఆశక్తి, పట్టుదల. అందువల్ల కష్టపడి చదివేవాడు. సోముడు పదోతరగతితో ఆపేసాడు. వాళ్ళ ఆస్తులు వ్యవసాయం చూసుకుంటే చాలు అనుకున్నాడు, కాని అది కూడా బధ్ధకంతో సరిగా చేసేవాడు కాదు. రాముడు మాత్రం పైచదువులు చదువుకుని గొప్ప వైద్యుడిగా అదే ఊరిలో స్థిరపడ్డాడు..
ఎంతో మందికి జ్వరాలు, కడుపులో నొప్పులు, దగ్గులు, ఇంకా ఎన్నెనో జబ్బులకి, తీయటి మాట,సరైన మందులు, గాయాలకు వ్రాశేందుకు చల్లటి మందులిచ్చి ఇట్టే నయం చేసేవాడు.
సోముడు వ్యవసాయం చేసి రోజూ భోజనానికి ధాన్యం, పప్పు దినుసులు, కూరలు, పళ్ళు పండించకుండా ఊరికే అటూ ఇటూ తిరుగుతూ కాలం గడిపేవాడు. నీ అంతవాడు లేడని తనదగ్గర ఉన్న డబ్బుతోనే బ్రతికే వాళ్ళతోనే తిరిగే వాడు... మరి పొలాలకి సంరక్షణ చేయించేవాడు కాదు.ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేసే వాడు. మరి వాడు తనతో కూడా వుండే వాడి స్నేహితులని కూడా ఆనందంగా ఉంచాలికదా.అలాలేకపోతే వాడ్ని పొగడకుండా వెళ్ళిపోతారేమోనని. అలా ఇద్దరూ ఆ ఊరి పెద్దలుగా జమాచేయబడుతూ జీవించేవారు.
ఇంతలో ఒక పెద్ద భూకంపం వచ్చి, దాని మూలంగా దగ్గర వున్న ఆనకట్ట పడిపోయి వరదలొచ్చి పంటలు సర్వనాశనము అయిపోయాయి. ఇళ్లు భూకంపంతో కూలిపోయాయి. మరి అందరికీ ధననష్టం జరిగి కుప్పకూలిపోయారు. రాముడు తన విద్యతో మళ్ళీ సరిపడినంత సంపాయించుకోగలిగాడు. సోముడికి విద్యఅంతలేనందున...జీవితం తారుమారిపోయి అప్పులన్నీ తీర్చలేక చాలా ఇబ్బందులలో పడిపోయి చాలా దీన స్ధితిలోపడి కాలం వెళ్ళబుచ్చుకోసాగాడు..పూర్వ వైభోగం మటుకు రాలేదు..స్నేహితులందరూ ఎవరి దారి వారు చూసుకున్నారు.నేను కూడా చదువుకుని ఉంటే బావుండేది కదా అని బాధ పడ్డాసాగాడు.
అందుకే తెలుసుకోవలసినది ఏమిటంటే మనము నావి అనుకున్నవన్నీ పోవచ్చు ...సునామీలు వరదలూ భూకంపాలులేదూ దొంగలు దోచేయచ్చు.. కాని విద్యమనతోనే ఉంటుంది.. ఎవ్వరూ దోచలేరు. బోలెడు డబ్బులుంటే చాలు అనుకో కూడదు. మనము విద్యతో మళ్ళీ మొదటనుంచి మొదలుపెట్టి పూర్వ వైభోగం సంపాయించుకోవచ్చు.విద్యను మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. చక్కగా చదువుకోవాలి.ఆడు కోవాలి. రెండూ చేయాలి.
****
No comments:
Post a Comment