గోత్రములు -ఋషులు - అచ్చంగా తెలుగు

గోత్రములు -ఋషులు 

మంత్రాల పూర్ణచంద్రరావు 


మన  అందరి  ఇంటి  పేర్లకి ఒక్కొక్క  గోత్రం  ఉంటుంది, కొన్ని గోత్రాలు రెండు  మూడు  ఇంటి పేర్లకి  కూడా  ఉండవచ్చు, ఆ  గోత్రానికి  కొంతమంది  ఋషులు మూల  పురుషులుగా  ఉంటారు, మనం ఆ  ఋషుల గురించి  తెలుసుకుంటే మన  మూల పురుషులు  ఎంత  గోప్పవారో తెలుస్తుంది, మన  ఆచార వ్యవహారాలకి  ఇది  ముఖ్యం  అని  నాకు  అనిపించి వారి  గురించి నేను  సేకరించిన  సమాచారాన్ని మీ  ముందుకు  తీసుకు  వస్తాను .
అగస్త్య మహర్షి , అత్రి మహర్షి, అష్టావక్ర మహర్షి,కపిల మహర్షి, ఋష్యశృంగ మహర్షి,చ్యవన  మహర్షి, కశ్యప మహర్షి,గౌతమ మహర్షి , దుర్వాస మహర్షి,దధీచి మహర్షి, దత్తాత్రేయ మహర్షి, జమదగ్ని మహర్షి.
 అగస్త్య మహర్షి
పరమ పవిత్రులు, బ్రహ్మ విద్య నేర్చిన  వారు, పరమేశ్వరునికి ఇష్టులు  అయిన బ్రహ్మ ఋషులలో అగ్ర  స్థానము  పొందిన వారు అగస్త్య మహర్షి. ఈయన  త్రికాలవేది,భక్తిజ్ఞాన యోగ విరాగ నిధి, గృహస్థ రత్నము.
ఒక  జలకలశ ము నుండి  అగస్త్యుడు, వసిష్టుడు ఉద్భవించిరి, వీరి  ఇరువురకు  మిత్రావరుణుల పుత్రులు  అని పేరు .అగస్త్యడు  బాల్యము నుండియు మహానిష్టా గరిష్టుడు అయి బ్రహ్మ చర్యము చేయుచు అసమాన  తపస్సంపదచే విరాజిల్లుచుండెను, ఆయనకు బాల్యమున దేవతలే  ఉపనయనము, బ్రణవ  పంచాక్షరీ మంత్రము  ఉపదేసించితిరి . పిదప అతడు నిష్టాతి సాయమున బ్రహ్మచర్య  పాలనమున ఉగ్రతపస్సు చేయుచుండెను , అందులకు ఆయన నిరాహారుడు , నిర్జితేన్ద్రియుడు, నిర్ధూత కల్మషుడు అయి రోజు రోజుకు దివ్య  తేజస్సు పొందుచుండెను
ఇట్లుండ ఒకనాడు అగస్త్యడు అరణ్యములో  సంచరించు చుండగా అధోముఖముగా  వ్రేలాడు చున్న కొందరు మునీశ్వరులను చూసెను, అయ్యా  మీరెవరో తెలియపరచి మీకు  ఈ  దుస్థితి ఎందుకు కలిగిందో చెప్పండి  అనగా వారు నాయనా మేము ఇతరులము కాదు నీ పితరులము. నీవు గృహస్థాశ్రమము స్వీకరించి పుత్ర పౌత్రులను పొందిన గానీ మాకు ఊర్ధ్వ లోకములు కలగవు. నీవు అట్లు చేయక బ్రహ్మచర్యాశ్రమము  ననే ఉండుట మాకు  ఈ భరింపరాని  వేదన అని పలికిరి.అందులకు అగస్త్యుడు పితృదేవత లారా మీ కోరిక త్వరలోనే తీర్చి మిమ్ములను ఊర్ధ్వ లోకములకు పంపెదను అని  బదులిచ్చెను.
           ( ఇంకా  ఉంది  )

No comments:

Post a Comment

Pages