లేత చింతకాయలతో - అచ్చంగా తెలుగు

లేత చింతకాయలతో

Share This

లేత చింతకాయలతో

శ్రీప్రియ


లేత చింతకాయలు వచ్చే కాలమిది. ఈ సమయంలో వాటితో ఏమేమి చెయ్యవచ్చో చూద్దామా ?
కొబ్బరికాయ - చింతకాయ పచ్చడి:
6,7 లేత చింతకాయలు, ఒక చిప్ప కొబ్బరికాయ ముక్కలు , 4 పచ్చిమిర్చి, 5 వేయించిన ఎండుమిర్చి, తగినంత ఉప్పు, పసుపు కలిపి మిక్సీ లో మెత్తగా రుబ్బి, పైన ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు , ఇంగువ నూనెలో వేయించిన తిరగమాత పెట్టండి. పచ్చడి తయార్ .
చింతకాయ పప్పు :
 6,7 చింతకాయలను కడిగి, కోసి, చిన్న గ్లాసుడు కందిపప్పులో వేసి, కుక్కర్ లో పెట్టండి. ఉడికాకా, ఆపేసి పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర, ఇంగువ తాలింపు పెట్టుకోండి.
చింతకాయ - పండుమిర్చి పచ్చడి:
చింతకాయలతో పాటు పండుమిర్చి కూడా ఈ కాలంలో బాగా దొరుకుతుంది. 100 గ్రా పండుమిర్చి ముక్కలు, 50 గ్రా. చింతకాయ ముక్కలు, తగినంత ఉప్పు, పసుపు వేసి మిక్సీ లో మెత్తగా రుబ్బండి. తర్వాత రెండు చెంచాలు మెంతిగుండ (స్పూన్ మెంతులు, రెండు స్పూన్ల ఆవాలు, 8 ఎండుమిర్చి కాస్తంత నూనెలో ఎర్రగా వేయించి కొట్టిన పొడి), ఆవాలు, ఇంగువ నూనెతో తాలింపు పెట్టుకోవాలి. ఇది వారం పాటు నిలవ ఉంటుంది. ఫ్రిజ్ లో పెడితే యెంత కాలమైనా ఉంటుంది.
చింతకాయ చారు :
మామూలుగా చింతపండు వేసి పెట్టే చారులో చింతపండు బదులు, 3 తరిగిన చింతకాయలు దంపి వేసి చూడండి, ఇదో గొప్ప రుచి.
చింతకాయ పచ్చడి :
100 గ్రా. చింతకాయలు, 6 పచ్చిమిర్చి, కాస్త కొత్తిమీర, తగినంత ఉప్పు  కలిపి మెత్తగా మిక్సీ వెయ్యండి. దీనిలో రెండు చెంచాల మెంతి గుండ, ఆవాలు, ఇంగువ పోపు వేసుకుంటే పచ్చడి తయార్. ఫ్రిజ్ లో పెడితే ఇంకా ఎక్కువ కాలం నిలవ ఉంటుంది.

No comments:

Post a Comment

Pages