అమ్మ-నాన్న.. - అచ్చంగా తెలుగు

అమ్మ-నాన్న.. 

హరీష్  


అమ్మది అణకువ ..,
తోమ్మిదిమాసాలు కాదు 
తొంబైయేళ్ళు గుండెల్లో ఊయలాడిస్తుంది.. 
నాన్నది  నమ్మకం ..,
పడుతూ లేస్తున్నా 
తడబడుతూ ఆరంభిస్తున్నా 
నడకొక్కటే కాదు నడవడికా నేర్పిస్తారు.. 
వండేటప్పుడు పుట్టిన ఆకలిని 
వడ్డిస్తు కడుపు నింపుకుంటుంది అమ్మ.. 
నచ్చకపోతే నటించలేని నాన్న 
నచ్చినట్టు తిడుతూనే  నెత్తిన పెట్టేసుకుంటాడు.. 
అందకపోయినా  తీర్చాలని 
మిన్ను చంద్రాలకి ఆరాటాలు అమ్మవి.. 
అందుతూ అందిస్తూ 
అంతులేని ధైర్యం నాన్నది .. 
అమ్మలో  ప్రేమ వినిపిస్తూ 
             కోపాలు కనిపిస్తూ ఉంటే ,
నాన్నలో ప్రేమ కనిపిస్తూ 
                కోపాలు వినిపిస్తాయి ..
అమ్మ కష్టంలో కనిపిస్తున్న కోపం 
నాలుగు తిట్లతో నడిచినా 
ఇచ్చే సమయానికి సమాప్తమే .,
నాన్న కోపం మాటతో మొదలై 
అరచేతి గరుకుదనంతో సాగి 
కావాల్సింది అడిగే అవకాసంతో ముగుస్తుంది.. 
అమ్మ చూపులో నమ్మకం 
నాన్న భారోసాలో ధైర్యం 
ప్రతిరూపం ప్రతిబింబించాలనే ..!!
                                                                                                                                                                 *****                  

No comments:

Post a Comment

Pages