మహిళా... నీకు నీవే సాటి. - అచ్చంగా తెలుగు

మహిళా... నీకు నీవే సాటి.

Share This

మహిళా... నీకు నీవే సాటి.

కసవరాజు కృష్ణ 


ఆడవారు గూగుల్ లాంటి వారు ఇది లేకుండా ప్రపంచం నడవదు.... ఆడవారు మనం తాగే టీ బాగ్ లాంటి వారు  వేడి నీరు అనే జీవితం లో మునిగాక తెలుస్తుంది వారు ఎంత స్ట్రాంగ్ ఓ ..చక్రం కనిపెట్టి ఉండకపోతే మానవుడికి మనుగడ ఎలా లేదో..స్త్రీ లేకపోతే సున్యం.
మగవాడు పురుషుడు అనడానికి రెండు పెదాలు కలవడం అవసరం అదే స్త్రీ ఆడది అనడానికి పెదాలు కలవడం అవసరం  లేదు ..స్త్రీ స్వతంత్రం గా జీవించగలడు..మొగవాడు తోడూ లేకుండా ఉండలేడు
జన్మనిచ్చేది నువ్వే..ఆ జన్మకు సార్ధకత నీవే...జీవితాన సగాభాగమై తోడు వుండేది నీవే ..తోడబుట్టిన ఋణం తీర్చుకోడానికి నువ్వే.....అన్నగా నా బాద్యత నెరవేర్చడానికి నువ్వే...నాన్నగా నాకు హోదా కల్పించింది నువ్వే..ప్రాణం పోసేది డాక్టర్ ఐన...సిస్టర్ గా నీ సేవలు మరవలేము....మా మనసులను కడిగి శుభ్రం గా ఉంచే నీ హృదయానికి వేల జోహార్లు
పిల్లవాడ్ని స్కూల్ లో వదిలి పెట్టక మనం జాగర్త గా చూడమని చెప్పేది స్కూల్ ఆయాల కి ..ఆయ అంటే...అమ్మ వచ్చేదాకా అమ్మలా చూసుకునే అమ్మ...వారు నిత్య పనిమనుషులు..అంటే అన్ని పనులు చేసేవారు కాదు అన్ని పనులు తెలిసిన వారు
వంటింటి దగ్గరనుంచి wimbeldon దాక ఎక్కడ చుసిన ఆడవారే.....ఉదయం మనకు కాఫీ కలిపి అందించేది...నీకు అల్పాహారం పెట్టేది  ఆ తల్లే...భోజనం కారియర్ లో సర్ది పంపేది అమ్మే .. ఇంటి పనులు చక్కగా నిర్వర్తించే  మహిళ కి ప్రపంచాన్ని ఉద్దరించడం ఓ లెక్క కాదు...ఆఫీస్ లో కి వెళ్తే మేనేజర్ ....అమెరికా నుంచి వచ్చే క్లయింట్..లోకసభ లో ఆమె .కాంగ్రెస్ లో ఆమె....తమిళనాడు ఎలేది ఆమె...బెంగాల్ ను పాలించేది ఆమె.....బ్యాంకు కు చైర్మన్ ఆమె ..బాడ్మింటన్ ఛాంపియన్ ఆమె...కుస్తీలలో ఆమె...కుర్చీలో ఆమె...పాట లో ఆమె ..ఆట లో ఆమె.....వ్యాఖ్యాత ఆమె ..వ్యాసాలు రాసేది ఆమె..కర్ణాటక సంగీతం ఆమె...కృష్ణ భజనలు ఆమె...ప్రపంచ సుందరి ఆమె..కవి కోకిల ఆమె..
ఇన్ని రంగాలలో ఆడవారు వీర ప్రతాపం చూపించిన..ఆడపిల్ల పుట్టింది అనగానే ఆముదం తాగిన మొహం తో ఏడుపుతో వచ్చిన నవ్వు ఒకటి నవ్వుతాం.....ఎందుకంటే...ఇంకా ఈ దేశం లో ఆడవారు ఎక్కడో ఓ చోట అన్యాయానికి గురి కావడమే....స్త్రీలు తమ ప్రాణం కన్నా మానానికి విలువ ఇవ్వడమే.....ఏమి తిలిని పసి పిల్ల దగ్గరనుంచి అందరికి ఎదో ఒక రకం గా ప్రమాదాలు జరగడమే..దీనికి కారణం ఎవరు..!
ఎవరికన్నా అన్యాయం జరిగితే జాలి పడి ..అయ్యో ఇలా జరిగి ఉండకూడదు అని వాళ్లకి సానుభుతూలు తెలపడం మాని సహయం చెయ్యడానికి ప్రయత్నం చెయ్యండి.....అర్ధరాత్రి ఆఫీస్ లో కష్టపడి ఇంటికి వచ్చే మహిళల ను చూసి హేళన చెయ్యడం మానుకోండి..మీరు చెయ్యలేని పని వారు చేస్తున్నారు అని గర్వించండి.....
బస్సు లో లేడీ కండక్టర్ అంటే విచిత్రం గా చూస్తారు...ఈ మధ్య ఒక మహిళా గూడ్స్ రైలు కు డ్రైవర్ గా చేరింది.. విమానాల్లో పైలట్ ..రాకెట్ లో వెళ్ళిన సునీత ..రాకెట్ లా దూసుకుపోతున్న సింధు ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం..
పొరపాటున ఏదైనా తప్పు జరిగితే దెప్పి పొడవటం ఆపండి.....వారి ముందు జాలి పడుతునట్టు నట్టించి పక్కవారికి వారి సంగతులు మోసి..మురిసిపోకండి..
ఇప్పటికే పెళ్ళికాని మొగవారి సంఖ్యా పెరిగి పోయి..బెండకాయల్ల ముదిరి పోయారు..ఇంకొన్నాళ్ళు ఇలానే వుంటే పరిస్థితి చేయి దాటి పోయి..ఒక మొగవాడు ఇంకో మొగవాడ్ని చేసుకొనే పరిస్థితి వచ్చిన రావొచ్చు..అది కుడా వచ్చేసింది అంటే చేసేదేం లేదు ..
****

No comments:

Post a Comment

Pages