నిత్య దీపావళులే ఇక
సుజాత తిమ్మన..
9391341029....
అగ్గిపుల్లతో..వెలిగిస్తేనే....
దీపం వెలిగి ..ఆ వెలుగును
అంతా వ్యాపింప జేస్తుంది..
రాజయినా..పేద అయినా..
యోధుడయినా...చివరికి...
దేవుడయినా...సరే..
అర్ధాంగి ఆలంబన లేనిది..
తాను అసహాయుడనని ...
తెలియ జేస్తుంది..నరకాసుర వధ చరిత్ర..
భీకర పోరాటంలో అలసి సొలసి
కృష్ణుడు..ముర్చిల్లితే..
అబలనని బెంబేలు పడక..
ధనుస్సు నెక్కుపెట్టి...ఆ రక్షసుని
వధించిన దీర సత్యభామ..
నరకాసుర సంహారానంతరం ..
ఆనందాలతో ప్రజలు అమావాస్య రోజున ..
దీపాలు వెలిగించి..టపాసులు కాలుస్తూ..
దీపావళి పండగ చేసుకున్నారట....
ఆది ..అంతం కూడా “ఆమె “ (అతివ ) అని తెలిసినా
అణగారని అహంకారంతో ...కామ క్రోధాలకు
ఆలవాలమై నిలచిన రాక్షసులు ఎందరో ...ఈనాడు ..
ఆడదానివని అలుసు చేస్తూ..ప్రాణాలని తోడేస్తూ..
‘అమ్మ ‘ ని కూడా ‘ ఆమె ‘ అన్న భావనతో తోక్కేస్తూ...
చరించే శవాలుగా మార్చేస్తున్నారు..
ఆధిశక్తి అంశ అయిన స్త్రీ మూర్తిని..
అసువుల వలయంలో బందిస్తున్నారు..
పురాణాలు తిరగేస్తే....
సరస్వతి...లక్ష్మి...పార్వతి...పేర్లు ఏవయినా...
దేవి..అమ్మవారు ..సౌభాగ్యప్రదాయిని "ఆమె.."(అతివ )
ప్రతి నోములోను..గౌరమ్మగా పూజలందుకుంటూ...
హిందూసాంప్రదాయంలోనిలిచిన... పసుపు పట్టపురాణి "ఆమె "(అతివ)
"ఆమె "(అతివ) కంటి కొస వెన్నెలలు కురిసిన రోజు..
"ఆమె "(అతివ) చిరునవ్వుతో మల్లెలు పూయించిన రోజు...
"ఆమె"(అతివ) కదలిక కనకాంబరాల కనకం కురిసిన రోజు..
"ఆమె"(అతివ) లో కంటిలో చెమ్మ చేరనీయకుండా చుసిన రోజు...
ఆ రోజే అసలయిన "దీపావళి " పండుగ ..
ఆ పండుగ ప్రతిరోజు రావాలి...ఇక తారా జువ్వలెందుకు ..
ప్రతి ఇంటిలోనూ ఇంతి ధరహాస చంద్రికల విరుపులున్నపుడు..
"ఆమె "(అతివ ) పంచే ప్రేమామృతాలను నిత్యం సేవిస్తూ..
ఆనందాలను ఒడిసి పట్టుకొన్న క్షణాలు అమరమైనాక !!
ఆమె (అతివ ) కంటి పాపల దీపాల వెలుగులతో..నిత్య దీపావళులే ఇక !!
***** ***** ****** *****
No comments:
Post a Comment