జై జవాన్ - అచ్చంగా తెలుగు

జై జవాన్

పెమ్మరాజు అశ్విని 


భారతావనిలో ప్రజలు రోజూ ప్రశాంతమైన జీవితం గడుపుతున్నారు అంటే, అందుకు కారణం ప్రభుత్వాలు, మంత్రులు, పధకాలు, ఇవేవి కావు. కేవలం దేశ రక్షణ కోసం ప్రాణాలను సైతం తృణప్రాయంగా త్యజిస్తున్న వీర సైనికుల చలవే అంటే అది అతిశయోక్తి కాదేమో.
       దేశ రక్షణ లో భాగంగా మన రాజ్యాంగాన్ని అనుసరించి రక్షణ శాఖను మూడు దళాలుగా విభజించిన సంగతి మనకి విదితమే. భారతీయ సైన్యాన్ని మిలిటరీ,నేవీ ,ఎయిర్ ఫోర్స్ విభాగాలుగా విభజించారు ,ఇవి గాక పారా మిలిటరీ విభాగాలు వేరే, ఈ దళాలన్నిటికి దేశ రాష్ట్రపతి సర్వ సైన్యాధ్యక్షుడిగా వ్యవహరిస్తారు అనేది మనకు తెలిసిన విషయమే.
       స్వాతంత్యం వచ్చిన నాటి నుండి భారత సేన అందిస్తున్న సేవలు అజరామరం ఇప్పటి వరకు మన దేశం పలు ప్రత్యక్ష ,పరోక్ష యుద్ధాలు చేయవలిసి వచ్చింది. భారతీయులు సహజంగా శాంతి కాముకులు అయినప్పటికీ పొరుగు వారు కయ్యానికి కాలు దువ్వుతుంటే చేతులు కట్టుకుని కూర్చునే పిరికివాడు కాదు అనడానికి 1947,1965,1971,1999 లో పాకిస్తాన్ యుద్ధం,అలాగే 1984 లో సియాచిన్ యుద్ధం లో గెలుపు బావుటా ఎగురవేయడమే సంకేతం .
    ఒక్క సరిహద్దులలోనే కాక దేశం లో ఏ మూలా ఏ అనిశ్చితి ఏర్పడినా  అది మావోయిస్టుల  వల్ల  కావచ్చు ,రాష్ట్ర విభజన వల్ల కావచ్చు లేదా అంతః రాష్ట్ర నీటి కలహాల వంటి సంఘటనలు కావచ్చు వీటిని చక్కదిద్ది శాంతి భద్రతలను దారిలో పెట్టడంలో సైన్యం కీలక పాత్ర పోషిస్తోంది. ఎండనక వాననకా ,ఎముకలు గడ్డ కట్టే చలిని సైతం లెక్క చేయక,తమ కుటుంబాలకు దూరంగా వుంటూ దొరికిన వస్తువులతో వండుకు తింటూ ,దేశాన్ని దేశ ప్రజలని వారి కుటుంబం గా భావించి,వారి క్షేమం కోసం అహర్నిశలు పోరాడుతున్న మన సైనిక దళాలకు వారి కుటుంబాలకి నిజానికి మన దేశ వార్షిక బడ్జెట్ లో కేటాయించే మొత్తం చంద్రుడికో నూలుపోగు అనిపిస్తుంది. ఈ కేటాయింపులతో,మన దేశ శాస్త్రవేత్తల మేధోసంపదని జోడించి దేశ రక్షణకి కావాల్సిన ఆయుధ సముదాయం తయారు చేస్కుంటున్నప్పటికీ, మనకై మనం ఏనాడూ పొరుగు దేశాల మీద యుద్ధం ప్రకటించని శాంతి కామకులం మనం.
     అయితే మన శాంతా స్వభావాన్ని నిస్సహాయత గా భావించి, శత్రుదేశం పాకిస్తాన్ వారి ఆగడాలు అంతకంతకు మితిమీరుతూ వచ్చాయి. చివరకు మొన్న 2016 లో సెప్టెంబర్ 18 న నలుగురు తీవ్రవాదులు భారత్-పాకిస్తాన్ సరిహద్దు వెంబడి వున్నా ఊరి లోని సైనిక స్థావరం పైన గ్రెనేడ్ల తో దాడి చేసి 23 మంది వీర జవాన్లను పొట్టను పెట్టుకున్నారు.,శ్రీ నరేంద్ర మోడీ సారథ్యం లోని భారత ప్రభుత్వం ఈ దుశ్చర్య ఘాటుగా బదులు ఇచ్చింది.
సెప్టెంబర్ 29 వ తేది తెల్లవారు జామున భారత సైన్యం భారత్-పాకిస్తాన్ సరిహద్దు రేఖ ను దాటి దాదాపు 2 నుండి 3 కిలోమీటర్లు చొచ్చుకు పోయి ముప్ఫై మంది ముష్కరులను మట్టు బెట్టింది మన వీర సేన.
  అయితే ఈ దాడులు అసలు జరగలేదు అంటూ ప్రపంచాన్ని నమ్మించే విఫల యత్నం చేసింది పాక్ ప్రభుత్వము ,కానీ భారత్ ప్రభుత్వం వీరి ఎత్తుగడ సాగ నీయక ప్రపంచానికి ఋజువు లతో నిరూపించారు.  ప్రభుత్వం వారూ మన రక్షణ దళాలకి వారి కుటుంబాల కి ఎన్నో రకాల వసతులు కల్పిస్తున్న సైన్యానికి ఇటువంటి ప్రతి దాడి చేసే అవకాశం ఇవ్వడం మాత్రం వారి ధైర్య సాహసాలకి నిజమైన గుర్తింపు గా భావిస్తున్నారు మన వీర జవాన్లు .ఇటువంటి వీర జవాన్లు ఎక్కువగా ఉత్తరాది రాష్ట్రాల కు చెందిన వారే,ఇటీవల ఓక సర్వే ప్రకారం ఉత్తర ప్రదేశ్,హర్యానా,ఉత్టాఱకాంఢ్,బీహార్ పంజాబ్ నుంచి ఎక్కువగా సైనిక వృత్తి లో చేరుతున్నారు.
            అలా అని మన దక్షిణాది వారూ ఏమి తీసి పోలేదు, మన ఆంధ్ర ప్రదేశ్ లో ని పశ్చిమ గోదావరి జిల్లాలోని మాధవరం అనే గ్రామం నుండి తరాల నుండి కుటుంబానికి ఒక్కరైనా మిలిటరీకి పంపి దేశ ఋణం కొంతైనా తీర్చు కుంటున్న ఘనత మనకి వుంది.
 ఒక్క జాము కాలం సైన్యానికి అవకాశం ఇస్తేనే దాదాపు గా ముప్ఫై మంది ముష్కరులను ఉరి దాడికి దీటైన జవాబు ఇచ్చారు ,ఇదే త్రిదళాల కి ఒక రెండు రోజులు వ్యవధి ఇస్తే బహుశా ఇక మీదట భారతావని పై దాడి అనే ఆలోచన కలలో సైతం తల పెట్టేందుకు జడుసు కుంటారు శత్రు రాజ్యాలు. అటువంటి ఎందరో వీర జవాను లను కని భరత మాత ఋణం తీర్చు కుంటున్న మాతృ మూర్తులకు వందనం.
***

No comments:

Post a Comment

Pages