సరదా ఫన్ (వం )టకం - అచ్చంగా తెలుగు

సరదా ఫన్ (వం )టకం 

గొట్టాం రేకులు (చాలా కాస్టు గురూ)

పిన్నలి గోపీనాథ్ 


కావలసినవి:
జన శతాబ్ది సీట్లు ... రొండుకు మించి ( పర్సును బట్టి)
బియ్యప్పిండి ... ఆ యొక్క సీట్లననుసరించియే
చక్కెర బలపాలు... తగినన్ని.
 నీరు ... తాగునీరు తగినంత, వాడకం వలయునంత.
పెద్ద స్టీలు ప్లేటు ... అంచుల్లేనిది
చాకు,  బర్నాలు, తువ్వాలు.
-------------------------------
తయారీ విధానం...
ముదుగా హైదరాబాదు నుంచి పుణె వైపు లేదా అటు నుంచి ఇటు వచ్చే జనశతాబ్ది అయిన వారితో మాత్రమ ఎక్కవలెను. అందులో మనం ఎక్క ు వేళను బట్టి సాయంతరమో, పొద్దుగాలో సీటుకు రొండు వంతున రొట్టె కర్రలు ఇచ్చెదరు. అటులనే అమూల్(యమైన)  వెన్నను, రసమునూ అందించెదరు. వాటిని అక్కడే ఆరగించకుండా మనవారందరి నుంచీ సేకరించి (అందుకే అయినవారితో ఎక్కమనుట) భద్రపరచుకొనవలెను. తదుపరి....
ఇల్లు చేరిన తరవాత...
  తెచ్చుకున్న కర్రలపై వెన్న పట్టించాలి. వాటిని అసింటా దూరం దూరంగా పళ్ళెంలో పెట్టుకోవాలి.  బియ్యప్పిండిను శుభ్రం చేసుకోవాలి.. దానిలో ఏమీ కలపకుండా (నే) పల్చగా కర్రలపై చుట్టూరా అద్దుకోవాలి.
ఆరాయనుకున్న తర్వాత చాకుతో జాగ్రత్తగా వేలుకు 'ఏదీ' తగలకుండా
సదరు పిండిని నిలువు ముక్కలుగా కోసుకుంటూ తీయాలి. దరిమిలా సదరు రేకులను అలా నిలువుగానే బలపాల చుట్టూ అంటించాలి..
ఫినిష్. గొట్టం రేకులు తయార్.
కాగా, శతాబ్దిలో అందించు రసమును ఇట్లే మర చెంబుల్లో ( అంతలేసి ఇవ్వరు, మన సేకరణ కర్తల పుణ్య ఫలమే) తెచ్చుకుందుము గాన అయ్యది హాటు కింద వాడుకొన వచ్చును. లేదా కర్రలను అందులో ముంచుకుని స్వీహాటుగానైననూ సరియే....
బర్నాలు, తువ్వాలు ఏలకో చెప్పబని లేదు గదా....

No comments:

Post a Comment

Pages